విచారణకు నిర్ణీత వ్యవధి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

దర్యాప్తు విషయంలోనే కాదు, కేసు విచారణలో కూడా ఎలాంటి కాలయాపన జరుగకూడదన్నది శాసనకర్తల ఉద్దేశం. అందుకని కేసు విచారణకు సంబంధించిన నిబంధన 309కి కూడా మార్పులను తీసుకొనివచ్చారు. ఈ మార్పులు తీసుకువచ్చిన నిబంధన ప్రకారం.. చార్జిషీట్ దాఖలైన తేదీ నుంచి రెండు మాసాల్లోగా కేసు విచారణ పూర్తిచేయాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీద వుంటుంది. ఒకవేళ అలా చేయకుండా పోయి అనవసర వాయిదాలు ఇస్తే ఆ న్యాయయూర్తుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అఖిల్ జావెద్ కేసులో చెప్పింది.

లైంగికదాడి లాంటి కేసుల దర్యాప్తు రెండు మాసాల్లో పూర్తిచేసి చార్జిషీట్‌ను దాఖలు చేయాలి. మెజిస్ట్రేట్ ఎలాంటి జాప్యం లేకుండా కేసును సెషన్స్ కోర్టుకు పంపించాలి. అంటే సమిట్ చేయాలి. చార్జిషీట్ దాఖలైన తేదీ నుంచి రెండు మాసాల్లోగా కేసు విచారణ పూర్తిచేసి తీర్పును ప్రకటించాల్సిన బాధ్యత సెషన్స్ న్యాయమూర్తిపై వుంటుంది. ఇంతవరకు బాగానే వుంది. మరీ జాప్యం ఎందుకు జరుగుతుందీ అన్న ప్రశ్న వస్తుంది. నిబంధనలు వుండటంతోనే సరిపోదు, వటి అమలుజరుగాలి. అమలు జరిగే విధంగా పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలి.

దేశంలో ఏదైనా దిశ లాంటి సంఘటన జరుగగానే కఠినమైన చట్టాలు తీసుకొనిరావాల్సిన అవసరం ఉందన్న డిమాండు తరచూ వినిపిస్తుంటుంది. అదేవిధంగా లైంగికదాడులకు పాల్పడిన వ్యక్తలను అప్పుడే ఎన్‌కౌంటర్ చేయాలని కూడా చాలామంది అంటూ వుంటారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని కూడా చాలామంది డిమాండు చేస్తూ ఉంటారు. మీడియా దానికి వత్తాసు పలుకుతూ వుంటుంది. న్యాయపరిపాలన వ్యక్తుల డిమాండును బట్టి జరుగ దు. దానికి ఒక పద్ధతి వుంది. రాజ్యాంగం వుంది. శాసనాలు ఉన్నాయి. వాటి ప్రకారం జరుగుతాయి.

అయితే ప్రజల ఆక్రోషంలో, డిమాండులో బాధ వుంది. వేదన వుం ది. కోపం వుంది. దానికి ప్రధానమైన కారణం కేసుల విచారణల్లో జాప్యం. తుది నిర్ణయం వెలువడటానికి అనేక సంవత్సరాలు పడుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులోనే ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో హేయమైన నేరాలు జరిగినప్పుడు అలాంటి డిమాండ్లు రావడం సహజమే. నిర్భయ సంఘటన తరువాత చట్టాల్లో చాలా మార్పులు వచ్చాయి. అయినా జాప్యం జరుగుతున్నది. దీనికి కారణం ఏమిటీ? ఇదీ చాలామంది అడుగుతున్న ప్రశ్న. కాగ్నిజబుల్ నేరం (మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా ముద్దాయిని అరెస్టు చేసే అధికారం) కేసుల్లో సమాచారం అందగానే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను విడుదల చేసి కేసు దర్యాప్తు చేపట్టాలి.

ఆ సంఘటన తమ అధికార పరిధిలో జరిగిందా లేదానన్న అం శంతో సంబంధం లేకుండా పోలీసులు ఈ చర్యలు తీసుకోవాలి. నాన్ కాగ్నిజబుల్ నేరాల్లో మాత్రం ఆ నేరం పోలీసుల అధికార పరిధిలో జరుగాలి. మెజిస్ట్రేట్ అనుమతి అవసరం. కాగ్నిజబుల్ నేరాలకు ఇది అవస రం లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 154 ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. 1974 లో కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వాతి బెహరా (1976) కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్భయ కేసు తర్వాత ఈ జీరో ఎఫ్‌ఐఆర్ భావన అందరి దృష్టిని ఆకర్షించింది. అయినా పోలీసులు వివిధ కారణాల వల్ల కేసులను నమోదు చేయకుం డా బద్‌నాం అవుతున్నారు. బాధితులు నష్టపోతున్నారు.

యాసిడ్ దాడులు, మహిళలపై లైంగికదాడుల వంటి నేర సమాచారాలను మహిళా పోలీసు అధికారులు నమోదుచేసే ఎఫ్‌ఐఆర్‌లను విడుదల చేయాలి. మానసిక వైకల్యం, శారీరక వైకల్యం వున్న మహిళలపై ఈ నేరాలు జరిగితే, మహిళా పోలీసు అధికారి బాధితురాలి ఇంటికివెళ్లి ప్రథ మ సమచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, దాన్ని వీడి యో కూడా తీయించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆమె స్టేట్‌మెంట్‌ను జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో సాధ్యమైనంత త్వరగా నమోదు చేయించాల్సి ఉంటుంది.

మహిళలపై లైంగికదాడుల కేసుల దర్యాప్తును సత్వరం ముగించాల్సి న బాధ్యత దర్యాప్తు అధికారిపై ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 173 (1ఏ) ప్రకారం ప్రథమ సమాచారం అందిన రెండు మాసాల్లోగా ఈ దర్యాప్తును పూర్తిచేసి చార్జిషీట్ (పోలీస్ రిపోర్డు)ను దాఖలు చేయాల్సి వుంటుంది. నిర్భయ కేసు తర్వాత చట్టంలో ఈ మార్పును తీసుకొని వచ్చారు. లైంగికదాడి ఆరోపణలున్న కేసుల్లో దర్యాప్తు వెం టనే పూర్తికావాలని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు మాసాలకు మించకూడదని శాసనకర్తల ఉద్దేశం. ఈ నిబంధనను ఎంతమంది పోలీసులు పాటిస్తున్నారన్నది పైఅధికారులు చూడాలి.

దర్యాప్తు విషయంలోనే కాదు, కేసు విచారణలో కూడా ఎలాంటి కాలయాపన జరుగకూడదన్నది శాసనకర్తల ఉద్దేశం. అందుకని కేసు విచారణకు సంబంధించిన నిబంధన 309కి కూడా మార్పులను తీసుకొనివచ్చారు. ఈ మార్పులు తీసుకువచ్చిన నిబంధన ప్రకారం.. చార్జిషీట్ దాఖలైన తేదీ నుంచి రెండు మాసాల్లోగా కేసు విచారణ పూర్తిచేయాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీద వుంటుంది. ఒకవేళ అలా చేయకుండా అనవసర వాయిదాలు ఇస్తే ఆ న్యాయయూర్తుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అఖిల్ జావెద్ కేసులో చెప్పింది. కేసు విచారణ రోజు తరువాత రోజు జరుగాలి. ఒకవేళ వాయిదా ఇవ్వాల్సి వస్తే అందుకు సంతృప్తికరమైన కారణాలను న్యాయమూర్తి పేర్కొనాల్సి ఉంటుంది. ఈ మార్పులన్నీ 21.4.2018 నుంచి అమల్లోకి వచ్చాయి.

లైంగికదాడి లాంటి కేసుల దర్యాప్తు రెండు మాసాల్లో పూర్తిచేసి చార్జిషీట్‌ను దాఖలు చేయాలి. మెజిస్ట్రేట్ ఎలాంటి జాప్యం లేకుండా కేసు ను సెషన్స్ కోర్టుకు పంపించాలి. అంటే సమిట్ చేయాలి. చార్జిషీట్ దాఖలైన తేదీ నుంచి రెండు మాసాల్లోగా కేసు విచారణ పూర్తిచేసి తీర్పును ప్రకటించాల్సిన బాధ్యత సెషన్స్ న్యాయమూర్తిపై వుంటుంది. ఇంతవర కు బాగానే వుంది. మరీ జాప్యం ఎందుకు జరుగుతుందీ అన్న ప్రశ్న వస్తుంది. నిబంధనలు వుండటంతోనే సరిపోదు, వటి అమలు జరుగాలి. అమలు జరిగే విధంగా పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలి.

ఇక్కడితో అయిపోలేదు. ఈ నిర్ణీత కాలవ్యవధి (టైమ్ ప్రేమ్) పోలీసులకు, సెషన్స్ కోర్టులకు మాత్రమే ఉంది. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టులకు లేదు. ఈ కారణంగా కూడా కేసు అప్పీళ్ల, రివిజన్ల విచారణలు సంవత్సరాల కొద్దీ జరుగుతున్నాయి. శిక్షలకు సంబంధించి తీసుకొచ్చిన సవరణలు నా దృష్టిలో సరిగ్గానే వున్నాయి. జీవిత ఖైదు విధించినప్పుడు గతంలో మాదిరిగా కాకుండా అతని తుది జీవితం వరకు సామూహిక లైంగికదాడి కేసులో విధించే విధంగా మార్పులు తీసుకొని వచ్చారు. హైకోర్టు, సుప్రీంకోర్టులకు కూడా టైమ్‌ప్రేమ్‌ను ఏర్పాటు చేసేవిధంగా మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ విషయం గురించి ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. అప్పుడే శాసనకర్తలు తమ దృష్టిని ఈ టైమ్‌ఫ్రేమ్ మీద కేంద్రీకరిస్తారు. ఆ విధంగా మార్పులు తీసుకొని రానంతవరకు ఈ కేసుల విచారణ అంతులేకుండా కొనసాగుతుంది. బాధితులు, వారి తల్లిదండ్రులు, సమాజం ఆందోళనకు గురవుతూనే ఉంటుంది. మళ్లీ ఏదైనా సంఘటన జరుగగానే బహిరంగంగా ఉరితీయాలి. ఎన్‌కౌంటర్లు చేయాలి అన్న డిమాండ్లు వస్తూనే ఉంటాయి. దానివల్ల పోలీసుల మీద, రాజ్యం మీదా ఒత్తిడి పెరిగి న్యాయపాలన విఘా తం ఏర్పడే అవకాశం ఉంది.

ఇక శిక్షల విషయానికి వస్తే ఎంత శిక్ష విధించాం అన్నదానికన్నా ముఖ్యం శిక్షపడిందా లేదా అన్నది ప్రధానమైన అంశం. అరుదైన కేసుల్లో అరుదైన వాటిల్లోనే కోర్టులు మరణశిక్షలను విధిస్తున్నాయి. కేసును విచారించిన కోర్టు మరణశిక్షను విధించినప్పటికీ అది అరుదైన వాటిలో అరుదైనది కాకపోవడం వల్ల హైకోర్టు ఆ శిక్షలను జీవిత ఖైదుగా మారుస్తున్నాయి. ఉరిశిక్ష అనేది చనిపోయే స్థితిలో ఉంది. ఉరిశిక్ష పడిన కేసుల్లోని చాలామంది నిందితులు అమాయకులుగా తరువాత బయటపడుతుం ది. ఇది మనదేశంలోని సంగతి కాదు. అమెరికాలోన సంగతి. మన దేశం లో కూడా ఆ మధ్య ఉరిశిక్షను సుప్రీంకోర్టు ముగ్గురికి విధించింది. అదే సుప్రీంకోర్టు ఆ తరువాత వాళ్లు అమాయకులని తేల్చింది. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సంపూర్ణ సాక్ష్యం లభించడం అన్ని కేసుల్లో జరుగదు. అందుకని శిక్ష పడటం ముఖ్యం. అది అత్యంత అవసరం.

(వ్యాసకర్త: గతంలో జిల్లా సెషన్స్ జడ్జిగా,
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు.)

 

RELATED ARTICLES

Latest Updates