వలస జీవుల దైన్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కూలీల జీవితాలపై తీవ్ర ప్రభావం ప్రపంచ బ్యాంకు అధ్యయన నివేదిక వెల్లడి

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అమలవుతున్న కరోనా లాక్‌డౌన్‌ 4 కోట్ల మంది వలస జీవుల బతుకులను ఛిన్నాభిన్నం చేసింది. కాయకష్టం చేసుకుని బతికే వారిని రోడ్డున పడేసింది. వలస కూలీల జీవితాల్లో లాక్‌డౌన్‌ అంతులేని ఆవేదనకు కారణమైందని ప్రపంచబ్యాంకు తాజాగా ఒక అధ్యయన నివేదిక విడుదల చేసింది. లాక్‌డౌన్‌తో కొన్ని రోజుల వ్యవధిలోనే 50 వేల నుంచి 60 వేల మంది వలస కూలీలు పట్టణ కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దేశం లో అంతర్గత వలసల రేటు అంతర్జాతీయ వలసల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ అని వెల్లడించింది. అంతర్గత వలసదారులకు ఆరోగ్య సేవలు, ఆర్థిక సాయం అందించడం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారిందని పేర్కొంది. ఈ పరిస్థితిని, సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.

గతేడాది పెరిగిన అంతర్జాతీయ వలసలు: కరోనా వైరస్‌ సంక్షోభం దక్షిణాసియాలో అంతర్జాతీయ, అంతర్గ త వలసలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. భారత్‌ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు అనుమతి కోరే వారి సం ఖ్య పెరుగుతోంది. ఇలా గతేడాది అ నుమతి కోరిన వారు 36 శాతం పెరిగి, 3.68 లక్షలకు చేరుకుంది. అలాగే పాకిస్తాన్‌లో వలసదారుల సంఖ్య 2019లో 63శాతం పెరిగి, 6.25 లక్షలకు చేరుకుందని ప్రపంచబ్యాంకు తెలిపింది. కరోనా మహమ్మారితో ఈ ఏడాది అంతర్జాతీయ వలసలు తగ్గుతాయని అంచనా వేసింది. మరోవైపు ప్రస్తుతం ఆయా దేశా ల్లో ఉన్నవారు అంతర్జాతీయ విమాన సర్వీ సులు నిలిచి పోవడంతో స్వదేశానికి రాలేకపోతున్నారు.

ఉపాధి కష్టమే..: ఇతర దేశాలకు వెళ్లిన వలస కార్మికులు, ఇతర ఉద్యోగులు ఆయా దేశాల్లో కరోనాతో ఏర్పడిన ఆర్థి క సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకొంది. మన దేశం నుంచి వెళ్లిన కార్మికులు కరోనా కారణంగా ఆయా దేశాల్లోని శిబిరాల్లోనూ, వసతి గృహాల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితి అంటువ్యాధులను వ్యాపింపజేసే అవకాశముంది. రవాణా సేవలను నిలిపేయడం వల్ల వారంతా ఆయా దేశాల్లోని శిబిరాల్లో చిక్కుకుపోయారు. కొన్ని దేశాలు వలస కార్మికులకు వీసాల పొడిగింపునిచ్చాయి. ప్ర పంచవ్యాప్తంగా వైద్య నిపుణుల కొరత, వైద్య రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులపై నిర్లక్ష్యం వల్ల ఈ మహమ్మారి వి జృంభించడానికి కారణమైందని ప్రపంచబ్యాంకు పేర్కొం ది. విదేశాల నుంచి వలస వచ్చిన కార్మికులను భారతదేశం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలను ప్రస్తావించింది.

Courtesy Sakshi

RELATED ARTICLES

Latest Updates