అపర కుబేరుడి అద్భుత నౌక

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • హైడ్రోజన్‌తో నడిచే యాట్‌..
  • రూ.4600 కోట్లకు కొన్న బిల్‌గేట్స్‌

ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు.. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు.. బిల్‌గేట్స్‌ (64) రూ.4600 కోట్లు పెట్టి అత్యంత విలాసవంతమైన యాట్‌ (విహార నౌక)ను కొనుగోలుచేశారు. గత ఏడాది మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో ఆయన దీని నమూనాను చూసి ముచ్చటపడ్డారు. ఆ నమూనా ప్రతిపాదన మాత్రమే. అయితే, అది పర్యావరణానికి ఎలాంటి హానీ చేయని విధంగా ద్రవ హైడ్రోజన్‌తో నడుస్తుందని తెలియడంతో వెంటనే తయారీకి కావాల్సిన డబ్బును బిల్‌గేట్స్‌ ఇచ్చేశారు. ఇప్పటిదాకా ఆయనకు సొంత విహార నౌక లేదు. ఎప్పుడైనా కుటుంబంతో కలిసి నౌకలో విహరించాలనుకుంటే ప్రైవేట్‌ యాట్‌లను అద్దెకు తీసుకుంటారు. పర్యావరణంపై ప్రేమతోనే ఆయన ఇప్పుడు ఈ నౌకను కొనుగోలు చేశారని అంటున్నారు. 370 అడుగుల పొడుగు ఉండే ఈ నౌక పేరు.. ఆక్వా. దీంట్లో నాలుగు గెస్ట్‌ రూములు, రెండు వీఐపీ గదులు, యజమాని సూట్‌ ఉంటాయి.

3750 మైళ్లు
ఒక్కసారి ఈ నౌకలో ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. నౌక వేగం గంటకు 17 నాటికల్‌ మైళ్లు.
 423 ఫారెన్‌హీట్‌
నౌక నడవడానికి ఉపయోగించే ద్రవ హైడ్రోజన్‌ను మైనస్‌ 253 డిగ్రీల ఉష్ణోగ్రతలో 2 ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఒక్కో ట్యాంకు సామర్థ్యం 28 టన్నులు. ఈ నౌక ప్రయాణించినప్పుడు కర్బన ఉద్గారాలూ వెలువడవు. నీళ్లు బయటకు వస్తాయంతే.

14.. 31
ఈ నౌకలోని సిబ్బంది సంఖ్య 31. ఇందులో 14 మంది అతిథులు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లున్నాయి. ఇంకా.. కసరత్తులు చేయడానికి జిమ్‌, యోగాసనాలు వేసుకోవడానికి, ధ్యానానికి యోగా రూమ్‌, మేకప్‌ రూమ్‌, మసాజ్‌పార్లర్‌, స్విమ్మింగ్‌పూల్‌ కూడా ఉన్నాయి.

2
ఈ విలాసవంతమైన నౌకలో నుంచి బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న బోట్లు ఉంటాయి. ఒక్కోదాని పొడుగు 32 అడుగులు.

2024
ఈ నౌక తయారీ దశలో ఉంది. 2024 నాటికి బిల్‌గేట్స్‌ చేతికి రానుంది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates