బొమ్మల రామారం యాదాద్రి భువనగిరి జిల్లా లో ఒక కుగ్రామం ఎటువంటి కనీస రవాణా భద్రత లేని చీకటి రాజ్యం.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బొమ్మల రామారం యాదాద్రి భువనగిరి జిల్లా లో ఒక కుగ్రామం ఎటువంటి కనీస రవాణా భద్రత లేని చీకటి రాజ్యం.

                                                                         Gurram Sitaramula

 

నెల కింద ఒక వికృత సంఘటన వెలుగులో తెలంగాణ ఉలిక్కి పడ్డది.

పెత్తందారీ పదఘట్టనల మధ్య నలిగిన తెలంగాణ కు అవమానాలు పరాభవాలు కొత్త కాదు, పైటాల పిల్లలకు పాలు ఇవ్వడానికి పోయే స్త్రీ పాలు ఎక్కువై రొమ్ము లు సలపరం పెడుతుంటే ఇంటికి పోయే ఆమె బాలింతా కాదా అని నాటేసే పొలంలో నాలుగు పాల చుక్కలు సాక  బొస్తే తప్ప నమ్మని  పెత్తందారీ గుండాగిరి కొనసాగింపే ఇప్పుడు తెలంగాణ గ్రామ గ్రామాన ఉంది.

ఊరు ఊరికీ శ్రీనివాస రెడ్డి లాంటి వాళ్ళు ఉండొచ్చు. చింతమనేని ప్రభాకర్,దగ్గునాటి చెంచు రామయ్యలు  ఉండొచ్చు వాళ్ళ అవశేషాలు పరివ్యాప్తం అయ్యాయి.

 

ఇప్పుడు అదే బొమ్మల రామారం గ్రామం మరొక మట్టి బిడ్డనూ కన్నది.ఊరు కాదు, ప్రాంతం కాదు, దేశం గర్వించ దగిన ఒక సంచార బిడ్డ  గడ్డం మోహనరావు.

ఒక గంట కింద మోహన్ రాసిన ‘కొంగవాలు కత్తి ‘ నవలకు ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురష్కారం లభించింది. నాకు తెలిసి ఒక సంచార యాచక కులం నుండి కేంద్రీయ విశ్వవిద్యాలయం లో డాక్టరేట్ చేసి సారస్వత పరిషత్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న తమ్ముడు గజవెల్లి ఈశ్వర్, ఆ తర్వాత గడ్డం మోహన్.

మోహన్ సాంప్రదాయ చిందు యక్షగాన కళాకారుల కుటుంబం. అవ్వలు అయ్యలు తాతలు ముఖానికి రంగేసుకొని రామాయణ భారత, భాగవత కథలు తరాలుగా చెబుతున్నారు. ఒక దశలో వైదిక మతం తగ్గుముఖం పట్టిన సంక్షుభిత కాలాన ఆ పరంపరను వందల ఏళ్లుగా భుజాన వేసుకొన్న మోస్తున్న ధార్మిక రాయబారులు. నిజమైన సాంస్కృతిక రధసారధులు.

యడాది లో కేవలం ఆరు నెలలు మాత్రమే కథలు చెప్పడం మిగతా కాలాన షికారు చేసుకొని ‘రాత్రికి రాజులు పగలు యాచకులుగా’ బ్రతుకీడుస్తున్నారు.

చిందు బైయిండ్ల, డక్కలి,నులక చందయ్య,ఇంకా అనేక అదృశ్య, అవాచ్య కులాలు.

మోహన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పి జి, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ‘చిందు కళాకారుల జీవన చిత్రణ సాహిత్య అనుశీలన’ అంశం మీద డాక్టరేట్ పట్టా పొందాడు.

నేను జాంబపురాణం మీద పనిచేసే రోజుల్లో చిందు ,డక్కలి ఇంకా జంగాల ఇళ్ళను దగ్గరగా చూసా.

డక్కలి గోపాల్, గడ్డం సమ్మయ్య, శ్యామ్,ఇంకా మోహన్ లాంటి వాళ్ళు దగ్గరగా పరిచయం అయ్యారు. అప్పుడే మనకు తెలియని తరతరాల చరిత్ర వాళ్ళ కవిలే కట్టెలో భద్రంగా ఉన్నాయి అని గ్రహించా. మోహన్ అటేడు ఇటేడు తరాల లో బడిబాట పట్టిన మొదటి వాడు. ఆయన సేకరించి ప్రచురించిన మచ్చయ్య దాసు జంబాపురాణం మొన్ననే చదివా.  కొంగవాలు కత్తి చదవలేదు.

ఒక సంచార బ్రతుకు ఒక్కొక్క కన్నీటి బొట్టు బ్రతుకి ఇంధనం గా చేసుకున్న వాడు. ఆశ్రితులకె ఆశ్రితుడు. నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఆయన కింద ఇంకా పది కుల  దొంతరలు ఉన్నా చిందు కులం ఒక విశిష్ట మైనది. మన ముందే బ్రతికి మాయం అయిన చిందు ఎల్లమ్మ చెప్పిన అల్లి రాణి కథల వ్యధాత్మక గతం ఉంది .

ఆమెది విస్మృత గాథ.

ఆదిమ కాలాన సర్వ కళలకు మూలం అయిన చిందు తన పూర్వీకుల త్యాగ ఫలం. నాకు ఈ అవార్డుల మీద ఏ బ్రమలూ లేవు . వివక్షల మోడీ పాలన లో గుడిసెల చూరు కింద  చెట్ల కింద సంచారులు గా బ్రతికిన ఒక మట్టి బిడ్డ పాదాలు  సృశించి సాహిత్య అకాడమీ తరతరాలుగా చేస్తున్న తన పాపాలను కడుక్కుంది.

ఇంత కాలం క్విడ్ ప్రో కో వ్యవహారం చేస్తూ తెలుగు బాధ్యులు చేసిన తప్పిదాలకు ఇది  నిష్కృతి మాత్రం కాదు సుమా.

మచ్చలేని నీ జాతి ఈ అవార్డుల పందేరం లో బడి కలుషితం అవుతాదేేమో అనే బెంగ కూడా ఉంది. అయినా బ్రతుకు నడక కొనసాగాలి కదా

RELATED ARTICLES

Latest Updates