‘టీబీ’ మిషన్పై కరోనా టెస్టులు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
-రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రంలో నిర్వాకం
– ప్రయివేటు ఆస్పత్రులతో కుమ్మక్కు
– నిలిచిన టీబీ సేవలు
ఎర్రగడ్డలోని రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రంలో గుట్టుగా కోవిడ్‌-19 పరీక్షలు చేస్తున్నారు. కొన్ని ప్రయివేటు ఆస్పత్రులతో కుమ్మక్కైన ల్యాబ్‌టెక్నీషియన్‌ ఈ తతంగం నడుపుతున్నట్టు ఆరోపణలున్నాయి. అతనికి కొందరు ఉన్నతాధికారుల అండ ఉన్నట్టు సమాచారం. ఈ కేంద్రంలో పనిచేసే ఎపిడమాలజిస్ట్‌ ఆధ్వర్యంలో బాక్టీరియాలజిస్ట్‌, డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్స్‌ పర్యవేక్షణలో అత్యంత గోప్యంగా పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శిక్షణా కేంద్రం డైరెక్టరే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.

కరోనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ కొన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు అనుమతులిచ్చిన విషయం విదితమే. ఎర్రగడ్డలోని రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రం కూడా దరఖాస్తు చేసుకోగా క్షయ రోగులకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించి అనుమతులివ్వలేదు. ఈ శిక్షణా కేంద్రంలో దాదాపు 70 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఇక్కడే హైదరాబాద్‌ జిల్లా టీబీ కేంద్రం కూడా ఉంది. అయితే, క్షయ శిక్షణా కేంద్రంలోని అధికారులు ఎలాంటి అనుమతులూ, వసతులూ లేకుండానే కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. దీని వల్ల ఇప్పటికే ఇక్కడ పని చేసే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారందరూ 10 రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. సిబ్బంది విధుల్లోకి రాక ముందు.. వెళ్లిపోయాక.. ఎవరూ లేని సమయంలో గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సిబ్బందిలో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.

ఐదుసార్లు పరీక్షలు..
రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రంలో ఇప్పటి వరకు ఐదు సార్లు గోప్యంగా పరీక్షలు చేయగా, దాదాపుగా 15-20 మందికి పాజిటివ్‌ వచ్చింది. అనుమానితుల నుంచి ల్యాబ్‌ బయటనే శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. విధులు ముగించుకుని సిబ్బంది మొత్తం వెళ్లిపోయాక ల్యాబ్‌ టెక్నీషియన్‌ పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం. ఆ ప్రాంతంలో కనీసం శానిటైజ్‌ కూడా చేయడం లేదు.

మరోసారి టెస్టులకు రంగం సిద్ధం..
మరో బ్యాచ్‌కు కరోనా టెస్ట్‌లు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి ఐదేండ్లు డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఇక్కడి ఎపిడమాలజిస్ట్‌ అండతో క్షయ పరీక్షల ముసుగులో కరోనా టెస్టులు చేస్తున్నారు. పరీక్షలు చేశాక శాంపిల్స్‌కు నెంబర్లు కూడా వేడయం లేదు. బాధితుల పేర్లను సైతం మార్చేస్తున్నారు. సొంత వాట్సప్‌, మెయిల్‌ ద్వాదా రిపోర్టులను బాధితులకు పంపుతున్నట్టు తెలుస్తోంది.
నిలిచిన టీబీ సేవలు..
క్షయ శిక్షణా కేంద్రంలో కోవిడ్‌ పరీక్షలు చేస్తుండటంతో టీబీ సేవలు నిలిచిపోయాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చిన బాధితులకు టీబీ టెస్టులు చేసి రిపోర్టు ఇవ్వకుండా స్టోర్‌ రూంలో పడేస్తున్నారు. దీంతో కొంత మంది తమకు టీబీ ఉందా? లేదా? అని తెలుసుకునే లోపే చనిపోతున్నారు. ఇక్కడికి రోజూ 100 మంది వరకు టీబీ రోగులు వస్తుంటారు. మా ల్యాబ్‌ కరోనా టెస్టులకు ఐడెంటిఫైడ్‌ కాదు. ఇక్కడ కోవిడ్‌ పరీక్షలు చేయడం లేదు. మీకు తప్పుడు సమాచారం వచ్చింది.
– రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం, ఎర్రగడ్డ
టీబీ పరీక్షల మిషన్‌కు చిప్‌ మార్చి..
శిక్షణా కేంద్రంలో సిబినాట్‌ అనే మిషన్‌ ఉంది. ఈ మిషన్‌ ద్వారా టీబీ టెస్టులు చేస్తుంటారు. అప్‌డేటెడ్‌ మిషన్‌ కావడంతో చిప్‌ మారిస్తే కోవిడ్‌ టెస్టులు కూడా చేయడానికి వీలుంటుంది. ఈ మిషన్‌లో పొందుపర్చిన సమాచారాన్ని డిలీట్‌ చేయడానికి రాదు. ఏ సమయంలో ఎవరికి టెస్టు చేశారు అనే విషయా లు కూడా మిషన్‌లో పొందుపర్చి ఉంటాయి. కాగా, ఇక్కడ కోవిడ్‌ పరీక్షలు చేసేవారు ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉన్నతాధికారుల అండతో క్షయకు వినియోగంచే మిషన్‌తోనే కరోనా పరీక్షలు కూడా చేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులతో కుమ్మక్కై అక్కడి నుంచి శాంపిల్స్‌ సేకరించి ఇక్కడ కోవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. అలాగే, పాజిటివ్‌ వచ్చిన రోగుల వివరాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ పాజిటివ్‌ వివరాలను ప్రభుత్వానికి కూడా చెప్పడం లేదు. రోజూ వెలువడే హెల్త్‌ బులిటెన్‌లోనూ చేరడం లేదు. ఈ చీకటి తతంగానికి వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారుల అండదండలు ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి.’టీబీ’ మిషన్పై కరోనా టెస్టులు!
-రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రంలో నిర్వాకం
– ప్రయివేటు ఆస్పత్రులతో కుమ్మక్కు
– నిలిచిన టీబీ సేవలు
ఎర్రగడ్డలోని రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రంలో గుట్టుగా కోవిడ్‌-19 పరీక్షలు చేస్తున్నారు. కొన్ని ప్రయివేటు ఆస్పత్రులతో కుమ్మక్కైన ల్యాబ్‌టెక్నీషియన్‌ ఈ తతంగం నడుపుతున్నట్టు ఆరోపణలున్నాయి. అతనికి కొందరు ఉన్నతాధికారుల అండ ఉన్నట్టు సమాచారం. ఈ కేంద్రంలో పనిచేసే ఎపిడమాలజిస్ట్‌ ఆధ్వర్యంలో బాక్టీరియాలజిస్ట్‌, డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్స్‌ పర్యవేక్షణలో అత్యంత గోప్యంగా పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శిక్షణా కేంద్రం డైరెక్టరే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.
కరోనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ కొన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు అనుమతులిచ్చిన విషయం విదితమే. ఎర్రగడ్డలోని రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రం కూడా దరఖాస్తు చేసుకోగా క్షయ రోగులకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించి అనుమతులివ్వలేదు. ఈ శిక్షణా కేంద్రంలో దాదాపు 70 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఇక్కడే హైదరాబాద్‌ జిల్లా టీబీ కేంద్రం కూడా ఉంది. అయితే, క్షయ శిక్షణా కేంద్రంలోని అధికారులు ఎలాంటి అనుమతులూ, వసతులూ లేకుండానే కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. దీని వల్ల ఇప్పటికే ఇక్కడ పని చేసే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారందరూ 10 రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. సిబ్బంది విధుల్లోకి రాక ముందు.. వెళ్లిపోయాక.. ఎవరూ లేని సమయంలో గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సిబ్బందిలో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.

ఐదుసార్లు పరీక్షలు..
రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రంలో ఇప్పటి వరకు ఐదు సార్లు గోప్యంగా పరీక్షలు చేయగా, దాదాపుగా 15-20 మందికి పాజిటివ్‌ వచ్చింది. అనుమానితుల నుంచి ల్యాబ్‌ బయటనే శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. విధులు ముగించుకుని సిబ్బంది మొత్తం వెళ్లిపోయాక ల్యాబ్‌ టెక్నీషియన్‌ పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం. ఆ ప్రాంతంలో కనీసం శానిటైజ్‌ కూడా చేయడం లేదు.
మరోసారి టెస్టులకు రంగం సిద్ధం..
మరో బ్యాచ్‌కు కరోనా టెస్ట్‌లు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి ఐదేండ్లు డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఇక్కడి ఎపిడమాలజిస్ట్‌ అండతో క్షయ పరీక్షల ముసుగులో కరోనా టెస్టులు చేస్తున్నారు. పరీక్షలు చేశాక శాంపిల్స్‌కు నెంబర్లు కూడా వేడయం లేదు. బాధితుల పేర్లను సైతం మార్చేస్తున్నారు. సొంత వాట్సప్‌, మెయిల్‌ ద్వాదా రిపోర్టులను బాధితులకు పంపుతున్నట్టు తెలుస్తోంది.
నిలిచిన టీబీ సేవలు..
క్షయ శిక్షణా కేంద్రంలో కోవిడ్‌ పరీక్షలు చేస్తుండటంతో టీబీ సేవలు నిలిచిపోయాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చిన బాధితులకు టీబీ టెస్టులు చేసి రిపోర్టు ఇవ్వకుండా స్టోర్‌ రూంలో పడేస్తున్నారు. దీంతో కొంత మంది తమకు టీబీ ఉందా? లేదా? అని తెలుసుకునే లోపే చనిపోతున్నారు. ఇక్కడికి రోజూ 100 మంది వరకు టీబీ రోగులు వస్తుంటారు. మా ల్యాబ్‌ కరోనా టెస్టులకు ఐడెంటిఫైడ్‌ కాదు. ఇక్కడ కోవిడ్‌ పరీక్షలు చేయడం లేదు. మీకు తప్పుడు సమాచారం వచ్చింది.
– రాష్ట్ర క్షయ శిక్షణా కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేశం, ఎర్రగడ్డ
టీబీ పరీక్షల మిషన్‌కు చిప్‌ మార్చి..
శిక్షణా కేంద్రంలో సిబినాట్‌ అనే మిషన్‌ ఉంది. ఈ మిషన్‌ ద్వారా టీబీ టెస్టులు చేస్తుంటారు. అప్‌డేటెడ్‌ మిషన్‌ కావడంతో చిప్‌ మారిస్తే కోవిడ్‌ టెస్టులు కూడా చేయడానికి వీలుంటుంది. ఈ మిషన్‌లో పొందుపర్చిన సమాచారాన్ని డిలీట్‌ చేయడానికి రాదు. ఏ సమయంలో ఎవరికి టెస్టు చేశారు అనే విషయా లు కూడా మిషన్‌లో పొందుపర్చి ఉంటాయి. కాగా, ఇక్కడ కోవిడ్‌ పరీక్షలు చేసేవారు ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉన్నతాధికారుల అండతో క్షయకు వినియోగంచే మిషన్‌తోనే కరోనా పరీక్షలు కూడా చేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులతో కుమ్మక్కై అక్కడి నుంచి శాంపిల్స్‌ సేకరించి ఇక్కడ కోవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. అలాగే, పాజిటివ్‌ వచ్చిన రోగుల వివరాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ పాజిటివ్‌ వివరాలను ప్రభుత్వానికి కూడా చెప్పడం లేదు. రోజూ వెలువడే హెల్త్‌ బులిటెన్‌లోనూ చేరడం లేదు. ఈ చీకటి తతంగానికి వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారుల అండదండలు ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి.
Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates