కార్మిక గర్జన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

స్తంభించిన భారతావని.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం మోడీ విధానాలను నిరసిస్తూ ఆందోళనలు
– ప్రభుత్వ హెచ్చరికలను లెక్కచేయని ఉద్యోగులు, కార్మికులు
– కోల్‌కతాలో అడ్డుకునేందుకు తృణమూల్‌ ప్రభుత్వం యత్నం
– పలుచోట్ల అరెస్టులు.. పనిచేయని ప్రభుత్వరంగ సంస్థలు
– మేముసైతమన్న విద్యార్థులు.. సిమ్లాలో గొడుగులు పట్టుకుని..
– భగ్గుమన్న గ్రామీణభారతం

మోడీ ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు, విభజన రాజకీయాలపై యావత్‌ భారతావని కన్నెర్ర చేసింది. మోడీ విధానాలు మాకొద్దంటూ నినదించింది. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ.. కార్మికులపై కక్షసాధింపు చర్యలను అవలంబిస్తున్న కేంద్ర సర్కార్‌ తీరును నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు, రైతులు, గ్రామీణ కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకులు, రవాణా, ఓడరేవులు, ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, స్కీమ్‌ కార్మికులు, రైతులు, గ్రామీణ కార్మికులు, విద్యార్థులు సమ్మె బాటపట్టారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటే తీవ్ర పరిణామాలుంటాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఉక్కు, బొగ్గు, మైనింగ్‌, రక్షణ ఉత్పత్తి, పోర్ట్‌, పోస్టల్‌, చమురు సహజవాయువు, టెలికాం, విద్యుతుత్పత్తి తదితర రంగాలతోపాటు దేశంలోని భారీ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ సమ్మె విజయవంతమైంది. ఇంజినీరింగ్‌, ఆటోమొబైల్‌, లోహాలు, వస్త్ర పరిశ్రమ కార్మికులతో పాటు అనేక ఇతర ప్రయివేటు రంగాలకు చెందిన కార్మికులు కూడా వీధుల్లోకి వచ్చి నిరసన గళం వినిపించారు. ట్రక్కులు, బస్సులు, ఆటోరిక్షాలు, టాక్సీలు చాలా ప్రాంతాల్లో రోడ్లపైకి రాలేదు. పలు ప్రాంతాల్లో రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌, బీహార్‌, పంజాబ్‌ వంటి అనేక ప్రాంతాల్లో రైలు సర్వీసులను అడ్డుకున్నారు. ఈ సమ్మెలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘానికి అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు పాల్గొనలేదు.

న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులతోపాటు, వ్యవసాయేతర గ్రామీణ కార్మికులూ వీధుల్లోకి వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు. ఏఐకేఎస్‌సీసీ నేతృత్వంలోని 175 సంఘాలు సంయుక్త పిలుపుమేరకు దేశంలోని దాదాపు 480 జిల్లాల్లో ఆందోళనా కార్యక్రమాలు జరిగాయి.

వర్సిటీలలో..
దేశవ్యాప్తంగా 60కి పైగా విశ్వవిద్యాలయాలు, అనేక విద్యాసంస్థల్లో విద్యార్థులు సమ్మెకు మద్దతుగా తరగతులను బహిష్కరించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఫీజుల పెంపు, విద్యార్థులపై దాడులను నిరసిస్తూ విద్యార్థులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.

మహారాష్ట్ర
పారిశ్రామిక రాష్ట్రమైన మహారాష్ట్రలో కార్మికుల ఐక్యత మరోసారి స్పష్టమైంది. అన్ని పారిశ్రామిక పట్టణాల్లో సమ్మె విజయవంతమైంది. దాదాపు 26 యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వగా కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఆశావర్కర్లు, బ్యాంకు ఉద్యోగులు, ఇతర కార్మికులు బుధవారం ఉదయమే ఆజాద్‌ మైదాన్‌కు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. ‘గతంలో ఎప్పుడూ చూడని అత్యంత ఘోరమైన పరిస్థితులను గత నాలుగేండ్లలో చూశాం. అందుకే బ్యాంకు ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు’ అని బ్యాంకు యూనియన్‌ నాయకులు విశ్వాస్‌ ఉటాగి చెప్పారు. ప్రధానంగా కార్‌ షెడ్ల రైల్వే ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొన్నారు.

గుజరాత్‌లో…
గుజరాత్‌ బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దాదాపు 40 వేల మంది బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఆలిండియా రైల్వే మెన్‌ ఫెడరేషన్‌, పశ్చిమ రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌, ఇన్‌కం ట్యాక్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, ఇన్‌కం ట్యాక్స్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (గుజరాత్‌ సర్కిల్‌), గుజరాత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌ (జీఎఫ్‌టీయూ), గుజరాత్‌ మజ్దూర్‌ సంఫ్‌ు (జీఎంఎస్‌), మజ్దూర్‌ అధికార్‌ అభియాన్‌ (ఎంఏఎస్‌ఏ) ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తంచేస్తూ ర్యాలీలు నిర్వహించారు.

తమిళనాడు, పుదుచ్చేరిలో
పుదుచ్చేరిలో ప్రయివేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ ప్రయివేటు సంస్థల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. తమిళనాడులోనూ సమ్మె విజయవం తమైంది. చెన్నైలో నిరసనకారులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.

హిమాచల్‌లో..
మంచుకురుస్తున్నా.. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉద్యోగులు, రైతులు, కార్మికులు సమ్మె బాటలో కదం తొక్కారు. సిమ్లాలో గొడు లు వేసుకొని మరీ ఆందోళనలో పాల్గొన్నారు.

పంజాబ్‌లో..
ప్రభుత్వరంగ సంస్థలు, రోడ్డు రవాణా సర్వీసులు నిలిచిపోయాయి. బ్యాంకులు, బస్సు లు, పోస్టాఫీసులతో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. బ్యాంకు సర్వీసులకు పూర్తి అంతరా యం కలిగింది. లుథియానా, జలంధర్‌, బటిం డాలలో పెద్దఎత్తున ర్యాలీలు జరిగాయి. కేంద్ర సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినదించారు.

యూపీలో..
కనీస వేతనం రూ.6,000లు చెల్లించాలని, మద్దతు ధర కల్పించాలని రైతులు ఉత్తరప్రదేశ్‌లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. బ్యాంకు సర్వీసులు నిలిచిపోయాయి.

త్రిపురలో..
త్రిపురలో అధికార బీజేపీ బెదిరింపులకి గురి చేసిన్నప్పటికీ… షాపు లు, రవాణా వ్యవస్థ స్థంభించింది. బ్యాంకులు పని చేయలేదు. ప్రయివేటు రంగంలోని సంఘటిత రంగం, ఎమ్‌ఎన్‌సీ లలో కూడా సమ్మెలో పాల్గొన్నారు.

బీహార్‌
బీహార్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు సమ్మె సందర్భంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొ న్నారు. వివిధ రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. జాతీయ రహదారులమీద బైటాయించి వాహనాలను అడ్డుకున్నారు. పాట్నా నడిబొడ్డున ఉన్న డాక్‌ బంగ్లా స్క్వేర్‌ వద్ద వేలాది మంది నినాదాలు చేస్తూ ఉద్యోగులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పాట్నాలో, రాష్ట్రవ్యాప్తంగా చాలా బ్యాంకులు, పోస్టాఫీసులు, జీవిత బీమా, విద్యుత్‌ కార్యాలయాలు మూతపడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టులు
ఏపీలో సమ్మె విజయవంతంగా జరిగింది. విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆందోళనచేస్తున్న సీపీఐ(ఎం), సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టులుచేశారు. పారిశ్రామిక కేంద్రం విశాఖలో బంద్‌ పూర్తిగా జరిగింది. బ్యాంకులు పూర్తిగా స్థంభించాయి. విజయవాడలో లెనిన్‌ సెంటర్‌ వరకూ భారీ ర్యాలీ జరిగింది.

కేరళలో సంపూర్ణం
వామపక్ష పాలిత రాష్ట్రం కేరళలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. మోడీ విధానాలను నిరసి స్తూ పలుచోట్ల భారీ ర్యాలీలు జరిగాయి. కేఎస్‌ఆర్టీసీ, ప్రయి వేటు బస్సులు, ఇతర వాహనాలు నడవలేదు. కాగా, శబరిమల యాత్రికులను సమ్మె నుంచి మినహాయిం చారు. కేఎస్‌ఆర్టీసీ బస్సుల ద్వారా అయ్యప్ప భక్తులను పంబాకు తరలించారు.

పశ్చిమ బెంగాల్‌లో..
పశ్చిమబెంగాల్‌లో రోడ్డు, రైల్వే సర్వీసులకు అంతరాయం కలిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వామపక్ష కార్యకర్తలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు సమ్మెకు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో రైల్వే ట్రాక్‌, రోడ్లను బ్లాక్‌ చేశారు. ప్రయివేటు బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాగా, ప్రభుత్వం పోలీసు పహారాలో ప్రభుత్వ బస్సులను నడిపించింది. టోలీగంజ్‌, బెహాలా, జాదవ్‌ఫూర్‌ వంటి పలు ప్రాంతాల్లో భారీసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఉత్తర బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు బంద్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మాల్దా జిల్లాలో జాతీయ రహదారిని నిర్బంధించారు. పోలీసులు వారిని చెదరగొట్టే బాష్పవాయుగోళాలు ప్రయోగించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కోల్‌కతాలో వామపక్ష కార్యకర్తలను తృణమూల్‌ కార్యకర్తల అడ్డుకునే ప్రయత్నం చేశారు.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates