కోట్లు కూడబెట్టిన ‘ప్లానింగ్‌’

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • విజయవాడ టీపీవోకు 100 కోట్ల ఆస్తులు
  • 3 రాష్ర్టాల్లో 6 ఏసీబీ బృందాల సోదా
  • ఇంకా కొనసాగుతున్న లెక్కింపు
  • బినామీలుగా బామ్మర్దులు
  • పరిచయస్తురాలి ఇంట్లో 16 లక్షలు
  • తిరుపతిలో ఇద్దరు అధికారుల ఇళ్లలోనూ నగలు, నగదు సీజ్‌
  • మరో ఏఎస్‌ఐ ఆస్తులు 20 కోట్లు

విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ అధికారి(టీపీవో) బాలగౌని మురళీగౌడ్‌ సుమారు రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. మూడు రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన ఆస్తులపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నంద్యాల, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడల్లో మొత్తం ఆరు బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నంద్యాలలో 8 ఎకరాల పొలం, హైదరాబాద్‌, నంద్యాలల్లో మూడంతస్తుల భవనాలు రెండు, నంద్యాల, తిరుపతిల్లో మూడు ప్లాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయన బ్యాంకు ఖాతాలో రూ.20 లక్షలు ఉండగా, ఆయనకు బాగా పరిచయమున్న ఓ మహిళ(తిరుపతి) ఇంట్లో రూ.16లక్షలు, మురళీగౌడ్‌ బామ్మరిది ఇంట్లో మరో రూ.16లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోనూ భారీగా ఆస్తులు కూడబెట్టి బామ్మరుదుల పేరున పెట్టినట్టు గుర్తించారు.

ఇంకా ఆయన భార్య పేరున ఉన్న బ్యాంక్‌ ఖాతాలు, బంగారు ఆభరణాలను లెక్కించాల్సి ఉందని డీఎస్పీ సాంతో చెప్పారు. అన్నీ కలిపి వంద కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేశారు. విజయవాడ రావడానికి ముందు మురళీగౌడ్‌ నంద్యాల, తిరుపతిల్లో పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. నంద్యాలకు చెందిన మురళీగౌడ్‌ పురపాలక శాఖలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత అంచెలంచెలుగా పదోన్నతులు పొంది, తిరుపతిలో అసిస్టెంట్‌ సిటీప్లానర్‌గా పనిచేశారు. ఆ సమయంలో విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2014లో ఆయన విజయవాడలోని సీఆర్డీఏకు డిప్యూటేషన్‌పై వచ్చారు. వారం క్రితం విజయవాడ నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. నాటి ఫిర్యాదులతో ఈ సోదాలు జరిగాయి. ఏసీబీ నెల్లూరు డీఎస్పీ, తిరుపతి ఇన్‌చార్జి సాంతో ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం విజయవాడ పటమటలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది.

తిరుపతి ద్వారకానగర్‌లోని టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ శారద ఇంట్లో రూ.14 లక్షలను ఏసీబీ అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు. అలాగే తిరుపతి రూరల్‌ పేరూరులోని బిల్లు కలెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి ఇంట్లో 12 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు లభించింది. మురళీగౌడ్‌తో కలి.

Courtesy AndhraJyothy..

RELATED ARTICLES

Latest Updates