కొలువుకోసం.. కళ్లల్లో ఒత్తులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకునే ఆశావహుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గణాంకాలే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ 2015లో వన్‌టైమ్ రిజిస్ట్రేష న్ (ఓటీఆర్) విధానం ప్రవేశ పెట్టగా ఆ సంవత్సరంలో ఓటీఆర్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య అప్పట్లో ఆరేడు లక్షలు ఉండగా ప్రస్తుతం అది 24,59,464 దాటింది. అందులో స్థానికత తెలంగాణ రాష్ట్రం కాని వారు 1,77,815 మంది ఉండటం గమనార్హం. మరోవైపు ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓటీఆర్ నమోదు చేసు కున్న వారు మరో 22,88,700 మంది ఉన్నారు.

మూడేళ్లలో రెట్టింపునకు మించి..
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకునే అభ్యర్థుల సంఖ్య మూడేళ్లలో రెట్టింపునకు మించి పెరిగింది. 2016 ఫిబ్రవరి నాటికి 10,04,427 మంది ఓటీఆర్ నమోదు చేసుకోగా, ఇపుడు భారీగా పెరిగి 24,59,464 దాటింది. అందులో ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్న వారు కూడా ఉన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే దానికంటే మెరుగైన దానికోసం ఓటీఆర్ నమోదు చేసుకున్న ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 5 లక్షల మందిలో 2 లక్షల మంది వరకు ఓటీఆర్ నమోదు చేసుకున్నా.. మిగతా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులంతా రాష్ట్రంలోని నిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులే కావడం గమనార్హం.

పెరిగిన మహిళా అభ్యర్థుల సంఖ్య..
టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్ నమోదు చేసుకున్న మహిళా అభ్యర్థుల సంఖ్య ఈ మూడేళ్లలో రెండు రెట్లు పెరి గింది. 2016 ఫిబ్రవరి నాటికి వీరు 3,47,711 మం ది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 10 లక్షల వరకు చేరుకుంది. అదే పురుషులు అప్పట్లో 6,56,697 ఉండగా ఇప్పుడు 14.66 లక్షలు దాటిపోయింది.

ఓటీఆర్ నమోదులో టాప్ కరీంనగర్
టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్ నమోదులో కరీంనగర్ అభ్యర్థులు అత్యధికంగా ఉన్నారు. అన్నింటికంటే తక్కువ మంది నిజామాబాద్ జిల్లా వాసులే. కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులు గత జూన్ నెల నాటికి 3,00,699 మంది ఉండగా, నిజామాబాద్ నుంచి 1,46,717 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కరీంనగర్ తరువాత అత్యధికంగా వరంగల్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు.

బీఏ, బీకాం చదివిన వారే అత్యధికం..
వివిధ డిగ్రీలు చదివి, ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులు 15 లక్షల మందికి పైగా ఉండగా, పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుకున్న వారు 5 లక్షల మంది వర కు ఉన్నారు. డిగ్రీ చదివిన వారిలో బీఏ చదివి ఓటీఆర్ నమోదు చేసుకున్న వారు 2.53 లక్షల మందికి పైగా ఉండగా, ఆ తర్వాత స్థానంలో బీకాం అభ్యర్థులున్నా రు. దాదాపు 2 లక్షల మంది బీకాం గ్రాడ్యుయేట్లు ఓటీఆర్ నమోదు చేసుకున్నారు. ఇంటర్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం నమోదు చేసుకు న్న వారి లో ఎంపీసీ విద్యార్థులు అత్యధికంగా (9,97,303) ఉండగా, ఆ తర్వాత సీఈసీ వారున్నారు.

జిల్లాల వారీగా ఓటీఆర్ నమోదు వివరాలు..

Courtesy Sakshi

RELATED ARTICLES

Latest Updates