లంచ్‌ చేస్తున్నాం.. తీరిక లేదు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for nalgonda police 100 dial no response"

  • స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వండి..
  • 100కు కాల్‌ చేసిన యువతికి నల్లగొండ పోలీసుల సమాధానం
  • ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన ఆంధ్రజ్యోతి
నల్లగొండ : ‘100కి ఫోన్‌ చేయండి. ఐదు నిమిషాల్లో వచ్చేస్తాం’ ఇది పోలీసులు చెప్పేది. లంచ్‌ చేస్తున్నాం.. తీరిక లేదు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.. ఇదీ నల్లగొండ జిల్లా వన్‌ టౌన్‌ పోలీసుల సమాధానం. డయల్‌ 100కు కాల్‌ చేసిన విజయలక్ష్మి అనే యువతికి ఈ చేదు అనుభవం ఎదురైంది ఆమె తల్లితో కలిసి గుండ్లపల్లి క్రాస్‌ రోడ్డులోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తోంది. పక్కింటి వారు దాడికి దిగగా 100కి కాల్‌ చేసింది. ‘మీ కేసు ఐడీ నెంబర్‌ 20190020908433 నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు మిమ్ములను సంప్రదిస్తారు’. అంటూ సందేశం వచ్చి ంది. తర్వాత వన్‌టౌన్‌ నుంచి పోలీస్‌ సిబ్బంది విజయలక్ష్మికి ఫోన్‌ చేసి ‘మేం లంచ్‌ చేస్తున్నాం. తీరిక లేదు. స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వండి. తర్వాత దాడి చేసిన వారిని పట్టుకొస్తాం’. అని సమాధానం ఇచ్చారు. ఆవేదనకు గురైన యువతి ఈ చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఈ అంశాన్ని ఎస్పీ రంగనాథ్‌ దృష్టికి ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’ తీసుకెళ్లగా, విచారణ జరపాలని ఆదేశించారు. వన్‌టౌన్‌ పోలీసులు విజయలక్ష్మి, ఆమెపై దాడికి యత్నించిన వారిని తీసుకొచ్చి విచారించారు. విజయలక్ష్మి ఫిర్యాదుపై అమర్యాదగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన సిబ్బందిపై విచారించి చర్య తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
బిహార్‌లో మరో దిశ!
దిశ హత్యాచార ఉదంతం దేశాన్ని కుదిపేస్తున్నా వివిధ రాష్ట్రాల్లో బాలికలు, మహిళలపై కామాంధుల కిరాతకాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ తరహాలోనే.. బిహార్‌లోని బక్సర్‌ జిల్లా కుకుది గ్రామంలో బాలికపై హత్యాచారానికి పాల్పడి , దహనం చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ముఖం నుంచి ఉదర భాగం వరకు తీవ్రంగా కాలిపోవడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. ఆమె తలలో బుల్లెట్‌ ఉన్నట్లు పోస్టుమార్టంలో బయటపడటం గమనార్హం. రాజస్థాన్‌లోని ఝాలావాఢ్‌లో బాలికపై సమీప బంధువు (37) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఆమె ఇంట్లోనే దారుణానికి ఒడిగట్టాడు. చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆమె ధైర్యం తెచ్చుకుని టీచర్లకు తెలియజేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కామాంధుడిని అరెస్టు చేశారు.

(Courtesy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates