మోడీ సర్కారు మూడో కన్ను

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ‘పెగాసస్‌’తో కేంద్రం నిఘా
– సర్కారుకు కొరుకుడుపడని జర్నలిస్టులు, కార్యకర్తలే లక్ష్యం!
– ఆ మాల్‌వేర్‌ బాధితుల్లో తెలంగాణ అడ్వకేట్‌
– ‘పెగాసస్‌’ను సర్కారు సంస్థలకే విక్రయిస్తాం : ఎన్‌ఎస్‌వో
న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూపు అభివృద్ధి చేసిన పెగాసస్‌ స్పైవేర్‌.. వాట్సాప్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,400 మంది వ్యక్తిగత వివరాలపై నిఘా వేసిందన్న వార్త కలకలం రేపుతున్నది. దాదాపు 100 పౌర సంఘాల సభ్యుల వ్యక్తిగత సమాచా రంపై కన్నేసిందని తెలుస్తున్నది. కాగా, మనదేశంలో దాదాపు 20 మందిని ఈ మూడో కన్ను నీడలా వెంటాడు తున్నదని సమాచారం. వాట్సాప్‌లోని వీడియో కాల్‌ ఫీచర్‌లోని ఒక లోపంతో ఈ వైరస్‌ డివైజ్‌లోకి ప్రవేశించి అందులోని చాట్స్‌, మెయిల్స్‌, ఫొటోలు లాంటి వ్యక్తిగత ఫైల్స్‌ను పెగాసస్‌ మాల్‌వేర్‌ కొనుగోలు చేసిన ఎన్‌ఎస్‌వో గ్రూపు కస్టమర్‌కు అందిస్తుందని పరిశోధనలు చెబుతు న్నాయి. అయితే, ఎన్‌ఎస్‌వో గ్రూపు ఈ సాఫ్ట్‌వేర్‌ను వ్యక్తుల కు కాకుండా.. కేవలం ప్రభుత్వ ఏజెన్సీలు, సంస్థలకు మాత్ర మే విక్రయిస్తుందని వెల్లడించడం గమనార్హం. ఈ నేపథ్యం లోనే భారత సర్కారు ఈ పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందా? కొందరు జర్నలిస్టులు, సామాజిక, హక్కుల కార్యకర్తలు, మేధావులు, న్యాయవాదులను లక్ష్యంగా చేసుకుని వారి సమాచారాన్ని సేకరిస్తున్నదా? అనే అనుమా నాలు బలపడుతున్నాయి.
పెగాసస్‌తో ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలపై కన్ను :
పెగాసస్‌ దుర్వినియోగంపై యూఎస్‌లో కాలిఫో ర్నియాలోని ఫెడరల్‌ కోర్టులో వాట్సాప్‌(ఫేస్‌బుక్‌ యాజమా న్యం) లా సూట్‌ వేసింది. టొరంటో యూనివర్సిటీ అనుబం ధ రీసెర్చ్‌ బృందం ‘సిటిజెన్‌ ల్యాబ్‌’.. పెగాసస్‌ ఎలా నిఘా వేస్తుందన్న అంశంపై సవివరంగా ప్రచురించిన ఓ పరిశోధక కథనాన్ని పేర్కొంటూ ఈ లా సూట్‌ దాఖలు చేసింది. మొరాకో, సౌదీ అరేబియా, మెక్సికో, యూఏఈ సహా పలుదేశాల్లోని జర్నలిస్టులు, కార్యకర్తలపై నిఘా వేసేందుకు ఎన్‌ఎస్‌వోకు చెందిన పెగాసస్‌ను వినియోగిసు ్తన్నారని సిటిజెన్‌ ల్యాబ్‌ పేర్కొంది. ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా ఎంబసీలో సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గి హత్యకు ముందు పెగాసస్‌తోనే అతనిపై నిఘా వేశారని ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వెల్లడించడం గమనార్హం.
‘భీమా కోరేగావ్‌’తో సంబంధమున్నవారిపై..
ఫేస్‌బుక్‌ లా సూట్‌ వేసిన తర్వాత మనదేశంలోని దళిత కార్యకర్తలు, మేధావులు, జర్నలిస్టులు.. ముఖ్యంగా భీమా కోరేగావ్‌ కేసుతో లింక్‌ ఉన్న కార్యకర్తలు, న్యాయవా దులు ఈ స్పైవేర్‌ ముప్పును ఎదుర్కొన్నట్టు ముందుకు వచ్చారు. దాదాపు 14 మంది తాము నిఘాలో ఉన్నామని ధ్రువీకరించినట్టు ఓ జాతీయ వార్తా కథనం వెల్లడించింది. ఇందులో చాలా మంది సార్వత్రిక ఎన్నికల సమయంలో అంటే ఈ ఏడాది మేలో ఈ మాల్‌వేర్‌ దాడికి గురైనట్టు తెలిసింది. భీమా కోరేగావ్‌ కేసు నిందితుల తరఫు న్యాయవాది(నాగ్‌పూర్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది) నిహాల్‌ సింగ్‌ రాథోడ్‌కు అనుమా నాస్పద(అనూహ్యమైన అడ్రస్‌) అడ్రస్‌ నుంచి ఓ మెయిల్‌ వచ్చినట్టు తెలిపారు. రాథోడ్‌ను సిటిజెన్‌ ల్యాబ్‌కు చెందిన పరిశోధకుడు జాన్‌ స్కాట్‌ రెయిల్టన్‌ సంప్రదించి, అతను ఎదుర్కొంటున్న ప్రమాదాన్ని వివరించారు. పూణెకు చెందిన సాంస్కృతిక కార్యకర్త రూపాలీ జాదవ్‌కూ ఈ ల్యాబ్‌ నుంచి, వాట్సాప్‌ నుంచీ హెచ్చరికలు వచ్చాయి. మరో హ్యాండ్‌సెట్‌ కొనుక్కోవాల్సిందిగా వాట్సాప్‌ సూచించడం ప్రమాద తీవ్రతను తెలుపుతున్నది. భీమా కోరేగావ్‌ కేసుతో సంబంద óమున్న కార్యకర్త, ప్రముఖ విద్యావేత్త ఆనంద్‌ తేల్‌తుంబ్డే కూడా ఈ స్పైవేర్‌ బారినపడినట్టు తెలిసింది. గడ్చిరోలిలోని న్యాయవాది జగదీశ్‌ మేశ్రం, మహారాష్ట్రకు చెందిన నటుడు, కార్యకర్త వీర సాతిదార్‌పైనా ఈ నిఘా ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు బేలా భాటియా(కార్యకర్త), డిగ్రీ ప్రసాద్‌ చౌహాన్‌(ఛత్తీస్‌గఢ్‌ కార్యకర్త), షాలిని గేరా(ఛత్తీస్‌గఢ్‌ కార్యకర్త), అంకిత్‌ గ్రేవాల ్‌(చండీగఢ్‌ న్యాయవాది), సుభ్రాం శు చౌదరీ(జర్నలిస్టు), ఆశిశ్‌ గుప్త(ఢిల్లీ కార్యకర్త), సీమా ఆజాద్‌(అలహాబాద్‌ కార్యకర్త), వివేక్‌ సుందర(కార్యకర్త), సరోజ్‌ గిరి(డీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌), సిదాంత్‌ సిబల్‌ (జర్నలిస్టు), రాజీవ్‌ శర్మ(వ్యాసకర్త-ముంబయి), సంతోశ్‌ భార్తియా(జర్నలిస్టు), అలోక్‌ శుక్లా(ఛత్తీస్‌గఢ్‌ కార్యకర్త), అజ్మల్‌ ఖాన్‌(కార్యకర్త)లున్నట్టు తెలిసింది. మహారాష్ట్రలోని పూణెలో 2018 జనవరి 1న ఎల్గార్‌ పరిషద్‌ ఈవెంట్‌ తర్వాత భీమా కోరేగావ్‌ ఘటన జరిగింది. ఈ అల్లర్లలో తొమ్మిది మంది కార్యకర్తల ప్రమేయమున్నదని అదే ఏడాది జూన్‌లో మహారాష్ట్ర సర్కారు ఆరోపించింది. అల్లర్ల సమయంలో ఘటనాస్థలంలో లేని కార్యకర్తలపైనా ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. అటుతర్వాత ఉపా (యూఏపీఏ) లాంటి అమానుష చట్టాల కింద పలువురు కార్యకర్తలు అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో నిహాల్‌ సింగ్‌ రాథోడ్‌ గురువు ప్రముఖ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌ కూడా ఉన్నారు. ఈ కార్యకర్తలకు ఉగ్రవాద సంబంధాలున్నాయని నిరూపించేందుకు సర్కారు అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే సర్కారు వాదనకు బలాన్నిచ్చే ఆధారాలు, సమాచారం కోసం పెగాసస్‌ను ఉపయోగించారా? అనే వాదనలు వినపడుతున్నాయి.
తెలంగాణ న్యాయవాదిపైనా ‘పెగాసస్‌’ :
హైదరాబాద్‌కు చెందిన పౌర హక్కుల న్యాయవాది, రాజకీయ ఖైదీల విడుదల కోసం పనిచేస్తున్న బల్లా రవీంద్ర నాథ్‌పైనా పెగాసస్‌ నిఘా ఉన్నట్టు తెలిసింది. సిటిజన్‌ ల్యాబ్‌ పరిశోధకుడు బల్లా రవీంద్రనాథ్‌ను పెగాసస్‌ వైరస్‌ గురించి ఈ నెల 7న హెచ్చరించారు. కానీ, తొలుత ఆ మెస్సేజీ ఫ్రాడ్‌ అని రవీంద్రనాథ్‌ కొట్టిపారేశారు. మళ్లీ 11న వాట్సాప్‌ కాల్‌ ద్వారా హెచ్చరించేందుకు ప్రయత్నించినా.. రవీంద్రనాథ్‌ పట్టించు కోలేదు. పెగాసస్‌ నిఘా గురించిన వార్త తెలియగానే.. ఏం జరుగుతున్నదో తనకు అర్థమైనట్టు రవీంద్రనాథ్‌ ఓ మీడియా సంస్థకు వివరించారు.
నిఘా రాజ్యమా?
వాట్సాప్‌ వెల్లడించిన ఆందోళనకరమైన విషయాలపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గోప్యత నిబంధనలను మరింత పటిష్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్‌ఎస్‌వో మాత్రం పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రభుత్వ సంస్థలకే విక్రయిసా ్తమని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మన దేశంలోని పౌర హక్కుల సంఘాల సభ్యులపై నిఘా వేసేందుకు ఇజ్రాయిల్‌ ఎన్‌ఎస్‌వో సంస్థ పెగాసస్‌ను భారత ఎజెన్సీలకు విక్రయిం చిందా? విదేశీ సంస్థల ఉత్తర్వుల మేరకు ఈ నిఘా అమలు చేస్తున్నారా? లేక భారత అధికారులే దీనికి పూనుకున్నారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒకవేళ మనదేశ సంస్థలే కావాలనే ఈ నిఘాకు పాల్పడితే.. ఇవి నిఘా రాజ్యం వైపునకు పడే అడుగులు కాదా? అన్న చర్చ నడుస్తున్నది.

Courtesy Navatelangana…

RELATED ARTICLES

Latest Updates