టీటీడీలో 1400 మంది కార్మికుల తొలగింపు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 1400 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగించింది. ‘కాంట్రాక్టర్‌ భాస్కర్‌నాయుడు ఏజెన్సీ రద్దయ్యింది.. తిరిగి ఏజెన్సీకి ఇచ్చే వరకూ మీకు పనిలేదు’ అంటూ కార్మికులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కార్మికులు గురువారం సాయంత్రం నుండి తిరుపతి విష్ణునివాసం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన బాటపట్టారు. లాక్‌డౌన్‌ సమయంలో కార్మికులను తొలగించరాదనీ, విధులకు రాకపోయినా వేతనాలు చెల్లించాలని కేంద్రం జారీ చేసిన జీఓను ఉల్లంఘిస్తూ కార్మికులను తొలగించడం దారుణమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే దశలవారీ ఆందోళన చేపడతామన్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates