టుడే టాప్ న్యూస్

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ సర్కారును కూలదోసేందుకు రంగం సిద్ధమైంది. 

 మధ్యప్రదేశ్ లో రాజకీయ అనిశ్చితి
మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం క్షణక్షణానికి మలుపులు తిరుగుతోంది. బీజేపీతో జత కట్టిన జ్యోతిరాదిత్య సింధియా.. కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి రంగం సిద్ధం చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసిన కొద్దిసేపటికే సింధియా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఉన్న 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. మరోవైపు సింధియాను పార్టీ నుంచి బహిష్కరించినట్టు కాంగ్రెస్ ప్రకటించింది.

100 దేశాలకు కోవిడ్
చైనాలో పుట్టిన కోవిడ్-19 ( కరోనా వైరస్) వంద దేశాలకుపైగా వ్యాపించింది. లక్షా పదివేలమంది పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. కరోనా కాటుకు ఇప్పటికే 3800 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్ దేశాలు కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నాయి. ఇటలీలో ఇప్పటివరకు 366 మంది మృతి చెందారు. 7375 మంది కోవిడ్ ప్రభావానికి లోనయ్యారు. ఇరాన్‌లో కరోనా మృతుల సంఖ్య 291కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 54 మంది వైరస్ కు బలయ్యారు. 8 వేల మంది వరకు ఈ మహమ్మారి బారిన పడినట్టు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా లేదు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కరోనా కేసులు లేవని రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు ప్రకటించారు. తెలంగాణలో 32 మంది అనుమానితులు ఉండగా వీరిలో 17 మందికి కోవిడ్ సోకలేదని నిర్ధారణైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వీరిలో మహేంద్రహిల్స్‌కు చెందిన యువకునికి మినహా మిగిలిన వారందరికీ కరోనా వైరస్‌ సోకలేదని తేలింది. ఏపీలో ఒక్కరికి కూడా కరోనా లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు
కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిస్తున్న ఇరాన్‌ నుంచి తొలి విడతగా 58 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి ప్రత్యేక వైమానిక దళ(ఐఏఎఫ్‌ సీ-17) విమానంలో వారికి భారత్ లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు తీసుకొచ్చారు. కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షల తర్వాతే వీరిని ఇరాన్ నుంచి ఇక్కడకు తరలించినట్టు సమాచారం.

వీణావాణీలకు స్క్రైబ్స్‌
అవిభక్త కవలలు వీణావాణీలు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. స్క్రైబ్‌లను ఏర్పాటు చేసి వీరితో పరీక్షలు రాయించాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇద్దరికీ వేర్వేరుగా రెండు హాల్‌టికెట్లు జారీ చేసి పరీక్షలకు అనుమతించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు నిర్ణయించారు. పదో తరగతి పరీక్షలు రాసే శక్తిసామర్థ్యాలు, అర్హత వీరిద్దరికీ ఉన్నాయని నిర్దారించారు.

యస్ బ్యాంకుకు త్వరలో కొత్త బోర్డు
తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకులో సమూల మార్పులు తీసుకురానున్నారు. యస్ బ్యాంకుకు పూర్తిస్థాయి బోర్డు ఏర్పాటు చేసేందుకు రిజర్వు బ్యాంకు కసరత్తు చేస్తోంది. యస్ బ్యాంకులో 49 పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించడంతో కష్టాల నుంచి గట్టెక్కుతుందని అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ అన్నారు. యస్ బ్యాంకును కార్పొరేట్ రుణ వ్యాపారం నుంచి రిటైల్ రుణ వ్యాపారంలోకి మారుస్తామని వెల్లడించారు. యెస్‌ బ్యాంక్‌ లో అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురిపై సీబీఐ సోమవారం లుక్‌ఔట్‌ నోటీసును జారీ చేసింది.

RELATED ARTICLES

Latest Updates