రోజుకు 9 గంటలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

పని వేళల్ని పెంచే యోచనలో మోడీ సర్కారు
– డీడబ్ల్యూసీలో ఈ మేరకు కొత్త రూల్‌
– కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయం
– మరింతగా తగ్గిపోనున్న కొత్త కొలువులు
– ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: కార్పొరేట్‌ ప్రపంచానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోన్న కేంద్రంలోని మోడీ సర్కారు తాజాగా మరో వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న రోజుకు ఎనిమిది పని గంటల విధానాన్ని సవరిస్తూ దానిని తొమ్మిది గంటలకు పెంచాలని యోచి స్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఒకదానిని తాజాగా కార్మిక శాఖ మూసాయిదా వేతన స్మృతిలో (డీడబ్ల్యుసీ) పొందుపరిచింది. మెరుగైన ఉత్పత్తి నిమిత్తం ప్రస్తుతం ఉన్న ఎనిమిది పని గంటల విధానాన్ని సవరించాలని తాము భావిస్తున్నట్టుగా కార్మిక శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. దీని వెనుక కార్పొరేట్‌ సంస్థల ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కార్పొరేట్‌ సంస్థలు ఇప్పటికే అందిస్తోన్న ఆరకొర జీతాలతో సతమతమవుతున్న వేతన జీవులతో మరో గంట అదనంగా పని చేయించి.. ఆ మేరకు వారికి మరింత లాభాలు కలిగేలా చూడా లన్నది సర్కారు ఆలోచనగా కనిపిస్తోందని.. విమర్శకులు అంటున్నారు. ప్రయి వేటు రంగానికి మేలు చేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తూ వివిధ మార్గాల్లో.. ఇందుకు సంబంధించిన చర్యలను చేపడుతోన్న మోడీ సర్కారు తాజాగా దేశంలో ని శ్రామిక శక్తిని కించపరిచేలా.. పని గంటలను తగ్గించాలని చూడడం సరికాదని కార్మిక లోకం హెచ్చరిస్తోంది. అంతర్జాతీయంగా అమలులో ఉన్న నిబంధనల మేరకు ఒక కార్మికుడు గానీ, అధికారి గానీ రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కు వగా పని చేస్తే దాని ప్రతికూల ప్రభావం ఉత్పత్తిపై పడుతుందని విశ్లేషకులు చెబు తున్నారు. ఎక్కువ పని గంటల వల్ల వేతల జీవులకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం తో పాటు వారు కుటుంబానికి దూరం కావాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు పని గంటలు పెరగడం వల్ల కొత్త ఉద్యోగాలపై కూడా ప్రభావం పడనుంది. కార్పొ రేట్‌ సంస్థలు యాజమాన్యాలు ఉన్న కార్మికులు, అధికారులతోనే ఎక్కవ సేపు పని చేయించుకొని.. తమ టార్గెట్లను పూర్తి చేసుకొనే ఆలోచన చేసే ప్రమాదం ఉంది. దీంతో కొత్త ఉద్యోగుల నియామకాలను కంపెనీలు పక్కన బెడుతాయి. ఫలితంగా దేశంలో నిరుద్యోగిత మరింతగా పెరిగిపోయే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కేంద్ర కార్మికశాఖ ఈ ముసాయిదా వేతన స్మృతిని ప్రస్తు తం ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు గాను బహిరంగ పరిచింది. దీనిపై ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నారని కార్మిక శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి.
‘కనీసం’ పట్టించుకోని ప్రభుత్వం..
కేంద్రంలోని మోడీ సర్కారు కష్ట జీవుల శ్రమను గుర్తించడంలో పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోంది. ఒకవైపు వేతన జీవుల పని గంటలను పెంచడంపై ఆసక్తి చూపుతున్న ప్రభుత్వం.. ఇదే సమయంలో జాతీయ కనీస వేతనాన్ని నిర్ణయించే విషయంలో మాత్రం దాటవేసే ధోరణిని కనబరుస్తోంది. ఈ విషయం నిర్ణయ తీసకొనే అంశాన్ని నిపుణుల కమిటీకి వదిలివేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్టుగా డీడబ్ల్యుసీలో ప్రభుత్వం ప్రకటించింది. అంటే కార్మిక ప్రయోజనాలపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదన్న అంశం ఒక్కడ తేలిపోతోందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై కార్మిక శాఖ నియమించిన అంతర్గత కమిటీ తన నివేదికను వెల్లడిస్తూ భారత్‌లో కనీస వేతనం రూ.375గా ఉండాలని అభిప్రాయపడింది. మొత్తంగా నెలకు ఈ వేతనం రూ.9,750గా ఉండాలని సూచించింది. దీనికి తోడు నగరాల్లో పని చేస్తున్న వారికి కనీసం రూ.1,430 హౌసింగ్‌ అలవెన్స్‌ను కూడా ప్రకటించాలని కమిటీ అభిప్రాయపడింది. ఈ విషయమై ప్రజాభిప్రాయం సేకరించిన తరువాత ముసాయిదాలోని అంశాలను చట్టంగా ఖరారు చేయనున్నారు. దేశాన్ని మూడు భౌగోళిక వర్గాలుగా విభజించినకనీస వేతన చట్టాన్ని నిర్ణయించాలన్నది సర్కారు ఆలోచన. 40 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్నవారికి ఒక రకమైన వేతనాలు, 10-40 లక్షల జనాభా కలిగిన ప్రాంతాల్లోని వారికి ఒకరకమైన కనీస వేతనం, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఒకరకమైన వేతనం చెల్లించాలన్న ఆలోచనతో సర్కారు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కనీస వేతనంపై 10 శాతం హౌస్‌ రెంట్‌ వర్తించనుంది. దీనికి తోడు మూల వేతనంలో 20 శాతాన్ని ఇతర ఖర్చుల కింద చెల్లించాలనే ప్రతిపాదన ఉంది.

Courtesy Navatelangana…

 

RELATED ARTICLES

Latest Updates