ఫీజు ‘నో’యింబర్స్‌మెంట్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • రూ.4 వేల కోట్లు సకాలంలో చెల్లించని సర్కారు
  • మంజూరు ఘనం.. నిధుల విడుదల నామమాత్రం
  • 14 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు
  • రీయింబర్స్‌ కాక., సర్టిఫికెట్లు రాక తీవ్ర ఇబ్బంది
  • కాలేజీలు నడపలేమంటున్న యాజమాన్యాలు
  • ఈ ఏడాది 10ు పెరగనున్న విద్యార్థుల సంఖ్య
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 2018-19 ఆర్థిక సంవత్సరం వివరాలు
  • శాఖ విద్యార్థులు ఆర్టీఎఫ్‌ ఎంటీఎఫ్‌ మంజూరైన
  • 4వేల కోట్లు సకాలంలో చెల్లించని సర్కారు.. మంజూరు ఘనం.. నిధుల విడుదల నామమాత్రం

వద్దన్నవారికి అనుచిత వరాలు ఇస్తున్న సర్కారు.. విద్యార్థుల ఫీజుల చెల్లింపుల విషయంలో మాత్రం అలసత్వం చూపుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలకు మంజూరు ఘనంగా చేస్తున్నా.. విడుదల చేస్తున్న నిధులు నామమాత్రంగా ఉంటున్నాయి. ఫలితంగా గత రెండేళ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాల బకాయిలు రూ.4 వేల కోట్లకు చేరాయి. ఇందులో కిందటి ఏడాది బకాయిలు రూ.1600 కోట్లు కాగా.. ఈ విద్యా సంవత్సరానివి రూ.2400 కోట్లు.

బకాయిల చెల్లింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నాటి సర్కారు ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్‌ సర్కారు దీన్ని కొనసాగిస్తోంది. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రూ.35 వేలు, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు రూ.27 వేల చొప్పున ఫీజురీయింబర్స్‌ చేస్తోంది. ఈ చెల్లింపులు సకాలంలో జరగట్లేదు. ఒక విద్యా సంవత్సరంలో చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించకపోవడంతో మరుసటి ఏడాది అవి పెండింగ్‌ పడుతున్నాయి.

ఫలితంగా చాలా కాలేజీలు.. విద్య పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపేస్తున్నాయి. విద్యార్థులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. కొన్ని కళాశాలలైతే.. అలా విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయడంతో సరిపెట్టట్లేదు. ఆ తర్వాత సర్కారు నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా క్లెయిమ్‌ చేసుకుంటున్నాయి.

పెరుగుతున్న నమోదు..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 2018-19 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 13.59 లక్షల మంది నమోదు అయ్యారు. అందుకుగాను సర్కారు రూ.2489 కోట్లు మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటిదాకా 5 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియింబర్స్‌మెంట్‌ కింద పేరు నమోదో చేసుకోగా.. సర్కారు రూ.660 కోట్లు మంజూరు చేసింది. ఇంకా ఈ పథకం కింద విద్యార్థులు నమోదు చేసుకుంటూనే ఉన్నారు. ఫలితంగా చెల్లింపులు గత ఏడాది కంటే 10 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా. కిందటి సంవత్సరం, ఈ ఏడాది కలిపి ఇప్పటి దాకా ఈ పథకం కింద సర్కారు రూ.3149 కోట్లు మంజూరైతే చేసిందిగానీ.. బడ్జెట్‌ రిలీజ్‌ మాత్రం నామమాత్రంగా చేసిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి.

గొర్రెలు, బర్రెలకు కాదు..

చదువుకు డబ్బులివ్వండి
విద్యార్థులకు ఉపకారవేతనాలివ్వక సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గొర్రెలు, బర్రెల కొనుగోలుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారు చదువుకు మాత్రం డబ్బుల్లేవనడం విచారకరం. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో సర్కారు పూర్తి వివక్ష చూపుతోంది.
ఆర్‌.కృష్ణయ్య అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం

కాలేజీలు నడపలేకపోతున్నాం
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో రావట్లేదు. 2018-19 ఫ్రెషర్స్‌కు సంబంధించిన బకాయిలు కూడా రాలేదు. కాలేజీల నిర్వహణ భారంగా మారింది. సిబ్బందికి జీతాలివ్వలేకపోతున్నాం. అప్పులు తెచ్చి కళాశాలలను నడుపుతున్నాం. వెంటనే బకాయిలు విడుదల చేయాలి.
సతీష్‌, ప్రైవేటు ఇంటర్‌

 

కాలేజీ యాజమాన్యాల అధ్యక్షుడు

సర్టిఫికెట్లు ఇవ్వలేదు
ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశా. సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజు చెల్లించాలని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాలేదంటోంది. ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు. గవర్నమెంట్‌ ఇచ్చే దాకా నా సర్టిఫికెట్లు తీసుకునే పరిస్థితి లేదు. నాలా చాలా మందిదీ ఇదే సిట్యూవేషన్‌. ఏం చేయాలో తెలియడం లేదు.
శివ, ఇంజనీరింగ్‌ విద్యార్థి హైదరాబాద్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 2018-19 ఆర్థిక సంవత్సరం వివరాలు
శాఖ విద్యా
ర్థులు ఆర్టీఎఫ్‌ ఎంటీఎఫ్‌ మంజూరైన

మొత్తం
ఎస్సీ అభివృద్ధి శాఖ 2,27,745 338.94 117.74 546.68
ఎస్టీ సంక్షేమ శాఖ 13,8783 158.2 73.32 2,3152
బీసీ సంక్షేమ శాఖ 76,0841 781.06 427.3 1,208.36
దివ్యాంగుల శాఖ 101 0.1 0.04 0.14
ఈబీసీ 83,823 274.5 0 2,74.5
మైనారిటీ 14,7761 236.4 82.26 318.66
మొత్తం 13,59,054 1789.2 700.66 2,489.86

2019-20 గణాంకాలు
శాఖ ఎన్‌రోల్‌ ఆర్టీఎఫ్‌ ఎంటీఎఫ్‌ మంజూరైన
విద్యార్థులు మొత్తం
ఎస్సీ అభివృద్ధి శాఖ 92,732 113.82 36.88 150.7
ఎస్టీ సంక్షేమ శాఖ 52,122 41.12 20.07 61.19
బీసీ సంక్షేమ శాఖ 2,69,086 199.29 102.46 301.75
దివ్యాంగుల శాఖ 47 0.13 0 0.13
ఈబీసీ 25,580 70.56 0 70.56
మైనారిటీ 60,242 56.06 19.91 75.97
మొత్తం ఇప్పటిదాకా 499809 480.98 179.32 660.3

Courtesy AndhraJyothy…

RELATED ARTICLES

Latest Updates