కరోనాను జయించిన 45 రోజుల శిశువు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఆస్పత్రిలో చేరినప్పుడు 20 రోజులే..
  • గాంధీలో చికిత్సతో కోలుకొని ఇంటికి..
  • 35 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌
  • వీరిలో 13 మంది చిన్నారులు..
  • రాష్ట్రంలో మరో 7 పాజిటివ్‌ కేసులు..
  • అన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే
  • వరుసగా మూడోరోజూ సింగిల్‌ డిజిట్‌..
  • 1016కు చేరిన మొత్తం కేసుల సంఖ్య

మహబూబ్‌నగర్‌కు చెందిన 20 రోజుల ఓ శిశువు.. కరోనాను జయించాడు. తండ్రి నుంచి వైరస్‌ సోకిన ఆ చిన్నారిని 25 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేర్చగా.. కోలుకున్న ఆ శిశువును బుధవారం ఆస్పత్రి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆ శిశువు వయసు 45 రోజులు. ఇలా 20 రోజుల శిశువు కరోనా వైరస్‌ బారిన పడి కోలువడమనేది దేశంలోనే ఇదే ప్రథమమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘనత గాంధీ ఆస్పత్రి వైద్యులకే దక్కిందని పేర్కొంటున్నాయి. ఇక రాష్ట్రంలో బుధవారం మొత్తం 35 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వీరిలో 13 మంది చిన్న పిల్లలు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 409కి చేరింది. అయితే బుధవారం కొత్తగా మరో 7 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివేనని అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు రామంతాపూర్‌లోని నవరంగ్‌గూడకు చెందిన మహిళ(58) ఉన్నారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు 9 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1016కు చేరింది. అయితే గడిచిన 6 రోజుల్లో కలిపి కేవలం 46 కేసులే వచ్చాయి. కేసుల సంఖ్య బాగా తగ్గు ముఖం పడుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ ఊపిరి పీల్చుకుంటోంది. ఈ నెలలో సింగిల్‌ డిజిట్‌ కేసులు నమోదు కావడం ఇది ఐదోసారి కాగా.. వరుసగా ఇది మూడో రోజు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 582 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఐసీయూలో 10 మంది..
ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో 10 మంది ఐసీయూలో ఉన్నారు. వారిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా, మిగిలిన వారిలో నలుగురికి ఆక్సిజన్‌ సపోర్టు ఇస్తున్నారు. ఐసీయూలో ఉన్న వారిలో ఇద్దరికి మూత్రపిండాల వైఫల్యం కారణంగా డయాలసిస్‌ చేస్తున్నారు. మరొకరు ఓరల్‌ కేన్సర్‌తో, ఇంకొకరు లింఫోమా కేన్సర్‌, ఒకరు పాంక్రియాజ్‌ సమస్యతో బాధపడుతున్నారు. నలుగురు గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీరంతా త్వరలోనే కోలుకుంటారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నెలలోపు చిన్నారి కరోనా నుంచి కోలుకోవడంపై మంత్రి ఈటల సంతోషం వ్యక్తంచేశారు. గాంధీ వైద్యులు, నర్సింగ్‌ స్టాఫ్‌, పారామెడికల్‌ సిబ్బందికి అభినందలు తెలిపారు. రోగులు కూడా డిశ్చార్జ్‌ సమయంలో వీరందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా వైరస్‌ మరణాల రేటు విషయంలో దేశంతో పోలిస్తే తెలంగాణలో 2.5ు ఉండగా, దేశవ్యాప్తంగా 3.2ు ఉందని, దాన్ని మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు ఈటల తెలిపారు.

11 జిల్లాల్లో లేని యాక్టివ్‌ కేసులు..
తెలంగాణలో ఒక్క యాక్టివ్‌ కేసు లేని జిల్లాలు 11 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటిలో సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి, నాగర్‌ కర్నూల్‌, ములుగు, యాదాద్రి జిల్లాలున్నాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates