పెద్దనోట్ల రద్దు ఏం సాధించింది?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నల్లధనంపై వ్యతిరేక పోరాటం వ్యాపారవర్గాలపై పోరాటంగా మారిందన్న వాదనను ఇటీవల ఆర్‌బీఐ ఖండించింది. ఈ నేపథ్యంలోంచే గత మూడునెలల కాలంలో కేంద్రం కార్పొరేట్‌ వర్గాలకు పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించింది. అయినా ఆశించిన మేర పరిశ్రమల స్థాపనలో,వృద్ధిరేటులో గణాంకాలు సానుకూలంగా ఉండటం లేదు. వాస్తవానికి నల్లడబ్బు అనేది పేదవర్గాల పాలిట శాపం.

నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడేండ్ల కిందట 2016 నవంబర్‌ 8న అర్ధరాత్రి అకస్మాత్తుగా పెద్దనోట్లను రద్దుచేసింది. ప్రభుత్వాలు చెబుతున్నట్లుగా లక్షితదాడి లాంటి ఈ పెద్దనోట్ల రద్దుతో దేశం యావత్తూ తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నది. నెలల తరబడి దేశమంతా గందరగోళ పరిస్థితిలో కూరుకుపోయిం ది. కానీ ఈ మధ్య థాయిలాండ్‌ పర్యటనలో ఉన్న మోదీ పెద్దనోట్ల రద్దు తో దేశంలో అవినీతి అంతమైపోయిందనీ, నల్లధనం కోరలు విరిచామ ని చెప్పుకొచ్చారు. దేశంలో పాతుకుపోయిన అవినీతి, క్రోనిజమే దేశాభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారాయని సెలవిచ్చారు. ఈ ఐదేండ్ల కాలం లో విజయవంతంగా అవినీతిని అదుపుచేశామని, పెద్దనోట్ల రద్దుతోనే ఇది సాధించామని ప్రకటించారు.

2014 ఎన్నికల ప్రచారంలో విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి తిరిగి తీసుకొస్తామని ప్రకటిస్తూ.., ఆ నల్లధనాన్ని తెస్తే దేశంలో ని ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని సెలవిచ్చా రు. దీన్ని దేశప్రజల్లో మెజారిటీ నమ్మారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి న జన్‌ధన్‌యోజన పథకంలో భాగంగా ప్రతి ఒక్కరూ జీరో బ్యాలెన్స్‌తో బ్యాంక్‌ ఖాతాలను తెరిచారు. కానీ కాలం గడిచిపోయింది. నెలలు, ఏం డ్లు గడిచిపోయాయి. ప్రజలు తెరిచిన బ్యాంకు ఖాతాలు ఖాళీగానే మిగిలిపోయాయి. నల్లధనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక కసరత్తులు చేసింది. మొదట 2014లో నల్లధనంపై ‘సిట్‌’ను ఏర్పాటు చేసిం ది. ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తుందని తెలిపింది. ఆ తర్వాత నల్లధనానికి చెక్‌ పెట్టేందుకు ఫారెన్‌ మనీ బిల్‌, ఇన్‌కమ్‌ డిక్లరేషన్‌ స్కీమ్‌ లాంటివాటిని ప్రకటించింది. కానీ ఆశించిన ఫలితాలేవీ రాలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీలన్నీ నల్లధనం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విషయాలపై ఎన్నికల సమయంలో తీవ్ర విమర్శలు చేశాయి. పెద్దనోట్ల రద్దు ప్రక్రియ ఆశించిన ఫలితాల ఇవ్వలేదన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం అవినీతికి చెక్‌ పెట్టేందు కోసమని ‘డిజిటైజేషన్‌’ను ప్రకటించింది. నల్లడబ్బుకు సంబంధించి ఉన్న మరో దురభిప్రాయం ఏమంటే.. సంప్రదాయేతర మార్గాల్లోనే నల్లడబ్బు పోగైతున్నదనే భావన. పన్నులు కట్టకుండా తప్పించుకొని దాన్నే నల్లడబ్బుగా వెనకేసుకుంటున్నారని అంటారు. నిజానికి దేశంలో సంప్రదాయ వ్యాపారాల్లో వ్యవస్థీకృత రం గాల్లోనే నల్లడబ్బు పోగుపడుతున్నది.

పెద్దనోట్ల రద్దులాంటి చర్యలతో పెద్ద మార్పులొస్తాయని ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ భావించారు. నల్లధనాన్ని కట్టడి చేసేందుకు పెద్దనోట్ల రద్దు ఒక బ్రహ్మాస్త్రమని మోదీ చెప్పి విమర్శకుల నోళ్లు మూయించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే ముందు మోదీ తన ప్రభుత్వంలోని క్యాబినెట్‌ మంత్రులకు కూడా తెలియకుండా అంతా రహస్యంగా పని కానిచ్చారు. నోట్లరద్దు ప్రక్రియపై కేంద్ర ప్రభు త్వం నుంచి మంత్రులు కానీ, పార్లమెంట్‌లో కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అకస్మాత్తుగా వచ్చిన ఉపద్రవం లాంటి పెద్దనోట్ల రద్దుతో రిజర్వ్‌బ్యాంక్‌, దేశంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థ అంతా గందరళగోళ పరిస్థితిలో పడ్డాయి. నోట్లరద్దు కారణంగా జనమంతా బ్యాంకుల ముందు బారులు తీరారు. ఒకరకంగా ఆర్థికవ్యవస్థ అంతా అస్తవ్యస్థమై పోయింది.

నల్లడబ్బు నడ్డి విరుస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం నోట్లరద్దుతో ప్రజలపై పెనుభారాన్ని మోపింది. పెద్దనోట్ల రద్దు ద్వారా జరిగిందేమంటే జనంలో చెలామణిలో ఉన్న నోట్లన్నీ చెల్లకుండా అయిపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో నల్లడబ్బు అంతా రద్దయిపోతుందనుకున్నారు. కానీ మోదీ చేసిన ఈ చర్య కారణంగా ఒక శాతం నల్లడబ్బు మాత్రమే వెలుగులోకి వచ్చిందని తేలింది. పెద్దనోట్ల రద్దు చర్య నల్లడబ్బు పోగుపడటాన్ని ఆపలేకపోయింది. ఎవరైనా కొంత పెట్టుబడి పెట్టి దానితో జమకూడిన ధనా న్ని లెక్కచూపకపోవటమే నల్లడబ్బుగా పరిగణిస్తారు. విదేశాల్లో పోగుపడిన నల్లడబ్బుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న దానిపై కూడా భిన్నవాదనలున్నాయి. విదేశాల్లోని నల్లడబ్బుపై పెద్దనోట్ల రద్దు ప్రభావం ఉంటే, రూపాయి మారక విలువ పడిపోవటాన్ని ఎలా నిలువరిస్తుందో చెప్పలేకపోయారు. నిజానికి విదేశాల్లోని నల్లడబ్బు రూపాయి రూపంలో ఉండదు. అదంతా విదేశీ కరెన్సీగా ఉంటుంది. చాలా దేశాల్లో ఆ ధనాన్ని మన రూపాయిగా మార్చుకోలేం. భారతీయ రూపాయి చాలా దేశాల్లో చెల్లదు, కొన్ని దక్షిణాసియా దేశాల్లో మాత్రమే చెల్లుతుంది. ఒకవేళ నల్ల డబ్బు అనేది ఎక్కువగా విదేశాల్లోనే పోగుబడి ఉన్నదంటే, దేశంలోని పెద్దనోట్ల రద్దుతో పెద్దగా ప్రయోజనం, ప్రభావం ఏమీ ఉండదు.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా కోట్ల మంది పేదలే ఎక్కువ కష్టాల పాలయ్యారు. ప్రజాస్వామ్యం బలహీనపడటం మూలంగా కూడా పేదలే ఎక్కువ ప్రభావితమై కష్టాలను ఎదుర్కొంటారు. నల్లడబ్బును అరికట్టాలంటే దగ్గరి దారంటూ ఏమీ లేదు. పెద్దనోట్ల రద్దు అనేదే నల్లడబ్బును పూర్తిగా నాశనం చేస్తుందని అనుకోవటం అనాలోచితమవుతుంది. దీనికి కావాల్సింది ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా, ముఖ్యంగా రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలి.

నల్లధనాన్ని కట్టడి చేయాలంటే దేశంలో పెద్దనోట్ల రద్దు అనేది ఉపయోగపడే చర్య కాబోదు. నల్లధనం అంతా పెద్దనోట్ల రూపంలోనే ఉన్నదని చెబుతూ దేశంలో చెలామణిలో ఉన్న వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను రద్దుచేశారు. దీంతో చెలామణిలో ఉన్న 86 శాతం ధనం ఉన్నఫలంగా రద్దయిపోయింది. మొత్తంగా దేశంలో ఉన్న 17.9లక్షల కోట్ల ధనంలో 15.44 లక్షల కోట్లు రద్దయ్యాయి. 2017 జనవరి 10న రిజర్వ్‌ బ్యాంక్‌ చెప్పినదాన్ని బట్టి దేశంలో చెలామణిలో ఉన్న 99 శాతం పెద్దనోట్లు తిరిగి రిజర్వ్‌బ్యాంక్‌కు వచ్చాయి. దీన్నిబట్టి పెద్దనోట్ల రూపం లో నల్లడబ్బుగా దాచుకున్న డబ్బునంతా తెల్లడబ్బుగా మార్చుకున్నారు. పెద్దనోట్లన్నీ బ్యాంకులకు తిరిగివచ్చాయంటే నల్లడబ్బు మిగిలి లేదనే అర్థం. దీన్నిబట్టి ఒక శాతం నల్లడబ్బు కూడా రూపుమాపబడలేదు. ఇంతకన్న ముఖ్యంగా నల్లడబ్బు పోగుపడే మార్గాలను ఈ చర్య ఏమీ కట్టడి చేయలేకపోయింది. అవినీతిని, అక్రమాలను ఆపలేకపోయింది. ఒక మిత్రుడు ఢిల్లీ సమీపంలోని గుర్‌గాంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఐదు వేల రూపాయల లంచం ఇచ్చాడు. ముంబాయిలో ఒకతనికి బహిరంగ ప్రదేశంలో పొగ తాగినందుకు ఆయనకు 30 వేల జరిమానా విధించా రు. చివరికి 9 వేలకు ఒప్పందం కుదుర్చుకుని అతను బయటపడ్డాడు. ఇవి మాత్రమే అరుదైన ఘటనలు కావు. బ్యాంకుల కుంభకోణాలు దేశం లో లెక్కకు మిక్కిలి వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద బ్యాంకు కుంభకోణాలు రాజకీయ పెద్దల అండదండలు లేకుండా జరుగవు. భారతదేశంలో అవినీతి డబ్బు హఫ్తా పేర పైనుంచి కిందిదాకా చేతులు మారుతూనే ఉన్నది. అధికార రాజకీయ నేతలు నిఘావ్యవస్థలపై తమ పాలనాధికారం మూలంగా సాధారణంగా అవినీతి నుంచి రక్ష ణ దొరుకుతుందని విశ్వసిస్తూ అవినీతికి ఒడిగడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నదేమంటే.., అధికారం నుంచి దూరమై న వెంటనే అవినీతి అక్రమాల కేసులో పట్టుబడుతున్నారు.

ఇటీవలికాలంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోంచి చూసినప్పుడు ప్రతిపక్షపార్టీల్లోని ఉన్నత నేతలు లక్ష్యంగా దాడులు, అరెస్టులు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. కానీ దీన్ని కేవలం రాజకీయ కక్షసాధింపుగా చూడలేం. కానీ అవినీతి అక్రమాల కేసులో దాడులకు గురవుతున్న వారు అధికార పార్టీలో చేరిపోగానే ఆ దాడులు, విచారణలు నిలిచిపోతున్నాయి. విచారణ సంస్థలన్నీ మూగబోతున్నాయి. అలాంటప్పుడు అధికార పార్టీలోని అవినీతి నేతల మాటేమిటి? గో రక్షకుల పేర జరుగుతున్న దాడుల్లో నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు. మూక దాడులకు పాల్పడినవారిలో ఎంతమందిని పట్టుకొని శిక్షించారు. నల్లడ బ్బు కు వ్యతిరేకంగా చేస్తామన్న పోరాటం ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేక పోరాటంగా మారిపోకూడదు. విమర్శ, వ్యతిరేకత లేకుండా చేసుకోవ టం కోసం అవినీతి దాడుల పేరిట వేధింపులుగా ఉండకూడదు. ఇలాం టి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. నిజానికి ఈ విధానాలే నల్లడబ్బు కన్నా ఎక్కువ ప్రమాదం.

నల్లడబ్బు పోగు కావటాన్ని నిరోధించలేకపోవటం, పన్నులు సక్రమ వసూళ్లు చేయలేకపోవటమే నల్లడబ్బుకు అసలు కారణం. అని చెప్పి వ్యాపారవర్గాలను పన్నుల కోసం వేధించి ట్యాక్స్‌ టెర్రరిజానికి పాల్పడకూడదు. ఈ మధ్యనే జర్మనీ దేశానికి చెందిన ఓ కంపెనీ సీఈఓ దేశం లో ట్యాక్స్‌ టెర్రరిజం కారణంగా పరిశ్రమల స్థాపన సజావుగా లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఎంజెలా మార్కెల్‌ కూడా దేశ పర్యటనలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

నల్లధనంపై వ్యతిరేక పోరాటం వ్యాపారవర్గాలపై పోరాటంగా మారిందన్న వాదనను ఇటీవల ఆర్‌బీఐ ఖండించింది. ఈ నేపథ్యంలోంచే గత మూడునెలల కాలంలో కేంద్రం కార్పొరేట్‌ వర్గాలకు పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించింది. అయినా ఆశించిన మేర పరిశ్రమల స్థాపనలో, వృద్ధిరేటులో గణాంకాలు సానుకూలంగా ఉండటం లేదు. వాస్తవానికి నల్లడబ్బు అనేది పేదవర్గాల పాలిట శాపం. నల్లడబ్బు కారణంగా పేదలే ఎక్కువ కష్టనష్టాల పాలవుతారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా కోట్ల మంది పేదలే ఎక్కువ కష్టాల పాలయ్యారు. ప్రజాస్వామ్యం బలహీనపడటం మూలంగా కూడా పేదలే ఎక్కువ ప్రభావితమై కష్టాల ను ఎదుర్కొంటారు. నల్లడబ్బును అరికట్టాలంటే దగ్గరి దారంటూ ఏమీ లేదు. పెద్దనోట్ల రద్దు అనేదే నల్లడబ్బును పూర్తిగా నాశనం చేస్తుందని అనుకోవటం అనాలోచితమవుతుంది. దీనికి కావాల్సింది ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా, ముఖ్యంగా రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలి. సామాజిక, ఆర్థిక ఉద్యమాల ద్వారా ప్రజల్లో చైత న్యం తేవాలి. తద్వారా మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ పాలకుల్లో జవాబుదారీతనాన్ని పాదుకొల్పుతారు.

(వ్యాసకర్త: ప్రొఫెసర్‌, ‘డిమానిటైజేషన్‌ అండ్‌ ది బ్లాక్‌ ఎకానమీ ఇన్‌ ఇండియాపుస్తక రచయిత)

RELATED ARTICLES

Latest Updates