ఉపాధిపై తప్పుడు లెక్కలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

పాత ఉద్యోగాలు 9లక్షలు.. కొల్లగొట్టింది రూ.300 కోట్లు
పీఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహన్‌ పథకంలో అవకతవకలు

న్యూఢిల్లీ : కొత్తగా ఉద్యోగాలు సృష్టించామని ప్రయివేటు కంపెనీ యాజమాన్యాలు భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వైనం బయటపడింది. ఏదైనా ప్రయివేటు కంపెనీ కొత్తగా ఉద్యోగాల కల్పన జరిపితే (1 ఏప్రిల్‌ 2018 తర్వాత) సంబంధిత ఉద్యోగి పీఎఫ్‌లో యజమాని వాటా కేంద్రమే మూడేండ్లపాటు కడుతుంది. ఈ ప్రోత్సాహకాలు ‘పీఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహన్‌ పథకం’ ద్వారా అందజేస్తారు. అయితే అనేక కంపెనీలు ఈ పథకం ద్వారా లబ్దిపొందాలన్న ఆశతో పాతవాళ్లనే కొత్త ఉద్యోగులుగా పేర్కొంటూ అక్రమాలకు పాల్పడ్డాయన్న సంగతి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఒకటి సంచలన వార్తా కథనం రాసింది. దాదాపు 80వేల కంపెనీలు ఉపాధి కల్పనపై తప్పుడు లెక్కలు అందజేసి, ‘పీఎంఆర్‌పీవై’ పథకం ద్వారా రూ.300కోట్లు కొల్లగొ ట్టాయని వార్తా కథనం పేర్కొన్నది. దాదాపు 9లక్షల మంది పాత ఉద్యో గస్తుల్నే కొత్త ఉద్యోగస్తులుగా పేర్కొన్నాయి. ఈ ఉద్యోగస్తుల పీఎఫ్‌ ఖాతా లకు యాజమాన్యం వాటా కింద కట్టాల్సిన మొత్తాల్ని కంపెనీలు మిగు ల్చుకున్నాయి. అంతేగాక కొత్తగా ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం పేర్కొటున్న గణాంకాల్లో లోపాలు బయటపడ్డాయి. ఆ జాబితాలో 9లక్షల మంది పాతవాళ్లే ఉన్నారన్న సంగతి విచారణలో తేలింది. కొత్తగా ఉద్యోగాల కల్పన జరిపిన కంపెనీలకు మాత్రమే పీఎంఆర్‌పీవై పథకం వర్తిస్తుంది. ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినా, కొంత కాలం విధులకు దూరంగా ఉండి…తిరిగి విధుల్లోకి చేరినా పథకం వర్తిం చదు. పాత ఉద్యోగస్తులను లబ్దిదారులుగా కంపెనీలు పేర్కొనడానికి వీల్లేదు.

ప్రధాని మోడీ చెప్పిందాంట్లో నిజమెంత?
పీఎంఆర్‌పీవై పథకం అమల్లో అవకతవకలు బయటపడ్డాక..ఉపాధి కల్పనపై ప్రధాని మోడీ గతంలో చెప్పిన లెక్క తప్పేనని తేలింది. 2017-18లో కొత్తగా 70లక్షల ఉద్యోగాలు సృష్టించామని ప్రధాని మోడీ (2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు) ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిరుద్యోగంపై ప్రతిపక్షాల ఆరోపణల్ని కొట్టిపారేశారు. అవకతవకలతో కూడుకున్న పీఎంఆర్‌పీవై పథకం గణాంకాల్ని ఆధారంగా చేసుకొని ప్రధాని మాట్లాడినట్టు (70లక్షల ఉద్యోగాలు సృష్టించామని) తెలుస్తున్నది. అయితే అందులో వాస్తవం లేదని తాజా అవినీతి బాగోతం బయటపెట్టింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates