6 వారాలకొక న్యూయార్క్‌ పుట్టుకొస్తోంది!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for 6 వారాలకొక న్యూయార్క్‌ పుట్టుకొస్తోంది!"టొరంటో: నగరీకరణ ఫలితంగా జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ప్రస్తుత వేగంతో నగరీకరణ కొనసాగితే.. 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షల చదరపు కిలోమీటర్ల సహజసిద్ధ ఆవాస ప్రాంతం నగరాలుగా మారిపోతుందని అంచనా వేసింది. ఆ విస్తీర్ణం బ్రిటన్‌ పరిమాణం కంటే ఎక్కువని తెలిపింది. పట్టణాల పెరుగుదలతో జీవ వైవిధ్యంపై పడుతున్న ప్రభావాన్ని గుర్తించేందుకు గతంలో పరిశోధకులు నిర్వహించిన 900కుపైగా అధ్యయనాలను కెనడాలోని మెక్‌గిల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులతో కూడిన బృందం తాజాగా విశ్లేషించింది. ఇప్పటితో పోలిస్తే 2030 నాటికి పట్టణాల్లో జనాభా 120 కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేసింది. న్యూయార్క్‌ పరిమాణంలోని నగరాలు ప్రతి 6 వారాలకు ఒకటి చొప్పున పుట్టుకొస్తున్న దానికి అది సమానమని పేర్కొంది.

(Courtesy Eenadu)

 

RELATED ARTICLES

Latest Updates