మహిళలపై నేరాల కేసుల్లో 76 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Image result for మహిళలపై నేరాల కేసుల్లో 76 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు"  గత ఐదేళ్లలో ఎన్నికైనవారిపై ఏడీఆర్‌ నివేదిక
  తొలి రెండు స్థానాల్లో భాజపా, కాంగ్రెస్‌
  మూడు, ఆరు స్థానాల్లో వైకాపా, తెరాస
దిల్లీ : దేశంలో 76 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. ఈ కేసులున్న వారి సంఖ్య భాజపా (21)లో ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్‌(16), వైకాపా(7)లు ఉన్నాయి. గత ఐదేళ్లలో (2014-2019) జరిగిన ఎన్నికల్లో.. అన్ని పార్టీల్లో, అన్ని రాష్ట్రాల్లో కలిపి స్వతంత్రులతో సహా ఇలాంటి కేసులున్న ఎంపీలు, ఎమ్మెల్యేల గణాంకాలను ఏడీఆర్‌ వెల్లడించింది. ఈమేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణపత్రాల (అఫిడవిట్ల)ను పరిశీలించి నివేదికను విడుదల చేసింది.
నివేదిక ముఖ్యాంశాలు..
* మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా ఉండగా.. రెండు మూడు స్థానాల్లో ఒడిశా, మహారాష్ట్రలు ఉన్నాయి.
* గత ఐదేళ్లలో లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో కలిపి మహిళలపై నేరాల కేసులను ఎదుర్కొంటున్న 572 మంది పోటీచేశారు. వీరిలో భాజపా అభ్యర్థులు 66 మంది కాగా కాంగ్రెస్‌ 46, బీఎస్పీ 40 మందికి టిక్కెట్లు ఇచ్చాయి.
* ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా 41 మంది అత్యాచార కేసులున్న వారికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయి.
* సాక్షాత్తూ మహిళలు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌, బీఎస్పీ, తృణమూల్‌ వంటి పార్టీలు కూడా మహిళలపై నేరాల కేసులను ఎదుర్కొంటున్నవారికి టిక్కెట్లు ఇచ్చాయి.

(Courtesy Eenadu)

RELATED ARTICLES

Latest Updates