బాబా సాహెబ్ అంబేద్కర్ పై విషం చిమ్మిన కార్టూనిస్టులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రాజకీయ కార్టూనిస్టులకు కూడా కుల వివక్ష ఉంటుందా? తాజా రాజకీయ పరిణామాలపై నాయకుల తీరుపై సమాజ ధోరణుల పైన తాము నిష్పక్షపాతంగా సమ దృష్టితో వ్యంగ్య చిత్రాలు వేస్తుంటామని కార్టూనిస్టులు పేర్కొంటాంరు. అయితే మన పత్రికలు, మ్యాగజైన్లు, నేడు టీవీ వార్తా ఛానెళ్లు వంటి ప్రసార మాధ్యమాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే వీరి ఆబ్జెక్టివిటీ ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. ముఖ్యంగా మహిళలు, మైనార్టీలు, దళిత బహుజనుల పట్ల కార్టూనిస్టుల దృష్టి కోణం ఏమిటనేది స్పష్టమవుతుంది.

భారత స్వాతంత్రోద్యమకాలంలో గాంధీ, నెహ్రు అంబేద్కర్ల పైన వచ్చిన కార్టూనుపై పరిశీలిస్తే బాబాసాహెబ్ పట్ల కులవిద్వేషం కొట్టవచ్చిట్లుగా బయటపడుతుంది. కార్టూనిస్టులు అంబేద్కర్ ని విలన్ గానూ బఫూన్గానూ చూపేవారు. భారతదేశ పత్రికలు కాంగ్రెసకు చెంచాలు అనేవారు అంబేద్కర్. ఆయన మాటల్లో చెప్పాలంటే జాతీయవాద ప్రెస్ అంటే కాంగ్రెస్, బ్రాహ్మణుల పత్రికలే. గాంధీ నెహ్రూలపై ఆనాడు వచ్చిన కార్టున్ల గురించి ప్రత్యేక్షంగా పుస్తకాలు వచ్చాయి. కాగా అంబేద్కర్ గురించి ఈ కోణంలో ఇటీవలి వరకు అధ్యాయనాలు జరుగలేదు. ఈ లోటుగా తీరుస్తూ ప్రముఖ అంబేద్కర్ వాద కార్టూనిస్టు వున్నమతి శ్యామ్సుందర్ “నో లాఫింగ్ మ్యాటర్” పేరిట తాజాగా ఒక అధ్యయనాన్ని పుస్తక రూపంలో వెలువరించారు. నవయాన సంస్థ దీన్ని ప్రచురించింది. శ్యాం ప్రస్తుతం జవహార్ లాల్ నెహ్రు యూనివర్సిటీలో పిల్లల పత్రిక చందమామలో ప్రచురితమైన బొమ్మలపై పి.హెచ్.డి చేస్తున్నారు. ఆయన తెలుగువారు.

ఎన్.సి. ఆర్.టి పాఠ్యపుస్తకంలో అంబేద్కర్ ను కించపరుస్తూ ప్రచురించిన కార్టూనిస్టుపై 2011లో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. 1949లో శంకర్స్ వీళ్లిలో శంకర్ ఈ కార్టూన్ వేశారు. భారత రాజ్యాంగ రచన నత్తనడకన సాగుతున్నట్లు అందుకు ప్రతీకగా బాబాసాహెబ్ అంబేద్కర్ నత్తపై కూర్చొనగా వెనకాల నెహ్రు కొరడా ఝళిపిస్తున్నట్లు ఈ చిత్రం ఉంటుంది. భారత రాజ్యాంగ రచన ప్రక్రియ ధీర్ఘకాలం నడవటానికి దళితుడైన అంబేద్కర్ కారకులు అనే బ్రాహ్మణవాద వ్యంగ్య చిత్రం ఇది. రాజ్యాంగ రచనకు బాబాసాహెబ్ ఎంత అధ్యయనం చేశారో ఎంత శ్రమించారో చివరికి తన ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టారో అందరికీ తెలిసిందే. రాజ్యాంగంపై వేలాది సవరణలు రాగా అందులో 2,473 సవరణలపై చర్చించి నిర్ణయాలు చేశారు. పై కార్టూన్ పై వచ్చిన నిరసనల ద్రుష్ట్యా ప్రభుత్వం సుఖదేవ్ థోరట్ అధ్వర్యంలో పాఠ్యపుస్తకాల సమీక్ష కమిటీని నియమించింది. ఈ కమిటికి సమర్పించేందుకు శ్యాం చేసిన అధ్యయ ఫలితమే ఈ గ్రంధం. ­తన ఈ అధ్యయనంకోసం శ్యాంసుందర్ నాటి ఆంగ్ల పత్రికల ప్రముఖ కార్టూనిస్టులు శంకర్, ఆర్.కే లక్షణ్, వాసు, ఎన్వర్ అహ్మద్, ఓమేన్, రవీంద్ర తదితర వ్యంగ్య చిత్రాలపై సామాజిక అధ్యయనాన్ని చేశారు. నిచ్చనమెట్ల సమాజంలో వ్యంగ్య చిత్రకారులు కూడా కులమత వివక్షలకు అతీతులు కారని “నో లాఫింగ్ మ్యాటర్” రుజువు చేసింది. జాతీయోద్యమ కాలంలో ఆనాటి పత్రిలు తొలుత అసలు అంబేద్కర్ వార్తల ప్రచురణనే అడ్డుకునేవి. క్రమంగా ఇది సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో అత్యధిక శాతం కార్టూన్ల ప్రచురణలో మనకు బాబాసాహెబ్ పట్ల వివక్షా విషంకక్కటం వంటి ధోరణి దర్శనమిస్తుంది.

పత్రికలు తొలత బాబాసాహెబ్ వార్తలకు చోటు కల్పించేవికావు. సౌత్ బరో కమిటీకి అంబేద్కర్ దళితులకు ప్రత్యేక రిజర్వ్ నియోజకవర్గాలను కోరుతూ నివేదించటం ఆనాడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. మహాద్ చెరువు సత్యాగ్రహం రౌండ్ టేబుల్ సమావేశం కులనిర్మూలన ఉపన్యాసం వూనా ఒప్పందం అనబడే గాంధీ అంబేద్కర్ సంవాదం హిందూ మతాన్ని వీడతానంటు అంబేద్కర్ ప్రకటన, హిందూకోడ్ బిల్ … ఇలా బాబా సాహెబ్ ప్రతీ అడుగు, ప్రతిచర్య ప్రతిరచణ, ప్రతి ఉపన్యాసాన్ని హిందూ అగ్రవర్ణ శక్తులు జీర్ణించుకోలేకపోయాయి. అగ్రహంతో రగిలిపోయాయి. దళితుల చైతన్యం వారి మానవహక్కులకోసం సంఘటితం, సామాజిక న్యాయం కోసం చేసిన ప్రతీ ఉద్యమం మితవాద శక్తులకు ఏమాత్రమూ నచ్చలేదు. సరికదా అడుగడుగన దాడులు, దుష్ప్రచారాలు, ఓడించేందుకు ప్రయత్నాలు, విషపు కార్టూన్లు… మహిళల హక్కులకోసం ఉద్దేశించిన హిందూకోడ్ బిల్లును ప్రతిపాదించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పైన నీచమైన కార్టూన్లు వీటన్నింటికీ పరాకాష్ట. 1951లో డా. అంబేద్కర్ నెహ్రు ప్రభుత్వం నుంచి రాజీనామా చేస్తే శంకర్ ఆయన్ను 5గురు భర్తలతో పడుకునే ద్రౌపదిగా చిత్రిస్తూ కార్టూన్ వేశాడు. ఇలాంటి ఉ దాహరణలెన్నో పేర్కొంటూ ఎంపికచేసిన కార్టూన్లు, వాటి వివరణ రూపంలో శ్యాం సుందర్ తీసుకువచ్చిన ఈ అద్భుతమైన పుస్తకం భారత రాజకీయ కార్టూన్ల పై తొలి అంబేద్కరైట్ విశ్లేషణగా చరిత్ర సుృష్టంచనున్నది. మీడియా సమదృష్టి డొల్ల తనాన్ని బట్టబయలు చేయనున్నది. అన్ని భారతీయ భాషల్లోనూ ఈ పుస్తకాన్ని అనువాదం చేయాల్ని అవసరం ఉన్నది. అలాగే భారతీయ ప్రాంతీయ భాషా పత్రికల్లో బాబాసాహెబ్ పై వచ్చిన కార్టూన్లపై కూడా విస్తృత పరిశోధన జరగాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఇప్పటివరకు మీడియాలో వచ్చిన వ్యంగ్య చిత్రాలను కులవర్గ దృష్టికోణం నుంచి విశ్లేషించటం పరిశోధకుల బాధ్యత. ఈ బాధ్యతను అంబేద్కరైట్ మేధావులు నిర్వహించగలరని ఆశిద్దాం.

క్యాప్షన్లు

  1. హిందూయిజాన్ని స్వచ్ఛపరచటమే నా లక్ష్యం – మహాత్మా గాంధీ.Ambedkara Cartoons
  2. హిందూయిజం ఒక అంటువ్యాదిలాంటిది దాన్ని నిర్మూలించాలని డా. అంబేద్కర్ చెబుతున్నారు.Ambedkar Cartoon
  3. రాజ్యాంగ రచన భారాన్ని మోయలేని అసమర్దులు సమర్థులైన బాబాసాహెబ్ కు బాధ్యత అప్పగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినా వ్యంగ్యాస్త్రంAmbedkar Cartoon
  4. మహిళలకు హక్కులు ప్రసాదించే హిందూ కోడ్బిల్లు ధర్మశాస్త్రలకు వ్యతిరేకమంటూ అగ్రహిస్తున్న సనాతనులు.
  5. భారతీయ సమాజ రుగ్మతల్ని (హిందూకోడ్ బిల్లు) నయం చేసేందుకు ప్రయత్నిస్తున్న వైద్యునిపై రోగి వీరంగం
  6. రాజ్యాంగ రచన నత్తనడకన సాగుతుందంటూ అంబేద్కర్ పై కొరడా ఝలిపిస్తున్న నెహ్రు
  7. భారత రాజ్యాంగ రచనా భారమంతా దాదాపుగా తన బుజస్కందాలపై మోసారు అంబేద్కర్. ఈ కార్టూన్లో కలియుగ భీముని వంటలో ఉప్పు ఎక్కువ అయ్యిందని, సరిగ్గా ఉడకలేదని.. ఇతరత్రా వంకలు పెడుతున్న సభ్యులు.
  8. హిందూ కోడ్ బిల్లు విడాకులకు సులభంగా దారిచూపుతుందంటూ వ్యంగ్యం.
  9. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, సోషలిస్టు పార్టీ ఎన్నికల ఒప్పందంపై వ్యంగ్య కార్టూన్. డా. అశోకా మెహతాకు అంబేద్కర్ గడ్డం గీస్తున్నట్లు చిత్రం.
  10. అంబేద్కర్ సోషలిస్టుల స్నేహాన్ని విమర్శించిన డాంగే బాబాసాహెబ్ను మహిళగా చిత్రిస్తూ ఎవరితోనైనా తిరుగుతాడని ఎగతాళి.

[avatar user=”[email protected]” size=”thumbnail” align=”right”]రచయిత సీనియర్ జర్నలిస్ట్ బి.భాస్కర్ మెబైల్ : 9989692001[/avatar]

RELATED ARTICLES

Latest Updates