సమ్మెకు జాతీయ, అంతర్జాతీయ మద్దతు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • రష్యా ట్రేడ్‌ యూనియన్‌, ఏఐటీఎఫ్‌ సంఘీభావం
  • అదేబాటలో టీపీటీఎఫ్‌, రైల్వే, వైద్య, మున్సిపల్‌ ఉద్యోగులు

హైదరాబాద్‌: ఆర్టీసీకార్మికుల సమ్మెకు వివిధ యూనియన్లు, సంఘాల నుంచి మద్దతు లభించింది. జాతీయ, అంతర్జాతీయ సంఘాలతో పాటు రైల్వే, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉద్యోగ సంఘా లు మద్దతు ప్రకటిస్తున్నాయి. దసరా పండుగ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా మద్దతిస్తాయని ప్రచారం జరుగుతోంది. వారు పెన్‌డౌన్‌ కార్యక్రమానికి దిగే అవకాశాలున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ రష్యాలోని ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చైర్మన్‌ డాష్కోవ్‌ యూరీ వ్లాదిమిరోవిచ్‌ కార్మిక జేఏసీకి మెయిల్‌ చేశారు. కార్మిక డిమాండ్లను వెంటనే పరిష్కరించడంలో చొరవ చూపాలని సీఎం కేసీఆర్‌కు ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.కె.దివాకరన్‌ లేఖ రాశారు. సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై.అశోక్‌కుమార్‌, ఎం.శ్రీనివాసులు తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు కె.యాదానాయక్‌, ప్రధానకార్యదర్శి కె.బలరాం డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ సమ్మెకు సంయుక్తంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖమర్‌ అలీ, పాలడుగు భాస్కర్‌, మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.గణపతిరెడ్డి, ఐ.శ్రీపతిరావు తెలిపారు. కార్మికుల సమ్మెకు మద్దతునిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ కార్యదర్శి పి.రవీందర్‌ తెలిపారు.
courtesy Andhra Jyothy

RELATED ARTICLES

Latest Updates