ఖందా బయో డీజిల్ పరిశ్రమలో ప్రమాదం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఇద్దరు కార్మికుల దుర్మరణం
– ఒకరి పరిస్థితి విషమం
– బాధితులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పరామర్శ

జహీరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండల పరిధిలోని ఖందా బయోడీజిల్‌ పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు ప్రాణం కోల్పో యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రూరల్‌ ఎస్‌ఐ వినయకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్‌ జాకీర్‌ వద్ద జహీరాబాద్‌ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఎండి.గౌస్‌(30), ఎండి.సాబేర్‌ (30) వెల్డర్లుగా పనిచేసేవారు. వారు అర్జున్‌నాయక్‌ తండా సమీపంలోని బయోడీజిల్‌ పరిశ్రమలో బయో డీజిల్‌కోసం పెద్ద డీజిల్‌ ట్యాంకులను తయారు చేస్తు న్నారు. బుధవారం ఇద్దరూ ట్యాంకుపైన వెల్డింగ్‌ చేస్తుండగా మరో కార్మికుడు కృష్ణారెడ్డి వారికి సహా యంగా ఉన్నాడు. ఎండ తీవ్రత బాగా ఉండటంతో ట్యాంకు వేడెక్కి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. దాంతో ట్యాంకుపై ఉన్న ఇద్దరూ ఎగిరి కింద పడటం తో అక్కడికక్కడే మృతిచెందారు. దిడ్గి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డ్డి(35)కి తీవ్ర గాయాలయ్యాయి. జహీరాబాద్‌ కమ్యూనిటీ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం అతన్ని హైదరాబాద్‌కు తరలించారు. పరి స్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిం చారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ గణపతి జాదవ్‌, సీఐ సైదేశ్వర్‌ పరిశీలించారు. ప్రమా దానికి గల కారణాలను తెలుసుకున్నారు. గౌస్‌కు భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పాషామియాకు కండ్లు కనిపించవు. ఇంటిని సాకే కొడుకు మృతిచెందడంతో.. తమకు దిక్కెవరం టూ వృద్ధుడైన పాషామియా అధికారులు, ప్రజా ప్రతినిధుల కాళ్లపై పడి రోదించాడు. సాబేర్‌కు కూడా భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు.

బాధిత కుటుంబాలకు పరిహారం
మృతులు, గాయపడిన కార్మికుడు నిరుపేదలే కనుక పరిశ్రమ యాజమాన్యం వారి కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఎండి.ఫరీదుద్దీన్‌, డీసీఎంఎస్‌ చైర్మెన్‌ మల్కాపురం శివకుమార్‌, టీపీసీసీ నాయకులు వై.నరోత్తం డిమాండ్‌ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మృతుల కుటుంబసభ్యులతో కలిసి పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపి రూ.15 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పించారు.

Coutesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates