Prgna Sigh Thakur -2008 Malegaon blasts accused gets BJP ticket

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఈమె పేరు ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్. బీజేపీ మాతృసంస్థ అయిన ఆరెస్సెస్ కి అనుబంధ అభినవ భారత్ అనే సంస్థకు చెందిన అతివాద సన్యాసిని. ఇదే వరుసలోని ఉమాభారతి, సాధ్వీ రితంభరిలకు వారసురాలు. 2006లో మహారాష్ట్రలోని మాలెగావ్ లోని మసీదు వద్ద సైకిళ్ళకు బాంబులు పేర్చి పేల్చేసి కొన్ని పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు, కొన్ని వందల్లో అవయవాలు కోల్పోవడానికి కారకురాలు. దాదాపు ఎనిమిదేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తోన్న ఈహంతకురాలు, అనారోగ్యం కారణాలుగా చూపి బెయిల్ మీద విడుదలై ఏకంగా బీజేపీ పార్టీ తరపున మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పోటీ చేస్తోంది.

ఒక ఉగ్రవాద చర్యకు, సామూహిక మరణానికి కారణమైన వ్యక్తి అనారోగ్య కారణాల్తో బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడమంటే వ్యవస్థ ఎటువైపు పోతోందో అర్థమవుతుంది. ఇలాంటి సామూహిక ఉగ్రవాద హత్యాకాండ 2008లో జరిగింది. దానికి కారణమైన స్వామీ అశిమానంద తన నేరాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. కానీ మొన్న కోర్టు కోట్టేసింది. ఈ కేసుకొట్టివేతలో సాక్షులని ఎంతగా బెదిరించారంటే పాకిస్తాన్ లోకి ఒక పసిపిల్లని కూడా కోర్టుకు రాకుండా చేశారు. చిత్రమేమంటే ఇదివరకే నేరం స్వయంగా అంగీకరించిన స్వామి అశిమానంద మీద నేరం, శిక్ష నిర్దారణ జరిగినా మరోసారి ట్రయల్ చేపట్టిన కోర్టు అశిమానంద నిర్దోషి అని తీరుప్ చెప్పినప్పుడు మరి 80మందీ పైగా చనిపోయిన ఈ పేలుళ్లకు కారణం ఎవరో నిర్దారించలేదు!

దీనికి విరుద్దంగా దాదాపు ఇదే మాలెగావ్ పేలుళ్ల కేసులో లాగానే టైగర్ మెమన్ అనే వ్యక్తి కూడా 1993 బొంబాయి పేలుళ్లలో నిందితుడిగా నిరూపణ చేయడం, కోర్టు మరణ శిక్ష విధించడము పూర్తయ్యింది. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పటేల్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన యువకుడు హార్దిక్ పటేల్ మీద బోగస్ రాజద్రోహం కేసు పెట్టి ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. ఇది నడుస్తున్న వర్తమానం. భయంకర భవిష్యత్ లోకి నడిపిస్తోన్న వర్తమానం.

RELATED ARTICLES

Latest Updates