చచ్చాడా.. చచ్చినట్లు నాటకమా..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సమాధిని తవ్వి రీపోస్టుమార్టం జరపండి
బిట్‌కాయిన్‌ సంస్థ వ్యవస్థాపకుడి మరణంపై అనుమానాలు
కెనడా పోలీసులపై ఇన్వెస్టర్ల ఒత్తిడి
గెరాల్డ్‌తోనే రూ.1277 కోట్లు సమాధి?

ఓటావా: బిట్‌ కాయిన్‌ కంపెనీ పెట్టాడు! పెట్టుబడులు సేకరించాడు! ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా రూ.1276 కోట్లకు అధిపతి అయ్యాడు! ఆ తర్వాత భారత పర్యటనలో అనుమానాస్పదంగా చనిపోయాడు! అతడు నిజంగానే చనిపోయాడా? లేక.. చనిపోయినట్లు రికార్డులు సృష్టించి.. కోట్లు కొల్లగొట్టేందుకు నాటకమాడుతున్నాడా? ఇప్పుడు ఇవీ ఇన్వెస్టర్లలో పెరిగిన అనుమానాలు! దాంతో, పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అతడి సమాధిని తవ్వి.. దర్యాప్తు చేయాలని, శవానికి రీ పోస్టుమార్టం చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు! ఇది ఇప్పుడు కెనడాలో సంచలనం రేకెత్తిస్తున్న అంశం! దాంతో, రాయల్‌ కెనడా మౌంటెడ్‌ పోలీసులకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది.

కెనడాకు చెందిన గెరాల్డ్‌ కాటన్‌ అనే యువకుడు ‘క్వాడ్రిగా సీఎక్స్‌’ పేరుతో ఓ బిట్‌కాయిన్‌ ఎక్స్‌చేంజ్‌ స్టార్ట్‌పను ప్రారంభించాడు. అనతికాలంలోనే అది పెట్టుబడిదారులను ఆకట్టుకుంది. ఫలితంగా.. 30 ఏళ్ల వయసులోనే గెరాల్డ్‌ దాదాపు రూ. 1276.93 కోట్ల విలువ చేసే బిట్‌కాయిన్‌ సంస్థకు అధిపతి అయ్యాడు. సుమారు 1.15 లక్షల మంది ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అనూహ్యం గా అతడు గత ఏడాది భారత్‌ పర్యటనలో చనిపోయాడు. అతడి మరణంతో బిట్‌కాయిన్‌ ఎక్స్‌చేంజ్‌ చరిత్ర పరిసమాప్తమైంది. ఆ వెబ్‌సైట్‌కు సంబంధించి న పాస్‌వర్డ్‌లు ఇతరులెవరికీ తెలియదు. తన భార్య జెన్నిఫర్‌తోనూ అతడు వ్యాపార విషయాలను పంచుకోలేదు. తనకేమీ తెలియదని ఆమె చేతు లెత్తేసింది. దాంతో, గెరాల్డ్‌ మరణంపై నిజాలను నిగ్గుతేల్చాలంటూ పెట్టుబడిదారులు కెనడా పోలీసులకు ఫి ర్యాదులు చేస్తున్నారు. అతడి సమాధిని తవ్వి..శవానికి రీ పోస్టుమార్టం చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Courtesy Anadhrajyothi

RELATED ARTICLES

Latest Updates