ప్రొఫెసర్లే నా చావుకు కారణం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • ఐఐటీ మద్రాస్‌ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్స్‌లో ముగ్గురి పేర్లు

చెన్నై: ఆమె ప్రతిభాశాలి..! ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో చదువుకుంటోంది!! ఉన్నట్టుండి ఒకరోజు ఆత్మహత్య చేసుకుంది. చదువుల ఒత్తిడి.. పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో ఆత్మహత్య చేసుకుందని చెప్తూ కేసు మూసేసే ప్రయత్నం పోలీసులు చేశారు. కానీ.. తన చావుకు ముగ్గురు ప్రొఫెసర్లు కారణమంటూ వారి పేర్లు రాసిన నోట్‌ ఆమె సెల్‌ఫోన్‌లో కనిపించడంతో కేసు మలుపు తిరిగింది!!

తమిళనాట సంచలనం సృష్టిస్తున్న ఐఐటీ-చెన్నై విద్యార్థిని ఫాతిమా ఆత్మహత్య కేసు వివరాలివి. కేరళలోని కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్‌(19) ఐఐటీ మద్రా్‌సలో ఎమ్మే మొదటి సంవత్సరం విద్యార్థిని. ఈ నెల 9న ఆమె తన హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చదువు ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుందంటూ మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఫాతిమా సోదరి ఆయేషా ఆమె ఫోన్‌ను పరిశీలించగా.. ‘నా చావుకు కారణం సుదర్శన్‌ పద్మనాభన్‌’ అనే నోట్‌ కనిపించింది. మరో నోట్‌లో ఆమె.. తన చావుకు పూర్తి కారణం తన ప్రొఫెసర్లయిన హేమచంద్రన్‌ కరాహ్‌, మిస్టర్‌ మిలింద్‌ బ్రాహ్మే అని స్పష్టం చేసింది. ఈ నోట్‌ను ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు అందజేశారు. ఈ మేరకు చెన్నై పోలీసు కమిషనర్‌ రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు.

తన సూసైడ్‌ నోట్స్‌లో ఆమె పేర్కొన్న సుదర్శన్‌ పద్మనాభన్‌ ఐఐటీమద్రాసులోని హ్యూమానిటీస్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. ఇక, మిలింద్‌ బ్రాహ్మే.. ‘ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌’ బోధిస్తున్నారు. అలాగే ఐఐటీమద్రాసుకు సంబంధించి అంబేడ్కర్‌ పెరియార్‌ స్టడీ సర్కిల్‌ అకడమిక్‌ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఫాతిమా కేసులో సుదర్శన్‌ పద్మనాభన్‌ పేరు వచ్చినప్పుడు ఇస్లామోఫోబియానే ఆమెను బలితీసుకుందని.. పద్మనాభన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసిన అంబేడ్కర్‌ పెరియార్‌ స్టడీ సర్కిల్‌.. తమ సలహాదారైన మిలింద్‌ బ్రాహ్మే విషయంలో మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం. కాగా.. ఐఐటీ మద్రా్‌సలో ఏడాది వ్యవధిలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Courtesy Andhrajyothy..

RELATED ARTICLES

Latest Updates