Govt is responsible for Suicides of Intermediate Students in Telangana 2019

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఇంటర్ మీడియట్ విద్యార్థుల చావుల కి భాద్యులు ఎవరు ? ఇది స్పష్టంగా ప్రభుత్వ తప్పిదమే అయినా విలువైన ప్రాణాలు పోవడం లో మనందరి పాత్ర కూడా ఉంది. ఎందుకు ఈ చైనా (చైతన్య , నారాయణ కాలేజిలు ) కాలేజిలని ని అరికట్టలేక పోతున్నాం? ఎందుకు తల్లి తండ్రులు , చదువుకున్న వారు, చదువుకొని వారు ఈ పిచ్చి రాంక్ ల వెంట పడి జీవితాలని నాశనం చేస్తున్నారు ? అసలు ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఉండాలన్న ధ్యాస ఎవరికీ ఎందుకు ఉండట్లేదు ? ప్రయివేట్ కళాశాలలో మార్కులు , మార్కెట్ తప్ప మానవ విలువలకి స్తానం ఉందా ? విద్య విజ్ఞానం కోసమే , మానవ మనుగడ కోసమే అన్న ధోరణిలో భోధన జరుగుతుందా ? సమాధానం లేని ప్రశ్నలు గా మిగిలి పోతున్నాయి .

విద్యార్థి , ఉపాధ్యాయ పాత్ర లేనిదే తెలంగాణ ఉద్యమం లేదు , తెలంగాణ రాగానే అణచివేతనే అస్త్రంగా అందరి మీదా కేసులు . ఇప్పుడు ఏకంగా న్యాయం కోసం ప్రశ్నిస్తున్న  విద్యార్థి తల్లి తల్లితండ్రుల్ని కూడా పోలీస్ స్టేషన్ లలో పెడుతున్నారు . ఇదేనా మనం కోరుకున్న త్యాగాల తెలంగాణా ?
ఇప్పుడు తెలంగాణ లో జరుగుతున్నా ఈ ఆత్మహత్యలు ఆగాలంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపాట్టాలి . దోషులని శిక్షించాలి , ఫెయిల్ అయినా వారి పేపర్లు నిపుణులు, అనుభవజ్ఞులచే దిద్దించాలి . ఈ సంవత్సరం పరీక్షల నిర్వహణ ఆ గ్లోబరినా సంస్థ అధినేత కేటీఆర్ ఆప్త మిత్రుడు కాబట్టి ఇచ్చారు అన్న విషయం పై విచారణ చేపట్టాలి. చని పోయిన విద్యార్థుల కుటుంబాలకి నష్టపరిషారం చెల్లించాలి .

 

RELATED ARTICLES

Latest Updates