షాహీన్‌బాగ్‌లో ఆప్‌ టాప్‌గేర్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  •  ఆ ప్రాంతంతోపాటు జామియా వర్సిటీ
  • ఉన్న ఓఖ్లాలో ఆప్‌ అభ్యర్థి ఘనవిజయం

న్యూఢిల్లీ : సీఏఏ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ప్రాంతాల్లో ఓటర్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ వైపే నిలిచారు. షాహీన్‌బాగ్‌, జామియా మిలియా యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంతాలున్న నియోజకవర్గాలతోపాటు సీలంపూర్‌, మతియా మహల్‌లో ఆప్‌కు ఏకపక్ష విజయం కట్టబెట్టారు. తద్వారా సీఏఏ, ఎన్పీఆర్‌పై తమ వ్యతిరేకతను చాటారు. షాహీన్‌బాగ్‌, జామియా మిలియా యూనివర్సిటీ ప్రాంతాలున్న ఓఖ్లా అసెంబ్లీ నియోజవర్గంలో ఆప్‌ అభ్యర్థి అమనతుల్లాఖాన్‌ 88 వేల పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆప్‌కు ఏకంగా 83.81ు ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం 12.32ు మాత్రమే వచ్చాయి.

మరోవైపు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. కాగా, ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆప్‌, కాంగ్రె్‌సలు ఆ వర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. బీజేపీ మాత్రం హిందూ అభ్యర్థిని నిలబెట్టింది. ఎన్నికల ప్రచారంలో షాహీన్‌బాగ్‌ ఆందోళనలపై పలువురు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు, ఆగంతకులు తుపాకులతో సృష్టించిన బీభత్సం, జామియా వర్సిటీ విద్యార్థులపై జరిగిన కాల్పులు వంటి పరిణామాలు ఆ ప్రాంత ప్రజలను మరింత సంఘటితం చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షాహీన్‌బాగ్‌, జామియానగర్‌ ప్రాంతాల్లో హిందూ ఓటర్లు కూడా ఆప్‌ వైపే మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది. ఇక వామపక్ష రాజకీయాలకు పెట్టినకోట అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంతంలోనూ ప్రజలు ఆమ్‌ ఆద్మీ పార్టీకే ఓటేశారు. జేఎన్‌యూ ఉన్న మెహ్రాలి నియోజకవర్గంలో గతంలో కంటే ఆ పార్టీకి ఈసారి ఓట్ల శాతం పెరిగింది. గత డిసెంబరు 17న సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చోటుచేసుకున్న సీలంపూర్‌లోనూ ప్రజలు ఆప్‌ వైపే నిలిచారు. ఇలాంటి మరో ప్రాంతం మతియా మహల్‌లోనూ ఆప్‌ అభ్యర్థి షోయబ్‌ ఇక్బాల్‌ 50,241 ఓట్ల మెజారిటీతో సత్తా చాటారు. ఇక కాంగ్రెస్‌ ఏకంగా 63 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates