మూడు నెలల ముచ్చటే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– గోదావరి జలాల మళ్లింపుపై ఎవరి దారి వారిదే..
– ఉమ్మడి ప్రాజెక్టుకు స్వస్థి
– పోలవరం నుంచే కృష్ణా బేసిన్‌కు నీరు తరలింపు
– తెలంగాణతో సంబంధం లేకుండానే ముందుకు
– ఏపీ తాజా నిర్ణయంతో ముగిసిన అధ్యాయం

గోదావరి మిగులు జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించటానికి తెలంగాణ, ఏపీ చేపట్టాలనుకున్న ఉమ్మడి ప్రాజెక్టుకు బ్రేక్‌ పడింది. ఈ ప్రతిపాదన కేవలం మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. తెలంగాణతో సంబంధం లేకుండా పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ను కృష్ణా బేసిన్‌కు తరలించాలని సోమవారం ఏపీ ప్రభుత్వం నిర్ణయించటంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. రోజుకు రెండు టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌లోని కర్నూలు జిల్లా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు తరలించ టానికి రూ. 60 వేల కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయటానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందచేసే బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించాలని నిర్ణయించింది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించటం ద్వారా రెండు రాష్ట్రాలకు చెందిన మెట్ట ప్రాంతాలకు సాగునీరందించ వచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు నెలల క్రితం ప్రతిపాదించారు. కృష్ణా బేసిన్‌లో నీటి కొరతను అధిగమించటానికి గోదావరి జలాలను తరలించటమే ప్రత్యామ్నాయమని సూచించారు. ఈ ప్రతిపాదనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అంగీకరించారు. జూన్‌ 29న హైదరాబాద్‌లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో గోదావరి జలాల తరలింపు అంశంపై తెలంగాణ, ఏపీల మధ్య సూత్రప్రాయమైన అంగీకారం కుదిరింది. ఈ పథకానికి సంబంధించి సాంకేతిక, ఆర్థిక రెండు రాష్ట్రాల ఇంజినీర్లు కలిసి చర్చించాలని సీఎంల సమావేశంలో నిర్ణయించారు. నీటి తరలింపు , ప్రతిపాదనలను జులై 15 లోగా ఖరారు చేయాలని కూడా సీఎంలు ఆదేశించారు.

చర్చలో ప్రతిష్ఠంభన…
గోదావరి జలాల తరలింపు కోసం సీఎంల సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకారం కుదిరి మూడు నెలలు పూర్తయినా నీటిని ఎక్కడి నుంచి తీసుకోవాలనే అంశంపై ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. రెండు రాష్ట్రాల ఇంజినీర్ల స్థాయి సమావేశం ఒకసారి మాత్రమే జరిగింది. తెలంగాణలోని దుమ్ముగూడెం, రాంపూర్‌, తుపాకుల గూడెం నుంచి కానీ ఏపీ లోని పోలవరం నుంచి కానీ నీరు తరలించాలనే ప్రతిపాదనలపై వారు చర్చించారు.ఈ ప్రతిపాదనల ఆధారంగా చర్చలు కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ ముఖ్యమంత్రుల వద్ద నుంచి గ్రీన్‌ సిగల్‌ రాక పోవటంతో మరో సారి వారు సమావేశం కాలేదు.

ఏపీ ఇంజినీర్ల అభ్యంతరాలు..
పోలవరం, పట్టిసీమ నుంచి కృష్ణా బేసిన్‌కు ఇప్పుడు తరలిస్తున్న 80 టీఎంసీల నీరు చాలటం లేదని, కృష్ణా డెల్టా కింద ఉన్న 13.5 లక్షల ఎకరాలకు నీరిచ్చి, మెట్ట ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే నీరు తరలించాలనే ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్నది. కృష్ణా-పెన్నా లింక్‌ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దశలో కేవలం తెలంగాణ భూభాగం నుంచి నీరు తీసుకోకుండా నేరుగా పోలవరం నుంచే నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించాలని ఏపీ ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు. ఏపీలో ఇటీవల జరిగిన విశ్రాంత ఇంజినీర్ల సమావేశంలో తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను తరలించే ప్రతిపాదనను వ్యతిరేకించారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించే నీటిని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా పులిచింతలకు, అక్కడి నుంచి బనకచర్లకు తరలించటం ద్వారా నాగార్జునసాగర్‌ రెండవ దశ, వెలిగొండ, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు తరలించాలని వారు సూచించారు. దీని ద్వారా చిత్తూరు, కడప జిల్లాల్లోని మరో 5 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. గోదావరి-పెన్నా లింక్‌లో భాగంగా ఇప్పటికే వ్యాప్కోస్‌ సూచించిన విధంగా గుంటూరు జిల్లాలో బొల్లాపల్లి వద్ద 200 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన భారీ రిజర్వాయర్‌ నిర్మించాలని విశ్రాంత ఇంజినీర్లు ఏపీ ప్రభుత్వానికి సలహానిచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య గోదావరి నీటి మళ్లింపు పథకంపై ఒప్పందాలు జరిగితే ఈ ప్రభావం బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణపైన పడుతుందని వారు తమ నివేదికలో తెలిపారు.

తెలంగాణ ఇంజినీర్ల నుంచీ వ్యతిరేకత
గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే ప్రతిపాదనలను తెలంగాణ ఇంజినీర్లు కూడా వ్యతిరేకిం చారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌, తెలంగాణ చాప్టర్‌ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఇంజినీర్ల రౌండ్‌ టేబుల్‌ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సంద ర్భంగా పలువురు విశ్రాంత ఇంజినీర్లు చేసిన సూచనల ను క్రోడీకరించి నివేదిక రూపంలో సీఎం కేసీఆర్‌కు అందచేశారు. ప్రధానంగా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతనే గోదావరి జలాలను కృష్ణా ప్రాజెక్టులకు తరలించాలనే సూచన పలువురి నుంచి వచ్చింది. నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంలో ముందంజలో ఉన్న ఏపీకి తెలంగాణ భూభాగం నుంచి నీరందించాల్సిన అవ సరం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇంజినీర్ల అభిప్రా యంతో సీఎం కేసీఆర్‌ కూడా ఏకీభవించి చర్చల ప్రక్రియ కొనసాగించాల్సిన అవసరం లేదని అన్నట్టు తెలిసింది.

RELATED ARTICLES

Latest Updates