”మహా” అతిపేద ఎమ్మెల్యేగా సీపీఐ(ఎం) నేత వినోద్ నికోలే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– రూ. 50 వేలే ఆయన ఆస్తి!
– ప్రజా ఉద్యమాలతో మమేకం…సోషల్‌ మీడియాలోనూ ప్రశంసలు

న్యూఢిల్లీ : దేశానికి ఆర్ధిక రాజధానిగా గుర్తింపు పొందిన ముంబై మహానగరం వున్న మహారాష్ట్రంలో అత్యంత సామాన్య కుటుంబ నుంచి వచ్చిన సీపీఐ(ఎం) నేత వినోద్‌ నికోలే ఇటీవల జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. నిత్యం ప్రజా ఉద్యమాలతో మమేకం కావడం వల్లే నికోలే గెలుపునకు దోహదం చేసిందని విశ్లేషకులు తెలిపారు.
మహారాష్ట్రలో జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో అధికార బీజేపీకి చేదు అనుభవం ఎదురు కాగా, కాంగ్రెస్‌, ఎన్సీపీ కొంతమేర తమ స్థానాలను పెంచుకున్నాయి. అయితే, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి విషయం ఏమిటంటే…పలువురు స్వతంత్రులు, వామపక్ష నేతలు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్నారు. అందులో ధను నియోజకవర్గం నుంచి గెలుపొందిన వినోద్‌ నికోలే ఒకరు. ఆయన సీపీఐ(ఎం) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఒక్కో ఎమ్మెల్యే ఆస్తులు సగటున రూ. 10.87 కోట్లు ఉన్నట్టు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. అందులో అత్యల్పంగా రూ.51,082 కలిగి ఉన్న ఎమ్మెల్యేగా వినోద్‌ నికోలే అని ఆ సంస్థ తేల్చింది. ఆయనకంటూ స్థిరాస్థులు ఏమీ లేవని ఏడీఆర్‌ స్పష్టం చేసింది. ఆయన తరువాత అతి తక్కువ ఆస్థి కలిగిన సభ్యుడు ఎంఐఎంకి చెందిన షారూక్‌ అన్వర్‌ అని వెల్లడించింది. అన్వర్‌ ఆస్తి రూ.29.82 లక్షలుగా వుందని వివరించింది. ఇక అత్యధిక ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేల్లో బీజేపీకి చెందినవారేనని ఆ సంస్థ తెలిపింది. ఘటోక్‌పూర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందిన పారంగ్‌ షా రూ.500.62 కోట్లతో అత్యధిక ఆస్థిపరుడుగా తొలి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో రూ.441.65 కోట్లతో మరో బీజేపీ నేత మంగళ్‌ ప్రభాత్‌ వున్నారు. మొత్తం 288 సభ్యుల్లో 80 శాతం మంది అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నారని, అందులో నుంచి బీజేపీ నుంచే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, తరువాత స్థానంలో కాంగ్రెస్‌, ఎన్సీపికి చెందిన నాయకులు ఉన్నారని ఏడీఆర్‌ తెలిపింది. మహా సంపన్న రాష్ట్రంలో కూడా వినోద్‌ గెలవడంపై ఏడీఆర్‌ సంస్థ ప్రత్యేక వ్యాఖ్యలు చేసింది. పూరెస్ట్‌ లెజిస్లేటర్‌(పేద ఎమ్మెల్యే) అని పేర్కొంది.

ప్రజా పోరాటాలతోనే గెలుపు సాధ్యమైంది: వినోద్‌ నీకోలే
నిత్యం ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై ఉద్యమాలు చేపట్టడం, వాటి పరిష్కారం కోసం కృషి చేయడం వల్లనే తాను చట్టసభకు ఎన్నికయ్యానని వినోద్‌ నీకోలే చెప్పారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు గతంలో ఎన్నో హామీలు ఇచ్చిందని, అయితే వాటి అమలుకు ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించలేదని విమర్శించారు. రైతు సమస్యలతోపాటు విద్యార్థులు, యువజనుల తదితర వర్గాల సమస్యలపై పోరాడానని చెప్పారు అందుచేతనే ధను నియోజకవర్గ ప్రజానీకం తనపై విశ్వాసం ఉంచి, అక్కున చేర్చుకున్నారని చెప్పారు.

Courtesy: NT..

RELATED ARTICLES

Latest Updates