అంబేద్కర్ కు నివాళి ఇదేనా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రిజర్వేషన్లకు తూట్లు  

బి. భాస్కర్

ఒకపక్క ఖాళీలు భర్తీ చేయరు. కేంద్రం రాష్ట్రాల స్థాయిలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఏళ్ల తరబడి అట్టి పెట్టారు. కన్సల్టెంట్లు, అవుట్సోర్సింగ్ పద్ధతుల కింద ఇప్పటికే ప్రభుత్వాలు తక్కువ జీతాలతో భారీ నియామకాలు చేస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేటరల్ ఎంట్రీ పద్ధతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకందించిన రిజర్వేషన్ల విధానానికి పూర్తిగా గండి కొట్టనుంది.ఒకపక్క ఖాళీలు భర్తీ చేయరు. కేంద్రం రాష్ట్రాల స్థాయిలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఏళ్ల తరబడి అట్టి పెట్టారు. కన్సల్టెంట్లు, అవుట్సోర్సింగ్ పద్ధతుల కింద ఇప్పటికే ప్రభుత్వాలు తక్కువ జీతాలతో భారీ నియామకాలు చేస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేటరల్ ఎంట్రీ పద్ధతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకందించిన రిజర్వేషన్ల విధానానికి పూర్తిగా గండి కొట్టనుంది. గత ఏప్రిల్ నెలలో యూపీఎస్సీ లేటరల్ ఎంట్రీ కింద అంటే ప్రైవేటు రంగంలోని నిపుణులను తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. అలా తొమ్మిది మందిని జాయింట్ సెక్రటరీ స్థాయి ఉద్యోగాలకు తీసుకుంది. ఇంకా నీతి అయోగ్ కి చెందిన 516 పోస్టుల్లో 54 మందిని ఇదే విధానం కింద భర్తీ చేయాలని ఆలోచిస్తున్నది. తాజాగా సెంట్రల్ స్టాఫి oగ్ స్కీమ్ కింద 400 మందిని జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ కార్యదర్శులు, డైరెక్టర్ల పోస్టులకు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బంది వ్యవహారాల, శిక్షణ విభాగం ఒక ప్రతిపాదనను ఈ మేరకు సిద్ధం చేస్తున్నదని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక సమాచారం. సిసిఎస్ కింద ఇలాంటి తరహా పోస్టులు 650 ఉన్నాయి. అంటే వీటిలో 60 శాతానికి పైగా పోస్టులు అన్నీ ఉన్నతాధికార పోస్టులు లేటరల్ ఎంట్రీ కింద భక్తి చేస్తారన్నమాట.40 అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు సీసీఎస్ కింద ఉంటారు. మరో 650 డిప్యూటీ డైరెక్టర్ లు, డైరెక్టర్ల పోస్టులు ప్రమోషన్ల కింద భర్తీ చేస్తారు. ప్రస్తుతానికి ఈ పోస్ట్ లో జోలికి వెళ్లకున్నా భవిష్యత్తులో లేటరల్ ఎంట్రీ పద్ధతి వీటికి వర్తింప చేయరని గ్యారంటీ ఏమిలేదు. ఇప్పటికే టెంపరరీ, అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో కాంట్రాక్టు కింద తక్కువ జీతాలు ఇచ్చి ఉద్యోగుల్ని తీసుకుంటున్నారు. వీటితోపాటు పైన చెప్పుకున్న పద్ధతి కింద కూడా తీసుకునేవారు పర్మనెంట్ ఉద్యోగులు కాదు. అంటే ఈ తరహా నియామకాలు అన్నిటికీ ఉద్యోగ భద్రత, పెన్షన్, సామాజిక భద్రతా పథకాలు వర్తించవు అన్నమాట. మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకునే నరేంద్ర మోడీ ఆయన సర్కారు బాబా సాహెబ్ కు ఆచరణలో ఇస్తున్న నివాళి ఇదన్నమాట!

(రచయిత సీనియర్ జర్నలిస్ట్)

RELATED ARTICLES

Latest Updates