భారత పౌరసత్వ ప్రక్రియలో వివక్షా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
నీరజా గోపాల్‌ జయల్‌వ్యాసకర్త: జెఎన్‌యు ప్రొఫెసర్‌

దేశంలో ఎంతమంది ప్రజలున్నారో లెక్కించడం కోసం భారత రాజ్యం ప్రదర్శిస్తున్న తాపత్రయం అంతా ఇంతా కాదనేది కనిపిస్తూనే వుంది. 2021 జనాభా లెక్కల కోసం రిజిస్ట్రార్‌ జనరల్‌, జనగణన విభాగం కమిషనర్‌ దశాబ్ది ప్రణాళిక సిద్ధం చేశారు. జనాభా లెక్కలతో పాటు జనాభా రిజిస్టర్‌లో నమోదుకు వ్యక్తిగత వివరాల సేకరణకు సంబంధించిన ప్రక్రియ కూడా వచ్చే వేసవిలో మొదలు పెట్టాల్సి ఉంది. 2019 జనవరి నాటికి 123 కోట్ల ఆధార్‌ కార్డుల జారీ పూర్తవుతుంది. ఇవన్నీ ఇలా వుంటే మొన్న పార్లమెంటులో జనగణనకు సంబంధించిన మరో కసరత్తు ప్రతిపాదించారు. అదే దేశ పౌరుల జాతీయ రిజిస్టర్‌ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌-ఎన్‌ఆర్‌సీ) ఇదివరకు ఈ పని చేసిన వారు పౌరులనే పేరుతో గాక నివాసులుగానే లెక్కలు తీశారు. కానీ ఈ కసరత్తు ఉద్దేశం మాత్రం పౌరులను లెక్క కట్టడమంటున్నారు. అంటే నిర్దిష్టంగా కొంతమంది పౌరులను గుర్తించి, పౌరులు కాని వారిని వేరు చేయడం ఈ ప్రయత్నం పరమార్థం. కొంతమందిని కలపడం కొంతమందిని తొలగించడం చొరబాటుదారులనే వారిని ఏరి పారేయడం కోసం ఇదంతా చేసిన తర్వాత వారిని నిర్బంధ శిబిరాలకు తరలించడం లేదా దేశం నుంచి పంపేయడం జరగొచ్చు.

దేశ వ్యాపితంగా ఈ ఎన్‌ఆర్‌సీ తతంగం, దాని సాధ్యాసాధ్యాలు, అన్నిటినీ మించి నైతిక చట్టబద్దత ప్రశ్నార్థకమైనవి. 1947 విదేశీయుల చట్టం ప్రకారం విదేశీయుడుగా ఆరోపణకు గురైన వ్యక్తి తన గుర్తింపును తానే రుజువు చూపుకోవలసి ఉంటుంది. పరాయి దేశస్తులను గుర్తించేందుకు పౌరసత్వ చట్టంలో ఎలాంటి యంత్రాంగం లేదు గనక ఇలా చేయక తప్పదంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సుప్రీంకోర్టు అక్రమ వలసదారుల చట్టం (ట్రిబ్యునల్‌ ద్వారా గుర్తింపు) ‘ఐఎండీటీి-2005’ను కొట్టి వేసింది. అయితే ఎన్‌ఆర్‌సీ మొత్తం జనాభానే విదేశీయుల ముద్రకు గురి చేస్తున్నది. పరాయి వారెవరో గుర్తించేందుకు సాధనాలే లేని ఒక రాజ్యం వారి చొరబాటును అడ్డేందుకు సరిహద్దు రేఖలు కూడా రూపొందించుకోలేని ఒక ప్రభుత్వం తొలగింపు ప్రక్రియ ద్వారా వారిని గుర్తించబూనడం ఎలా సమర్థనీయం? ఒక చీమను చంపేందుకు ఏనుగును పురమాయించడం ఎలాంటిదో ఇదీ అంతే. కాకపోతే ఇక్కడ ఇందుకోసం ఏనుగుకు తర్ఫీదు కూడా ఇవ్వడం జరుగుతుంది.

అలాంటి ఎన్‌ఆర్‌సీ తతంగం పూర్తి చేయడానికి కావలసిన వనరుల గురించి ముందుగా పరిశీలిద్దాం. దానికి సంబంధించిన తీవ్ర నైతిక అభ్యంతరాలను తర్వాత చూద్దాం. అస్సాం ఎన్‌ఆర్‌సీలో 3.3కోట్ల మంది దరఖాస్తుదారులను పూర్తిగా నమోదు చేయడానికి 50వేల మంది అధికారులు రూ.1,600కోట్ల ఖర్చుతో పని చేయవలసి వచ్చింది. ఈ వ్యవహారాన్ని పూర్తిగా బలపర్చేవారు కూడా ఇంత వ్యయ ప్రయాసలు సరైనవని భావించలేకపోయారు. చివరకు అసోం ఎన్‌ఆర్‌సీ 19లక్షల మందిని గుర్తించగలిగింది. ఈ లెక్క ప్రకారం 87.9 కోట్ల మంది వున్న దేశంలో జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీ అమలు చేయాలంటే రూ.4.26 లక్షల కోట్లు కావాలి. ఇది 2జీ స్కామ్‌లో అంచనా కట్టిన నష్టానికి రెట్టింపు. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యకు కేటాయించిన దానికన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 87.9 పత్రాలను సాధికారికంగా అధ్యయనం చేయాలంటే 1.33కోట్ల మంది కావాలి. 2011-12లో దేశంలో ఉన్న మొత్తం ప్రభుత్వోద్యోగుల సంఖ్య 2.9కోట్లు.

ఇది చాలా తాజా లెక్క. జనాభా లెక్కల సేకరణ లాగే దీన్ని కూడా కేవలం కేంద్రమే నిర్వహించాలని భావించేట్టయితే అప్పుడు మరింత సిబ్బంది కావాలి. బహుశా ఆ విధంగా చూస్తే బాగా ఉద్యోగాలు కల్పించే వ్యవహారం అవుతుంది. అటూ ఇటూ తిరిగి దేశ జనాభా మొత్తం వున్న అధికారులలో సగభాగం పాలు పంచుకోవలసి వస్తుంది. కనీసం మరో పదేండ్ల పాటు ఈ వివరాల లెక్కింపు, పునఃపరిశీలన జాతీయ ఆనంద సూచికకు అత్యంత అరుదైన ఉత్పాదకతను జోడిస్తుంది. మిగిలినది వారిని నిర్బంధ కేంద్రాల నిర్మాణంలోనూ జాబితా నుంచి మినహాయించిన అభాగ్యులను అక్కడ బంధించడం లోనూ సరిపోతుంది.
భారతీయ పాలనా వ్యవస్థ సమర్థతకున్న పరిమితులు బహిరంగ రహస్యాలే. ఇదే పేదలకూ నిరక్షరాస్యులకూ పీడకలగా మారుతుంది. వారి పూర్వీకులకు తెలిసిన నేల ఇదే. మరొక ఊసే ఎరగరు. అధికారులు ఆమోదించే పత్రాలు వారి దగ్గర వుండవు. అసోం అనుభవాలు కొన్ని పాఠాలు నేర్పాయి. అక్కడ అనుకోని ఫలితాలు వచ్చాయి. ఎవరైతే ఈ తతంగాన్ని అమితోత్సాహంతో ఆహ్వానించారో వారికే అవి మింగుడు పడటం లేదు. మనం కాగితాలపై పౌరసత్వం అనే భావనను చూడ నిరాకరించడం హాస్యాస్పదం అవుతుంది. బంధుత్వాల సముదాయం లాభాల చట్రం మనకు కాగితాలు తెప్పించాయని కమల్‌ సాదిఖ్‌ అంటారు. అలాటి పద్ధతులలో పౌరులను నమోదు చేయాలనుకుంటే పత్రాలు లేనివారి పౌరసత్వం ప్రమాదంలో పడుతుంది. ఏమంటే నిజమైన జాతీయేతర వలసదారులు ఉన్నా పకడ్బందీ అయిన పత్రాలు సిద్ధం చేసుకునే ఉంటారు. సరైన పత్రాలు లేవనే భయంతో ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా జరుగుతాయని కూడా మనం సిద్ధమై ఉండాలి.

ఇక్కడ అంతుపట్టని అనేక అంశాల్లో పౌరసత్వ నిర్ణయానికి ఏ తేదీని కొలబద్దగా తీసుకోవాలన్నదే. అసోం బయిటకు వస్తే 1971 మార్చి అన్నది అసలు అక్కరకు రాదు. తక్కిన దేశానికి 1948 జులై కొలబద్దగా పెట్టాలనే ఆలోచన కూడా జరిగేది కాదు. ఎందుకంటే రాజ్యాంగ నిబంధనలు గాని దేశ విభజనానంతరం వెలువడిన న్యాయ సంబంధమైన వ్యవస్థ గాని అందుకు సరిపోదు. అసలు 1955 పౌరసత్వ చట్టమే ఒప్పుకోదు. రెండోది: అసోంలో వలె ఇతర చోట్ల కూడా ఫీజు లేకుండా ఎన్‌ఆర్‌సీ తప్పనిసరి చేస్తే ఏమవుతుంది? చివరగా ఫెడరల్‌ విధాన సూత్రాల ప్రకారం ఈ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవలసి ఉంటుంది. ఇప్పటికే ఈశాన్యంలో చాలా రాష్ట్రాలు నిరసన తెల్పుతున్నాయి. సుప్రీం కోర్టు రెండు దశాబ్దాల కిందటనే అరుణాచల్‌ ప్రదేశ్‌లో ‘చక్మా, హబాంగ్‌’ తెగల వారికి పౌరసత్వం ప్రసాదించింది. కానీ రాజకీయ కారణాల వల్లనే దాన్ని ఇప్పటి వరకూ అమలు చేయలేదు.
తమకు నచ్చని జన సముదాయాలను దేశమంటూ లేని వారుగా పౌరసత్వ రహితులుగా చేయడానికి ఎన్‌ఆర్‌సీ మార్గం చూపిస్తుంది. మరోవైపున పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) ఇష్టమైన వారికి పౌరసత్వం దఖలు పరిచేందుకు బాట వేస్తుంది. చొరబాటుదార్లంతా బంగ్లాదేశీయులని (అంటే ముస్లిములని) వారికి ఓటు హక్కు తొలగించి ఏదైనా చట్టవిరుద్ధ పద్ధతులలో వారు గనక ఎలాంటి పౌరసత్వ గుర్తింపులైనా పొందివుంటే వాటిని లాగేసుకోవడం ఎన్‌ఆర్‌సీ అంతరార్థం. ఒక సీఏబీ బహిరంగ వాగ్దానం ఏమంటే ముస్లిములు తప్ప మిగిలిన మత బృందాల వారికి ఆగమేఘాల మీద పౌరసత్వ ప్రదానం.

వారంతా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌ వంటి చోట్ల వేధింపులకు గురైన మైనార్టీలై ఉంటారన్న వాదన ఇందుకు ఆధారం. నిజంగా వారు ఆ విధమైన వేధింపునకు గురైనారని చెప్పడానికి ఏదైనా ఆధారం చూపించాలా అన్నది బిల్లులో పొందుపర్చలేదు కూడా. మరో వంక పొరుగు దేశాలలో మతపరమైన వేధింపులకు గురై వచ్చిన రోహింగ్యాలు, అహ్మదీయాలు వంటి వారికి అదే విధమైన వెసులుబాటు కూడా కల్పించింది లేదు.
ఎన్‌ఆర్‌సీ, సీఏబీలకు ఎలాంటి సంబంధం లేదని పార్లమెంటులో నిర్ద్వంద్వంగా చెప్పారు. ముస్లిం పౌరులలో నెలకొన్న ఆందోళనను అలాంటి హామీలు తొలగించజాలవు. భారత దేశంలో మైనార్టీలకు సంబంధించిన విస్త్రుత వాతావరణం అలాంటి భరోసా కల్పించేదిగా కనిపించదు. మతపరమైన వేగులు మైనార్టీలపై సాగించే హింసాకాండ, అయినా అందుకు బాధ్యులైన వారు చట్టం ముందు నిక్షేపంగా తప్పించుకోవడం, తలాక్‌ బిల్లు, 370కి తూట్లు పొడవడం ఇవన్నీ కూడా భారత దేశంలో మైనార్టీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాలని రాజ్యం, సమాజం కూడా ఏకాభిప్రాయానికి వచ్చాయనే సంకేతం ఇస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కలసి ఇస్తున్న దృక్పథం స్వాతంత్య్ర సమయంలో పౌరసత్వం పట్ల ఉన్న భావనకు విరుద్ధమైంది. దీనిపై రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగింది. పుట్టుకను బట్టి పౌరసత్వం ఇచ్చే ‘జుస్‌ సోలి’ అనే విధానం చైతన్యవంతమైందనీ ఆధునికమైందనీ నాగరికమైందనీ ఆ సమావేశం భావించింది. అందుకు భిన్నమైన సూత్రం ‘జుస్‌ సాంగినిస్‌’ అంటే జాతిని బట్టి పౌరసత్వం అన్న భావనను తోసిపుచ్చింది. అయితే నేలను బట్టి గాక నెత్తురు బట్టి నిర్ణయం తీసుకునే ధోరణి 1985-2004 మధ్య వచ్చింది. భారత దేశంలోనే పుట్టినా తల్లిదండ్రులలో ఒకరు గనక స్వతహాగా అక్రమ చొరబాటుదారులైతే (అంటే బంగ్లాదేశీ ముస్లింలని భావం) ప్రత్యేక పౌరసత్వం ఇచ్చే పద్ధతిని 2004లో ప్రవేశ పెట్టారు. ఈ ‘జుస్‌ సాంగినిస్‌’ సూత్రానికి సంపూర్ణ బదలాయింపును సీఏబీ, ఎన్‌ఆర్‌సీ ప్రతిబింబిస్తున్నాయి.

రాజ్యాంగ రీత్యా భారతదేశం ఒక రాజకీయ సముదాయం. దాని పౌరులు జాతీయ పౌర గుర్తింపు కలిగివుంటారు. అంతే తప్ప జాతి, ఉపజాతి విభేదాలను బట్టి కాదు. ఎన్‌ఆర్‌సీ, సీఏబీ ఈ పౌర జాతీయత దృక్పథం నుంచి జాతి దేశీయత దృక్పథం వైపు తీసుకుపోతుంది. జాతిని బట్టి పౌరులలో శ్రేణీకరణ లేదా దొంతరలు ఏర్పరుస్తుంది. చివరగా చెప్పాలంటే రాజకీయ దుస్సాహక లక్షణాలు మూట కట్టుకున్న ఈ ప్రక్రియల అమలులో అర్హత తేదీ, వనరుల లోటు వంటివి అమలులో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు మాత్రమే. ఈ దేశంలో సున్నితంగా వున్నా అట్టుడికిపోతున్న బహుళత్వంతో కూడిన సామాజిక చట్రం పైన ఇవి ఎలాంటి అనర్థదాయకమైన ప్రభావం చూపిస్తాయనేది అన్నిటికన్నా తీవ్రమైన అభ్యంతరం. మన చరిత్రలో కనిపించే మానవీయ పౌర లక్షణాలు ఆతిథ్యశీలత వంటివి ఏమవుతాయి? అన్నిటినీ మించి జాతి మతాలకు అతీతంగా మన రాజ్యాంగం హామీ నిచ్చిన సమాన పౌరసత్వం ఏమయ్యేట్టు?

నీరజా గోపాల్‌ జయల్‌
వ్యాసకర్త: జెఎన్‌యు ప్రొఫెసర్‌

RELATED ARTICLES

Latest Updates