కేసులు నాటకం.. బూటకం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఎన్నికల సంఘం తీరు అనుమానాస్పదం
  • ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కీలక అధ్యయనండబ్బు,
  • మద్యం పంపిణీ కేసులన్నీ తుస్సు
  • 3800 మద్యం పంపిణీ కేసుల కొట్టివేతడబ్బుతో దొరికింది 640.
  • . కేసులు 159ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి పైనా కేసు పెట్టలేదుభారీ కేసులు
  • ఐటీ శాఖకు అప్పగించలేదుహవాలా సొమ్మని తేలినా
  • ఈడీకివ్వలేదు2018 అసెంబ్లీ ఎన్నికలపై పరిశీలన

శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ అభిప్రాయపడింది. ఎన్నికల ముందు హడావుడి చేయడం తప్ప ఎలాంటి కేసులు నమోదు చేయక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడింది. భారీగా నగదు, మద్యం పట్టుకున్న సంఘటనల్లోనూ బాధ్యులపై కేసులు నమోదు చేయలేదని ప్రస్తావించింది. ఈ మేరకు 2018 నాటి ఎన్నికల కేసులను పూర్తిగా అధ్యయనం చేసి, నివేదికను సమర్పించింది. ప్రతీ నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారుల నియామకం.. వీరిలో ఒకరిని ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా, ఇంకొకరిని ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిశీలకుడిగా, మరొకరిని డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా నియమించారు. ఈ సీనియర్‌ సివిల్‌ సర్వెంట్లకు సహకారం అందించేందుకు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఉల్లంఘనలపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబర్లు, మొబైల్‌ యాప్‌లు, ఉల్లంఘనల ఆధారాలకు వీడియో చిత్రీకరణ.. ఇది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం చేసిన హడావిడి. ఇంతచేసీ సాధించింది ఏమిటీ? అన్న ప్రశ్నకు కొండను తవ్వి ఎలుకనూ పట్టలేక పోయిందన్న సమాధానం వస్తోంది.
అంతా హంగామానే
సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరు-2018లో జరిగాయి. నాలుగు రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికల పరిశీలకులుగా ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్‌ అధికారులను రంగంలోకి దించారు. డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీపై డేగ కళ్లతో నిఘా ఉంచారు. రోజు భారీగా నగదు, మద్యం పట్టివేత అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో రజత్‌ కుమార్‌ చేసిన ప్రకటనలు, సమావేశాలు, హంగామా అంతా ఇంతా కాదు. ఇంతచేసి ఎన్నికల సంఘం సాధించిందేమిటో తెలుసా? ఒక్క కేసు కూడా నమోదు చేయలేక పోవడం. డిసెంబరు-2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ, జిల్లా అధికారులు నమోదు చేసిన కేసుల వివరాలను పరిశీలిస్తే.. నిబంధనల అమలు పేరుతో ఎన్నికల సంఘం చేసిందంతా ఓ నాటకమన్న భావన కలుగుతోంది.

కేసులు పాతిక శాతం కూడా లేవు
గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి సారించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 640 చోట్ల మొత్తం రూ.84.36 కోట్లు పట్టుకున్నారు. వీటి వెనుక దాదాపు వెయ్యి మందికి పైగా ప్రమేయం ఉందని తేల్చారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు పట్టుబడటం తమ అద్భుత పనితీరుకు, పటిష్ఠ నిఘాకు నిదర్శనమని సీఈవో రజత్‌ కుమార్‌ పలుమార్లు గొప్పగా ప్రకటించారు. కానీ ఇంత నగదు పట్టుబడినా, ఇంత మందిని గుర్తించినా ఎన్నికల సంఘం నమోదు చేసిన కేసులు కేవలం 159 మాత్రమే. మొత్తం కేసుల్లో ఇది 24 శాతం మాత్రమే. అలాగే పట్టుబడిన మొత్తం రూ.84.36 కోట్ల నగదులో రూ.28.27 కోట్లకే(33 శాతం) కేసులు నమోదు చేశారు. మిగిలిన రూ.56.09 కోట్లు సంబంధిత వ్యక్తులకు తిరిగి వాపసు చేశారు. అలాగే, మద్యం పంపిణీ, తరలింపునకు సంబంధించి మొత్తం 3,800 మందిని గుర్తించగా.. ఒక్కరిపైనా కేసు నమోదు చేయలేదు. అందరూ నిర్దోషులేనని ప్రకటించి వదిలిపెట్టారు. ఇంతమందిని గుర్తించి, భారీ నగదును స్వాధీనం చేసుకుని అందరిపై కేసులు నమోదు చేయలేదంటే.. కావాలనే నీరు గార్చారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఐటీ లేదు.. ఈడీ లేదు..
రూ.50 వేలకు పైగా నగదు తరలిస్తే ఆధారాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. విఫలమైతే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించాలని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. అనేకచోట్ల లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నా.. ఐటీ శాఖకు అప్పగించలేదు. హవాలా మార్గం ద్వారా వచ్చిన సొమ్మును ఎక్కువగా వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నప్పుడల్లా ఎన్నికల సంఘం ఈ దిశగానే అనుమానాలు వ్యక్తం చేసింది. ఇలాంటి అనుమానాలుంటే కేసును ఈడీకి అప్పగించాల్సి ఉంది. రాష్ట్రంలో అనేకచోట్ల హవాలా సొమ్ము అని తేలినా.. ఒక్క కేసు కూడా ఈడీకి అప్పగించలేదు.
పెద్దలను వదిలి.. చిన్నా చితకా కేసుల్లోనే అరెస్టులు..
ఎన్నికల సంఘం తీరు ఎంత హాస్యాస్పదంగా ఉందో నమోదైన కేసులను పరిశీలిస్తే తెలిసిపోతుంది. లక్షలు, కోట్ల రూపాయల నగదు దొరికినా బాధ్యులపై కేసులు నమోదు చేయకపోగా, వేలల్లో దొరికిన వారిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని ఉదాహరణలు..
ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రూ.81 లక్షలు నగదు పట్టినా కేసు నమోదు చేయలేదు. నిందితులను వదిలివేశారు.
సంగారెడ్డి జిల్లా చిరాగ్‌పల్లి స్టేషన్‌ పరిధిలో రూ.50 లక్షలు పట్టుకుని ఎలాంటి విచారణ జరపలేదు. డబ్బు తిరిగి ఇచ్చేశారు.నల్లగొండ జిల్లా వడ్డేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 24 లక్షలు పట్టుకుని చర్యలు తీసుకోకుండానే డబ్బు వాపసు ఇచ్చేశారు.గద్వాల్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిఽధిలో రూ.500 కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై కేసు (201/18) నమోదు చేశారు.భద్రాద్రి జిల్లా దమ్మపేట పీఎస్‌ పరిధిలో ముగ్గురు వ్యక్తుల నుంచి 1650 పట్టుకుని వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.ఎమ్మెల్యేలందరికీ క్లీన్‌ చిట్‌…అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీలో వెయ్యికి పైగా మంది పాల్గొన్నారంటూ అధికారులు అప్పుడే చెప్పారు. వీరందరినీ పోలీసులు విచారించగా.. తమకు ఏ సంబంధం లేదని, ఎమ్మెల్యే ఆదేశాలను అమలు చేశామని అత్యధికులు చెప్పారు. ఈ సందర్భంలో ఏ-1, ఏ-2లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల పేర్లు నమోదు చేయాలని ఈసీ నిబంధనలు పేర్కొంటున్నాయి. కానీ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిపైనా కేసు పెట్టకపోవడం గమనార్హం.

ఎన్నికల సంఘంపై అనేక అనుమానాలు.. ఎం.పద్మనాభ రెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నన్స్‌
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నమోదు చేసిన అన్ని కేసులను తాము అధ్యయనం చేశామని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నన్స్‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తెలిపారు. ఫోరం అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రెడ్డప్పరెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రావ్‌ చెలికానితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం హడావుడి చేయడం తప్ప ఎలాంటి కేసులు నమోదు చేయక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. భారీగా నగదు, మద్యం పట్టుకున్న సంఘటనల్లోనూ బాధ్యులపై కేసులు నమోదు చేయలేదని చెప్పారు. ఎన్నికల నాటి కేసులపై ప్రతి 6 నెలలకు ఓసారి సమీక్ష నిర్వహించాలని ఆయన కోరారు.
                                                                                               Courtesy Andhrajyothy..

RELATED ARTICLES

Latest Updates