భారత గబ్బిలాల్లోనూ కరోనా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • బ్యాట్‌ కరోనా వైర్‌సను గుర్తించిన శాస్త్రజ్ఞులు
  • కొవిడ్‌-19కు దానికి సంబంధం లేదు
  • ఎన్‌ఐవీ శాస్త్రవేత్త ప్రజ్ఞా డి యాదవ్‌ వెల్లడి

చైనాలోనే కాదు.. మన దేశంలోనూ రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్‌ ఉంది! పుణెలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’ శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రజ్ఞ డి యాదవ్‌ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. కానీ, ఆ రెండు రకాల కరోనా వైర్‌సలకు.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19కు సంబంధం లేదు. అందునా.. దేశంలోని కొన్ని ప్రాంతాల గబ్బిలాల్లో మాత్రమే కరోనా వైరస్‌ ఉందని.. తెలంగాణలో కనిపించే గబ్బిలాల్లో లేదని ఆమె స్పష్టం చేశారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రజ్ఞా డి యాదవ్‌ ఈ అధ్యయనం గురించి మరిన్ని వివరాలు తెలిపారు.

భారత్‌లోని గబ్బిలాల్లో కూడా కరోనా జాతికి చెందిన వైరస్‌ ఉందని తేలింది కదా.. వాటి వల్ల ఎంతవరకు ప్రమాదముంది?
కరోనా జాతి వైర్‌సలు గబ్బిలాలు సహా అనేక జంతువుల్లో ఉంటాయి. మన దేశంలో కనిపించే ఇండియన్‌ ఫ్లయింగ్‌ ఫాక్స్‌, రోసిట్‌స(ఫ్రూట్‌ బ్యాట్స్‌) జాతి గబ్బిలాలపై మేం పరిశోధనలు చేయగా.. వాటిలో కరోనా ఉందని తేలింది. అయితే ఈ వైర్‌సకు ప్రస్తుతం వ్యాప్తిస్తున్న కొవిడ్‌-19కు ఎటువంటి సంబంధం లేదు. ఈ రెండు వేర్వేరు.

క్షీరదాలు, జంతువుల ద్వారా కొవిడ్‌-19 వ్యాపించిందని గత పరిశోధనల్లో తేలింది కదా? అలా జరిగే ప్రమాదం లేదా?
మనుషులకు సోకే ప్రమాదకరమైన వైర్‌సలు సాధారణంగా జంతువుల నుంచే వస్తాయి. గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు వ్యాపించవు. మా అధ్యయనంలో గబ్బిలాలు కరోనా వైర్‌సను వ్యాప్తి చేస్తున్నట్లు తేలలేదు.

మన దేశంలో అనేక రకాల గబ్బిలాలు ఉండగా.. ఈ రెండు జాతులనే ఎందుకు ఎంచుకున్నారు?
ఇండియన్‌ ఫ్లయింగ్‌ ఫాక్స్‌, రోసిటస్‌ జాతులు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. 2004 నుంచి అంతర్జాతీయంగా గబ్బిలాలపై జరుగుతున్న అనేక పరిశోధనలను పరిశీలిస్తే.. ఈ రెండింటిలోనే కరోనా వైర్‌సలు ఉన్నట్టు తేలుతోంది. అందుకే మన దేశంలోని గబ్బిలాల్లో ఈ వైరస్‌ ఉందా? లేదా అనేది కనుగొనటానికి ఈ అధ్యయనం చేశాం.

ఏయే ప్రాంతాల గబ్బిలాలపై ఈ పరిశోధనలు చేశారు?
కేరళ, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, ఒడిశా, తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, పుదుచ్చేరిలలోని అటవీ ప్రాంతాల్లో నివసించే గబ్బిలాలపై ఈ అధ్యయనాన్ని చేశాం. ఆయా రాష్ట్రాల అటవీ శాఖల అనుమతి తీసుకొని దాదాపు 500 గబ్బిలాల వెనక భాగం (రీనల్‌) నుంచి, నోటి నుంచి నమూనాలను సేకరించాం. వీటిని రివర్స్‌ ట్రాన్స్‌స్ర్కిప్షన్‌ పాలీమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ పీసీఆర్‌) పద్ధతిలో పరీక్షించాం. కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌లో నివసించే గబ్బిలాల్లో ‘బ్యాట్‌ కరోనా వైరస్‌ (బీటీ-సీఓవీ)’ ఉందని తేలింది.  తెలంగాణలో కనిపించే ఈ గబ్బిలాలవల్ల కరోనా ప్రమాదం లేదు. ప్రస్తుతానికి రెండు జాతుల గబ్బిలాల్లో కరోనా లేదు. అయితే గబ్బిలాల్లో ఉండే రకరకాల వైర్‌సలు ఎప్పుడైనా ప్రమాదకరంగా మారొచ్చు.

2018లో వ్యాపించిన నిఫాకు గబ్బిలాలకు సంబంధం ఉందా?
ఉందని మేము భావిస్తున్నాం. రోటిసస్‌ (ఫ్రూట్‌బ్యాట్స్‌) ద్వారా ఇది వ్యాపించి ఉండవచ్చని గతంలో చేసిన అధ్యయనాల్లో తేలింది. కొన్నాళ్ల క్రితం ఇండోనేసియాలో కూడా ఈ జాతి గబ్బిలాల ద్వారానే నిఫా వైరస్‌ వ్యాప్తి చెందింది.

మయన్మార్‌ గబ్బిలాల్లో 6 కొత్త కరోనా వైర్‌సలు
సాధారణ జలుబు నుంచి.. సార్స్‌, మెర్స్‌ దాకా రకరకాల అనారోగ్యాలు కలిగించే ఎన్నో వైర్‌సలు కరోనా కుటుంబంలో ఉన్నాయి. కొవిడ్‌-19 అందులో కొత్తది. తాజాగా.. స్మిత్‌సోసియన్‌ నేషనల్‌ జూ, కన్జర్వేషన్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన పరిశోధకులు మయన్మార్‌లో నివసించే గబ్బిలాలలో ఆరు రకాల కొత్త కరోనా వైర్‌సలను కనుగొన్నారు. వీటికి.. సార్స్‌ (సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌), మెర్స్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) వైర్‌సలతో సంబంధం లేదని వారు తెలిపారు. 2016 మే నుంచి 2018 ఆగస్టు దాకా ఆరు జాతుల గబ్బిలాల నుంచి 750 లాలాజల, మల నమూనాలను సేకరించారు. వాటిలోని వైర్‌సలను.. కరోనా వైర్‌సలతో పోల్చిచూడగా 6 రకాల కొత్త కరోనా వైర్‌సలు ఉన్నట్టు తేలింది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates