ఢిల్లీ సర్కారు పెట్టిన రోజ్గార్ బజార్ సైట్కు భారీ స్పందన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-పెద్ద ఎత్తున రిజిస్టర్‌ చేసుకుంటున్న నిరుద్యోగులు, కంపెనీలు

న్యూఢిల్లీ : ఢిల్లీ సర్కార్‌ తాజాగా ప్రారంభించిన ”రోజ్గార్‌ బజార్‌” వెబ్‌ పోర్టల్‌ కు భారీ స్థాయిలో విశేష స్పందన లభించింది. నిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారస్థులు ఈ పోర్టల్‌ లో పెద్ద ఎత్తున రిజిస్టర్‌ చేసుకుంటున్నారు. కరోనా కట్టడిలో ఆశించిన ఫలితాలు సాధిస్తోన్న నేపథ్యంలో… ఆర్థిక పరిస్థితుల పున:రుద్ధరణపై ఢిల్లీ సర్కార్‌ దష్టి సారించింది. లాక్‌డౌన్‌ కారణంగా పడిపోయిన స్టేట్‌ ఇన్‌ కం ను తిరిగి సాధించేలా రోజ్గార్‌ బజార్‌ పోర్టల్‌ కు శ్రీకారం చుట్టింది. కరోనా తో ఏర్పడ్డ పరిస్థితులతో ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. వైరస్‌ భయంతో వేలాది మంది సొంత ప్రాంతాలకు వెళ్లడంతో ఎన్నో కంపెనీలు, చిన్న చిన్న వ్యాపారాలు నష్టాల బారిన పడ్డాయి. ఈ సందర్బంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిని, సిబ్బంది లోటుగా ఉన్న ట్రేడర్స్‌, బిజినెస్‌ మెన్‌, ప్రొఫెషనల్స్‌, కాంట్రాక్టర్స్‌ ఒకే ప్లాట్‌ ఫామ్‌ పైకి తెచ్చే బాధ్యతను ఢిల్లీ సర్కార్‌ భూజన వేసుకుంది. సోమవారం సీఎం కేజ్రీవాల్‌ రోజ్గార్‌ బజార్‌ పోర్టల్‌ ని ఆవిష్కరించారు. లాక్‌ డౌన్‌ తర్వాత చాలా మంది ఉద్యోగాలు కోల్పోగా, అన్‌ లాక్‌ ప్రక్రియ తర్వాత చాలా మంది ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉన్నారు. అయితే, వీరిద్దరినీ కలిపే మార్గం లేదు. ఇందుకోసం లోతుగా ఆలోచించిన ఢిల్లీ సర్కార్‌ ఒకే పోర్టల్‌ ఉద్యగాలు అవసరం వారికి, కంపెనీల్లో సిబ్బంది అవసరం ఉన్నవారి ఉపయోగపడేలా రూపొందించింది.

కాగా, ఈ పోర్టల్‌ ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే పెద్ద ఎత్తున నిరుద్యోగులు, కంపెనీలు ఇందులో రిజిస్టర్‌ చేసుకున్నాయి. తొలి ఆరు గంటల్లో 51, 043 మంది నిరుద్యోగులు తమ డిటైల్స్‌ ఆప్‌ లోడ్‌ చేసుకోగా, 1, 075 కంపెనీలు వివిధ ప్రదేశాల్లో 18, 585 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెబ్‌ సైట్‌ రిజిస్టర్‌ చేసుకున్నారు. 24 గంటల్లో 4, 294 సంస్థలు, 1, 89, 879 నిరుద్యోగులు తమ సమాచారాన్ని పోర్టల్‌ లో రిజిస్టర్‌ చేసుకున్నట్లు ఢిల్లీ సర్కార్‌ తెలిపింది. అయితే, ఈ పోర్టల్‌ సర్వీస్‌ ను ఫ్రీగా అందిస్తోంది. ఉద్యోగం అవసరం ఉన్నవారు తమ అనుభవం, విద్యార్హతలు, జీతం, ఆసక్తి గల రంగాలు, పలు విషయాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఉద్యోగాలు కల్పించే వారు తమ అవసరాలు, జీతం, షిప్ట్‌ లు, ఇతల అంశాలను ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక ఢిల్లీ సర్కార్‌ రోజ్గార్‌ బజార్‌ పోర్టల్‌ నిర్ణయాన్ని అన్ని స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు. కరోనా తో పాటు, ఆర్థిక పరిస్థితులపై దష్టి పెట్టడం మంచి పరిమాణం అని కితాబిస్తున్నారు. ఇలాంటి ముందు జాగ్రత్త నిర్ణయాలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని, ఇది ఇలానే సాగితే రానున్న రోజుల్లో ఆకలి మరణాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌- 19 నివారణ, ఆర్థిక రంగ పున:రుద్దరణకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఇతర రాష్ట్రాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు.

రెండు కోట్ల మంది ఢిల్లీ వాసులు కలిగట్టుగా కరోనాతో యుద్దం చేస్తున్నారు. కరోనాను ఎదుర్కోవడమే కాదు, ఆర్థిక రంగాలన్ని పునరుద్దరించుకోవడం అవసరం. లాక్‌ డౌన్‌ లో అన్ని బంద్‌ చేయడం వల్ల చాలా మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిని అన్ని రంగాల వారు కలిసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అన్‌ లాక్‌ ప్రక్రియ తర్వాత అన్ని తెరుచుకోవడంతో… మార్కెట్‌లో ఉద్యోగం వెతుకుతున్న వారు, ఉద్యోగాలు ఇచ్చే వారు (నౌకరీ దూండ్‌ నే వాలే, నౌకరీ దేనే వాలే) ఇద్దరు ఉన్నారు. ఇలాంటి వారికి ఓకే ప్లాట్‌ ఫాంలో పైకి తెచ్చేలా రోజ్గార్‌ బజార్‌ ని ప్రారంభించాం.
– అరవింద్‌ కేజ్రీవాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates