జీవాయుధం?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  •  కరోనాను ప్రయోగించేందుకు చైనా పరీక్షలు!
  • వూహాన్‌లోని పీ4 ల్యాబ్‌ నుంచి లీకైన వైర్‌స
  • ఇజ్రాయెల్‌ విశ్లేషకుడి సంచలన ఆరోపణ
  • సర్కారు క్షమాపణ చెప్పబోతోందంటూ
  • చైనీయుడికి చెందిన పత్రికలో కథనం

బీజింగ్‌ : చైనాలో 6000 మందికిపైగా ప్రజలకు సోకి.. 130 మంది మృతికి కారణమై.. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ దానంతట అది ప్రబలింది కాదా? వూహాన్‌లోని జంతుమాంసం విక్రయించే మార్కెట్‌ నుంచి వ్యాపించలేదా? ఆ వైరస్‌ చైనా తయారుచేస్తున్న జీవాయుఽధాల్లో ఒకటా? ప్రయోగశాలలో ఉండాల్సిన ఆ వైరస్‌ పొరపాటున బయటి ప్రపంచంలోకి వచ్చి విస్తృతంగా వ్యాపిస్తోందా? ఇజ్రాయెల్‌కు చెందిన డానీ షోహమ్‌ అనే మైక్రోబయాలజిస్టు, మాజీ సైనిక నిఘా అధికారి ఈ ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానమిస్తున్నారు. ఆయన చెబుతున్నదాని ప్రకారం.. చైనా తన యుద్ధ వ్యూహాల్లో భాగంగా వూహాన్‌లోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో జీవాయుధాలను తయారుచేస్తోంది. నిజానికి రసాయనిక, జీవాయుధాల తయారీపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. వాటివల్ల శత్రు దేశ సైనికులకే కాక సామాన్యులకు కూడా ముప్పు ఉంటుంది కాబట్టి ఈ నిషేధం. కానీ, కొన్ని దేశాలు తమ బయొలాజికల్‌ వార్‌పేర్‌లో భాగంగా రహస్యంగా ఈ తరహా వైర్‌సలను తయారు చేస్తున్నాయనే అనుమానం ఉంది.

చైనా కూడా ఇలాగే చేస్తోందని.. ఈ వైర్‌సను తయారుచేస్తున్న ల్యాబ్‌ వూహాన్‌లోనే ఉందని డానీ షోహమ్‌ చెబుతున్నారు. ఆయన చెబుతున్న ‘వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’ చైనా సర్కారు అధికారికంగా ధ్రువీకరించిన బీఎ్‌సఎల్‌-4 (బయోసేఫ్టీ లెవెల్‌ 4) లేదా పీ4 (పాథోజెన్‌ లెవెల్‌ 4)గా వ్యవహరించే వైరాలజీ కేంద్రం. కరోనా వంటి వైర్‌సలను నియంత్రించేందుకు పరిశోధనల కోసం 2018లో దీన్ని నిర్మించారు. అక్కడ చైనా తన జీవాయుధ యుద్ధ కార్యక్రమంలో భాగంగా కరోనా వైర్‌సలతోపాటు, ఎబోలా, నిపా వైరస్‌ తదితర సూక్ష్మజీవులపై పరిశోధనలు చేస్తోందని డానీ షోహమ్‌ ఆరోపిస్తున్నారు. కాగా.. కరోనా వైరస్‌ తమ తప్పేనని చైనా అంగీకరిస్తూ క్షమాపణ చెప్పబోతోందని చైనీస్‌ కోటీశ్వరుడు గుయోకు చెందిన పత్రిక ఒకటి సంచలన కథనాన్ని ప్రచురించింది. చైనా కావాలనే ఈ వైర్‌సను లీక్‌ చేసిందనే అనుమానం వచ్చేలా కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది. అయితే.. గుయో ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన కావాలనే ఇలా అసత్య కథనాలు ప్రచారం చేస్తారని సమాచారం.

ఆస్ట్రేలియా ల్యాబ్‌లో టీకా తయారు
కరోనా వైర్‌సను తాము ల్యాబ్‌లో పెంచామని ఆస్ట్రేలియాకు చెందిన ‘పీటర్‌ డోహెర్టీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫెక్షన్‌ అండ్‌ ఇమ్యూనిటీ’ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. చైనాలో కాకుండా ఈ వైరస్‌ మరో దేశంలో పెరగడం ఇదే మొదటిసారి. దీనిని ల్యాబ్‌లో పెంచడం వల్ల కచ్చితమైన పరిశోధనలు చేయడానికి అవకాశం ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ వైర్‌సకు టీకాను తయారుచేస్తున్నట్టు అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఫర్‌ హెల్త్‌ అధికారి ఆంథోనీ తెలిపారు. ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. కాగా.. కరోనా వైరస్‌ వ్యాపించే ముప్పు అధికంగా ఉన్న 30 దేశాల్లో భారత్‌ కూడా ఉందని యూకేకు చెందినసౌథాంప్టన్‌ వర్సిటీ అధ్యయనంలో తేలింది.
తీసుకెళ్లండి: తమిళ విద్యార్థులు
హాస్టల్‌ నుంచి బయటకు రానివ్వడం లేదు. ఎక్కడి కీ వెళ్లకూడదని ఆంక్షలు పెడుతున్నారు. వీలైనంత త్వరగా మమ్మల్ని తీసుకెళ్లండి’ అంటూ చైనాలో పీహెచ్‌డీ, వైద్య కోర్సులు చదువుతున్న 15 మంది తమిళనాడు విద్యార్థులు వీడియో సందేశం పంపారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates