జార్ఖండ్ లో పదివేల మంది గిరిజనులపై దేశద్రోహం కేసులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for adivasis sedition cases"భారతదేశంలో ప్రజాస్వామిక రాజ్యాంగ బద్ధమైన పాలన జరుగుతున్నదా అన్న అనుమానం వస్తున్నది. పదివేల మంది గిరిజనులపై దేశద్రోహం కేసులు? ఆందోళనగాను ఆశ్చర్యంగానూ అనిపిస్తున్నది. భారత రాజ్యాంగం అమలు కాకుండా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్న  అనుమానం వస్తున్నది. జార్ఖండ్ రాజధాని సమీపంలోని కుంటి జిల్లాలో వేలమంది ఆదివాసీలపై ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో బహిష్కరిస్తున్నట్లు ఆ ప్రాంత వాసులు హెచ్చరించటమే ఇందుకు కారణం. రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన గ్రామాల్లో గ్రామ కమిటీలదే అధికారమని ఆ కమిటీ పెద్దలు చెప్పిందే మాకు రాజ్యాంగం అంటూ ఆదివాసీలు శిలా శాసనాలు పాతారు. స్వయంపాలన ప్రయత్నాలు చేయటం తప్పయింది? ఎన్నికల బహిష్కరణ ఉద్యమానికి గిరిజనులు పత్తర్ గడి అని పేరు పెట్టారు. అంటే రాళ్లు పాతే ఉద్యమం అన్నమాట. ఆంగ్ల వెబ్సైట్ స్క్రోల్ మోడీ పాలనలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తున్న తీరుతెన్నులపై ప్రత్యేక కథనాల్ని ప్రారంభించింది. అందులో భాగంగా గిరిజనులపై ద్రోహం కేసు విశేష కథనాన్ని సుప్రియ శర్మ రాశారు.

RELATED ARTICLES

Latest Updates