డెలివరీ బాయ్స్ కోసం కార్మికసంఘం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-బెంగాల్‌లో త్వరలో సర్వే చేయనున్న సీఐటీయూ
– క్యాబ్‌ డ్రైవర్ల యూనియన్‌లో 5000మంది

కోల్‌కతా: డెలివరీ బాయ్స్ కోసం ఓ అనుబంధ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీఐటీయూ బెంగాల్‌ కార్యదర్శి ఆనందిసాహు తెలిపారు. ఈ-కామర్స్‌ సంస్థల్లో డెలివరీ బాయ్స్ పని చేస్తున్నవారి సమస్యలపై త్వరలోనే సర్వే ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. తమ ఆలోచనకు సీపీఐ(ఎం) బెంగాల్‌ కార్యదర్శి సూర్యకాంతమిశ్రా ప్రోత్సాహమున్నదని ఆయన తెలిపారు. ఇప్పటికే క్యాబ్‌ డ్రైవర్లకు యూనియన్‌ ఏర్పాటు చేసి విజయవంతమయ్యామని ఆయన తెలిపారు. ఏడాది కాలంలో 5000మంది క్యాబ్‌ డ్రైవర్లు యూనియన్‌లో చేరారని ఆయన తెలిపారు. దేశంలో దాదాపు 15 లక్షలమంది క్యాబ్‌ డ్రైవర్లున్నట్టు అంచనా
రెగ్యులర్‌ ఉద్యోగులకుండే ప్రయోజనాలు డెలివరీ బోర్సుకు లేకపోవడాన్ని సాహు గుర్తు చేశారు. సెలవులుగానీ, పని గంటల్లో పరిమితిగానీ వారికుండవని ఆయన తెలిపారు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత వారికి లేవని ఆయన తెలిపారు. వారివి ఒప్పంద ఉద్యోగాలు కావడంతో స్థిరంగా ఒకే కంపెనీలో పని చేసే అవకాశముండదని ఆయన తెలిపారు.
కోల్‌కతాలో రాత్రి 9 తర్వాత ఆయా ప్రాంతాల్లో ఫుడ్‌ డెలివరీ బోర్సు కనిపిస్తారు. వారికిచ్చిన అసైన్‌మెంట్‌లో భాగంగా ఆహారం ప్యాకెట్లను ఆయా ఇండ్లకు చేరవేస్తారు. మధ్యలో అలసట తీర్చుకునేందుకు ఐస్‌క్రీమ్‌ షాపులకు వెళ్తారు. అలాంటిచోట్ల ముగ్గురు,నలుగురు డెలివరీ బోర్సు కూడి తమ పనిలోని బాధల్ని పంచుకోవడం కనిపిస్తుంది. అలాంటివారితో ముచ్చటించినపుడు తమకో కార్మిక సంఘం ఏర్పాటు పట్ల ఆసక్తి చూపారని సాహు తెలిపారు.
ఐటీసహా పలు రంగాలలోని ఉద్యోగులతో యూనియన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగాల్‌లోని సీఐటీయూకు చెందిన వివిధ సంఘాల్లో చేరిన కార్మికుల సంఖ్య 14 నుంచి 15 లక్షల వరకు ఉన్నట్టు సాహు తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత పలు కంపెనీల్లో తమ యూనియన్లను బెదిరించి ఆక్రమించుకున్నారని ఆయన తెలిపారు. పలు పరిశ్రమలు మూతపడటం వల్ల కూడా కార్మికుల సంఖ్య తగ్గిందని ఆయన తెలిపారు. ఐదేండ్ల క్రితం సీఐటీయూ సభ్యుల సంఖ్య 19 లక్షలని ఆయన తెలిపారు.

Courtesy: NT..

RELATED ARTICLES

Latest Updates