అసాంజేపై నిలిచిన దర్యాప్తు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– స్వీడన్‌ వెల్లడి

తస్టాకహేోమ్‌ : వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు స్వీడన్‌ ఊరటనిచ్చింది. ఆయనపై నమోదైన లైంగికదాడి ఆరోపణల కేసు దర్యాప్తును నిలిపివేస్తున్నట్టు స్వీడన్‌ డిప్యూటీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ ఎవా-మేరీ పెర్సెన్‌ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు గురించి ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. 2012 నుంచి ఇటీవల వరకు ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందిన అసాంజేను రెండు నెలల కిందట ఖాళీ చేయించగా బ్రిటన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2012లో బెయిల్‌ పొందిన నాటి నుంచి పరారీలో ఉన్న అసాంజేకు బ్రిటన్‌ కోర్టు 50 వారాల జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం ఆయన ఆ శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక దస్త్రాలను, రహస్య పత్రాలను బహిర్గతం చేసిన అసాంజేను తమకు అప్పగించాలని అమెరికా కోరుతున్నది.2010లో తనపై అసాంజే లైంగిక దాడికి పాల్పడినట్టు ఓ స్వీడన్‌ మహిళ ఆరోపించింది. దీనిపై విచారణ మొదలుపెట్టిన స్వీడన్‌ ప్రాసిక్యూషన్‌ విభాగం సదరు మహిళ చేసిన ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేసింది. అయితే, అసాంజే నేరానికి పాల్పడినట్టు నిరూపించడానికి తగినవిధంగా బలమైన సాక్ష్యాధారాలు లేవని స్వీడన్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఇవా మేరీ పెర్సోన్‌ వెల్లడించారు. స్వీడన్‌ చట్టాన్ని అనుసరించి 2020 ఆగస్టులోపు నేర నిరూపణ చేయలేకపోతే ఈ కేసు వీగిపోతుంది. వాస్తవానికి అసాంజే లండన్‌ లోని ఈక్వెడార్‌ ఎంబసీలో తలదాచుకోవడంతో 2017లోనే స్వీడన్‌ ఈ కేసును మూసివేసింది. ఇటీవలే అసాంజేను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో కేసును మళ్లీ కొనసాగించారు.

Courtesy Navatelangana..

RELATED ARTICLES

Latest Updates