అందరికీ రుణ సాయం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • రైతులు, చిన్న వ్యాపారులకు కేంద్రం భరోసా
  • ఒకే దేశం.. ఒకే రేషన్‌.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో అమలు
  • వలస కార్మికులకు చవగ్గా అద్దె ఇళ్లు
  • వారికి మరో రెణ్నెల్లు ఉచిత ఆహార ధాన్యాలు
  • ప్యాకేజీ రెండో దశ వివరాలు తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
  • ‘ముద్ర శిశు’ కింద పెద్దఎత్తున రుణాలు
  • 5 వేల కోట్ల ప్రత్యేక రుణ సదుపాయం
  • వీధి వ్యాపారులకు రూ.10 వేల రుణాలు
  • గృహనిర్మాణానికి 70 వేల కోట్ల ఉత్తేజం
  • కాంపా పథకానికి రూ. 6 వేల కోట్లు
  • చిన్న, మధ్య తరహా రైతులకు రుణాలు
  • 5 కోట్లమందికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు
  • అందరికీ కనీస వేతనాలపై పరిశీలన

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో రెండో దశ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం వెల్లడించారు. వలస కార్మికులు, రైతుల సంక్షేమంపై ఇందులో ప్రత్యేకంగా దృష్టిసారించారు. ముఖ్యంగా.. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు రేషన్‌ కార్డు ఉన్నా, అది వారు పని చేసే రాష్ట్రంలో ఉపయోగపడే పరిస్థితి లేదు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ‘ఒకే దేశం- ఒకే రేషన్‌’ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని నిర్మల తెలిపారు. ఇందుకు సంబంధించిన టెక్నాలజీ ఆధారిత వ్యవస్థను రూపొందించి 2021 మార్చికల్లా 100 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు.. దేశంలో ఉన్న వలస కార్మికులందరికీ పీడీఎస్‌ కార్డులు లేకున్నా సరే, వచ్చే రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తామని చెప్పారు. వలస కార్మికులకు ఇళ్ల నిర్మాణంతో పాటు రైతులకు రుణం వంటి అనేక నిర్ణయాలను ఆమె వెల్లడించారు. ఈ ప్యాకేజీలో ముఖ్యాంశాలు..

  1. సొంత గ్రామాలకు తిరిగి వెళ్లిన వలస కార్మికులకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం కింద ఉపాధి. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలు పంపించనున్న కేంద్రం.
  2. వివిధ రాష్ట్రాల్లోని వలసదారులకు ఆహార ధాన్యాల సహాయం. దీని కింద.. జాతీయ భద్రత చట్టం పరిధిలోకి రాని పీడీఎస్‌ కార్డులు లేని వారందరికీ ఒకొక్కరికీ 5 కిలోల బియ్యం, ఒక కిలో పప్పుధాన్యాలు అందజేస్తారు. దీనివల్ల 8 కోట్ల మందికి లబ్ధి. ఇందుకు అయ్యే రూ.3500 కోట్ల ఖర్చును కేంద్రమే భరిస్తుంది. దీని అమలు, వలసదారుల గుర్తింపు, మార్గదర్శకాల రూపకల్పన రాష్ట్రాల బాధ్యత.
  3. వలస కార్మికులు దేశంలో ఎక్కడున్నా తమ రేషన్‌ కార్డులు ఉపయోగించుకునేందుకు వీలుగా టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ ఏర్పాటు. ‘ఒకే దేశం ఒకే రేషన్‌’ పేరుతో అమల్లోకి తెచ్చే ఈ విధానం ఆధారం గా ఈ ఏడాది ఆగస్టు నాటికి 27 రాష్ట్రాల్లో 67 కోట్లమందికి లబ్ధి కలగనుంది.
  4. వలస కార్మికులకు భరించదగ్గ అద్దెతో నివాస గృహాలు కల్పించేందుకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన క్రింద త్వరలో ఒక పథకాన్ని  అమలు చేయనున్న ప్రభుత్వం. ఉత్పాదక యూనిట్లు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా, వారి భూమిలో ఇళ్లు నిర్మించడం ద్వారా, ప్రధాన నగరాల్లో ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఇళ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఈ పథకం అమలు. టోల్‌ రోడ్ల మాదిరి కొంత డబ్బు అద్దె ఇవ్వడం ద్వారా ఇళ్లలో నివసించే సౌకర్యం కల్పించాలనీ చూస్తున్నట్టు తెలిపిన మంత్రి. రాష్ట్ర ప్రభుత్వాలకూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉంటుంది.
  5. ముద్ర శిశు పథకం క్రింద రూ. 50వేల లోపు రుణాలు తీసుకున్న వారందరికీ ఏడాది వరకూ ఈఎంఐ చెల్లింపులో 2ు మేరకు వడ్డీ రూపేణా ప్రభుత్వం మద్దతు. దీనివల్ల మూడు కోట్ల మందికి పైగా చిన్నవ్యాపారులకు ప్రయోజనం.
  6. వీధుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సులభంగా రుణం అందించే పథకం త్వరలో ప్రారంభం. 50 లక్షల మంది వీధివ్యాపారులు  10 వేల చొప్పునరుణాలు తీసుకునే అవకాశం ఉంటు ంది. ఇందుకోసం రూ.5 వేల కోట్లు కేటాయింపు.
  7. గృహ నిర్మాణ వర్గానికి ప్రోత్సాహం కల్పించేందుకు రూ.70వేల కోట్లు విడుదల. గృహ నిర్మాణ బ్యాంకు ల ద్వారా ఈ రుణాలు లభిస్తాయి. ఇప్పటికే అమ లు ఉన్న క్రెడిట్‌ లింక్‌డ్‌ సబ్సిడీ పథకం 2020 మార్చి నుచి 2021 మార్చి వరకూ పొడిగింపు.
  8. అడవులు, మొక్కల పెంపకం, అడవుల యాజమాన్యం, వన్యప్రాణులకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, వన్యప్రాణి సంరక్షణకు సంబంఽధించి.. రాష్ట్రాల నుంచి కాంపా(కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ) కింద 6వేల కోట్ల మేరకు ప్రాజెక్టు ప్రతిపాదనలు వచ్చాయని, వాటన్నిటినీ 10 రోజుల్లో మంజూరు చేస్తామని చెప్పిన మంత్రి. దీనివల్ల గిరిజనులు, ఆదివాసీలకు ఉపాఽధి లభించనుంది.
  9. దేశంలో చిన్న, మధ్య తరహా రైతులకు తక్షణం రుణం అందించేందుకు అత్యవసర వర్కింగ్‌ కాపిటల్‌ నిధి కింద నాబార్డ్‌ ద్వారా రూ. 30 వేల కోట్లు అదనంగా విడుదల. ప్రస్తుతం అందిస్తున్న రూ.90 వేల కోట్లకు ఇది అదనం. నాబార్డ్‌ నుంచి దేశంలోని 33 రాష్ట్రస్థాయి, 351 జిల్లాస్థాయి, 43 గ్రామీణ స్థాయి సహకార బ్యాంకుల ద్వారా సాయం అందుతుంది. 3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం.
  10. పీఎం-కిసాన్‌ లబ్ధిదారులకు కిసాన్‌ క్రెడిట్‌కార్డుల ద్వారా.. రూ.2లక్షల కోట్ల మేర రాయితీతో కూడిన రుణాల అందజేత. మత్స్యకారులు, పాడిరైతులకూ ఈ కార్యక్రమం వర్తిస్తుంది. రైతులందరికీ రాయితీ వడ్డీలతో సంస్థాగత రుణాలు. ఈ రుణాల ద్వారా దాదాపు 2.5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం.
  • అందరికీ కనీస వేతనం

లేబర్‌ కోడ్‌ ద్వారా దేశంలోని కార్మికులందరికీ సార్వజనీనంగా కనీస వేతనం లభించేలా చర్యలు తీసుకుంటామని.. ఈ అంశం పార్లమెంటు పరిశీలన లో ఉన్నదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అందరికీ నియామక పత్రాలు, ఈఎ్‌సఐ సౌక ర్యం లభించాలని భావిస్తున్నామన్నారు. ప్రమాదకర పని పరిస్థితుల్లో పనిచేసే వారందరికీ ఈఎ్‌సఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మహిళలకు సరైన రక్షణ చర్యలతో రాత్రి పూట విధులకూ వారికి అనుమ తి వంటివి పరిశీలనలో ఉన్నాయని ఆమె తెలిపారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates