నాకు భయంగా ఉంది… కాసేపు మాట్లాడు పాపా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సోదరితో ప్రియాంక చివరి మాటలివే!
(రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

టోల్‌గేటు వద్ద తనను అడ్డగించిన లారీ డ్రైవర్ల వ్యవహారశైలిని గమనించిన ప్రియాంక.. తన ప్రాణాలకున్న ముప్పును ముందే గ్రహించారు. తన చెల్లెలు భవ్యకు ఫోన్‌ చేసి వారి తీరు భయం కలిగిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి 9.22 గంటలకు భవ్యకు ఫోన్‌ చేసిన ప్రియాంక దాదాపు ఆరున్నర నిమిషాలసేపు మాట్లాడారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ముఖ్యాంశాలు..

ప్రియాంక: పోయావా పాపా ఆఫీసుకు? కొంచెం సేపు నాతో మాట్లాడు

భవ్య: ఎందుకు.. ఏమైంది?
ప్రియాంక: మాట్లాడు పాపా తరువాత చెబుతా…
భవ్య: అక్కడ యాక్సిడెంట్‌ అయిందా?
ప్రియాంక: నాకు చాలా టెన్షన్‌గా ఉంది.
భవ్య: యాక్సిడెంట్‌ అయిందా?
ప్రియాంక: లేదు
భవ్య: మరి.. హలో ..ఏమైంది?
ప్రియాంక: అక్కడ ఎప్పుడూ బైక్‌ పెట్టి పోతానని చెప్పాను కదా? అక్కడ పెట్టి నిలబడ్డా.. అయితే టోల్‌ కలెక్ట్‌ చేసే అతను ‘ఇక్కడ బైక్‌ పెట్టవద్దు మేడమ్‌… పోలీసులు తీసుకుపోతున్నార’ని చెప్పాడు. అందుకే బైక్‌ తీసుకువెళ్లి ఔటర్‌ రెండో దారి వద్ద పెట్టాను. ఇపుడు తిరిగి వచ్చాను పాపా ఇక్కడకు.. టైరు పంక్చర్‌ అయ్యింది.
భవ్య: బైక్‌ వదిలేసి రా… ఇంకా ఏమిటీ?
ప్రియాంక: వదిలేస్తే పొద్దున ఎవరు తీసుకువస్తారే ?
భవ్య: ఎవరినైనా తీసుకువెళ్లి పంక్చర్‌ చేయించుకురావాలి. రేపు పొద్దున మెకానిక్‌ను తీసుకువెళ్లు
ప్రియాంక: నాకు భయంగా ఉంది
భవ్య: కొంచెం దూరం వెళ్లి ఉండు
ప్రియాంక: ఇక్కడ ఒక లారీ ఉందే.. అందులో జనాలు ఉన్నారు. ఒకాయన అన్నాడు ‘పంక్చర్‌ వేయిస్తా’ అని బైక్‌ తీసుకువెళ్లాడు.
భవ్య: తీసుకురాలేదా? మళ్లీ
ప్రియాంక: తీసుకువచ్చాడు… క్లోజ్‌ అయింది షాపు అని తిరిగి తీసుకువచ్చాడు. మరో షాపు ఉంది అని ఇప్పుడే మళ్లీ తీసుకువెళ్లాడు.
భవ్య: ఇంకా రాలేదా?
ప్రియాంక: భయంగా ఉందే పాపా ఇక్కడ
భవ్య: ఎవరూ లేరా? అక్కడ
ప్రియాంక: ఎవరంటే.. టోల్‌గేటు దగ్గర వెహికల్స్‌ ఉన్నాయి. వీళ్లేమో నేను వెళతానంటే వద్దని దయ్యాల్లా వెంటబడ్డారు. ‘మేడమ్‌.. మధ్య మధ్యలో బైక్‌ ఆగిపోతూ ఇబ్బంది పడతార’ని అన్నారు. నాకు భయం అవుతుంది పాపా.
భవ్య: ఎందుకు? ఏమవుతుంది? టోల్‌ గేటు వద్దకు వెళ్లు
ప్రియాంక: వాళ్లు బయటే నిలబడ్డారు
భవ్య: ఎవరూ?
ప్రియాంక: లారీస్‌ వాళ్లు
భవ్య: టోల్‌ గేటు ఉంటుంది కదా? అక్కడకు వెళ్లు నిలబడు
ప్రియాంక:మాట్లాడు పాపా నాకు భయం వేస్తుంది
భవ్య: ఏం కాదు టోల్‌ ప్లాజా దగ్గర టిక్కెట్టు ఇస్తారు కదా? అక్కడకు వెళ్లి నిలబడు
ప్రియాంక:వీళ్లేంటే.. సడన్‌గా ఎవరూ కనిపించట్లేదు! దయ్యాల్లా ఉన్నారు. ఆ.. ఆ.. కనిపించారు.. కనిపించారు (అంటూ అసలేం జరిగిందో ప్రియాంక తన సోదరికి వివరించారు).
భవ్య: అంతలేటుగా రావడం అవసరమా?
ప్రియాంక: లేటుగా కాదే తల్లి.. ఏడుపు వస్తుందే
భవ్య: సరే మరి బయలుదేరు
ప్రియాంక: భయం అవుతుంది పాపా . బైక్‌ తీసుకురాలేదు ఆ దయ్యం మొహమోడు. ఛీ అసలు ఇక్కడ నిలబడాలనే లేదు
భవ్య: టోల్‌బూత్‌ వద్దకు వెళ్లు నిలబడు
ప్రియాంక: అక్కడ నిలబడితే అందరూ నన్నే చూస్తారు. వచ్చేటోళ్లు పోయేటోళ్లు
భవ్య: చూడనీ..
ప్రియాంక: కొంచెం సేపు మాట్లాడు పాపా.. బైక్‌ వచ్చే వరకూ..
భవ్య: ఇంకా బైక్‌ వచ్చే వరకు మాట్లాడితే ఇక్కడ (తాను పనిచేస్తున్న ఆఫీసులో) ఏమనుకుంటారు?
ప్రియాంక: అయిదు నిమిషాలు మాట్లాడవా దెయ్యం పిల్ల్లా నువ్వు… రోడ్డు మీద ఒక్కదాన్నే ఉంటే?
భవ్య: రాత్రిపూట పోవడం అవసరమా?
ప్రియాంక: వారిని చూస్తే భయంగా ఉందే. ఈ దయ్యం పిల్లాడు ఇంకా రాలేదు
భవ్య: సరే కొంచెంసేపయిన తరువాత చేస్తాను మళ్లీ
ప్రియాంక: లేదు పాపా .. ( ఏడుస్తూ)
భవ్య: దగ్గర ఉన్న టోలుబూత్‌ వద్దకు వెళ్లు
ప్రియాంక: దయ్యం పిల్లాడు ఇంకా రాలేదు
భవ్య: సరే నేను మరో 5 నిమిషాల తరువాత చేస్తాను

ప్రియాంక: ప్లీజ్‌ పాపా… సరే చేయి …ఓకే

(సోదరి మాట విని.. ప్రియాంక టోల్‌గేట్‌ వద్దకు వెళ్లి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని, ఆమె బతికే ఉండేదని పోలీసులు చెబుతున్నారు)

Courtesy Adnrajyothy…

RELATED ARTICLES

Latest Updates