నామ్‌కే వాస్తేలా ప్రాథమిక ఆరోగ్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత
చిన్న జబ్బులకూ పట్టణాలే దిక్కు
పోస్టుల భర్తీలో సర్కారు వైఫల్యం
న్యాయవివాదాలనూ పరిష్కరించలేని వైనం.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నామమాత్రపు సేవలకే పరిమితమవుతున్నాయి.. ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టు లను భర్తీ చేయకపోవడంతో రోగులకు మెరుగైన సేవలను అందించలేని పరిస్థితి నెలకొంది. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామన్నా ఇప్పటికీ అతీ గతీ లేదు. దీంతో రోగులకు ఉన్న కొద్దిపాటి సిబ్బంది వైద్యప రమైన సేవలందించలేక పోతున్నారు. రోగుల ఒత్తిడిని తట్టుకోలేక క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది గగ్గోలు పెడుతు న్నారు. దీంతో చిన్న చిన్న రోగాలకు సైతం ప్రజలు జిల్లా ఆస్పత్రికి, బోధనాస్పత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా పెరిగిన రోగుల తాకిడికి సరిపడి నంత మేర సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వాస్ప త్రులపై ప్రజల్లో అసంతప్తి తగ్గకపోగా మరింత పెరుగు తున్నది. పల్లె నుంచి పట్నం దాకా సిబ్బంది కొరత రోగులకు అందిం చే వైద్య చికిత్సకు ప్రధాన ఆటంకంగా మారింది. గ్రామాలు, పట్టణాల్లో 1000 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు న్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 700 వరకు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో మిగితావి ఉన్నాయి. ఈ కేంద్రాలు తోడు ఉప కేంద్రాలు (సబ్‌ సెంటర్లు) 4800 వరకు పని చేస్తున్నాయి. వీటిలో కొన్నింటిని కేంద్రాలను అత్యవసర సేవలందించేం దుకు 24 గంటలు పని చేసేం దుకు ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లలో 1318 డాక్టర్లు అవసర ముండగా కేవలం 968 మంది మాత్రమే ఉన్నారు. 350 మంది డాక్టర్ల లోటు ఉంది. ఆరోగ్య కార్యకర్తలు 9,141 మంది ఉండాల్సి ఉండగా 7,705 మంది మాత్రమే ఉన్నారు.1,436 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య సహా యకులు 1,111 మందికి గాను 944 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 167 పోస్టులు భర్తీ చేయలేదు. ల్యాబ్‌ టెక్నీషియన్ల 765కు గాను 566 మంది ఉన్నారు.199 భర్తీ చేయాల్సి ఉంది. నర్సులు 1,666 మందికి గాను 1453 మంది ఉండగా 213 ఖాళీగా ఉన్నాయి. అత్యవసర సేవ లందించేందుకు ఎంపిక చేసిన కేంద్రాల్లోనూ సిబ్బంది కొరతను పూర్తిగా తీర్చలేకపోయారు. ప్రసవాలు జరిగే 24 గంటలు నడిచే కేంద్రాల్లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు, ఒక సహాయకుడు ఉండాలని నిబంధనలున్నా చాలా కేంద్రాల్లో సిబ్బంది కొరత వెక్కిరిస్తున్నది. ఎన్‌సీడీ (నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌) కోసమని తాత్కాలికంగా కొంత మంది స్టాఫ్‌ నర్సులను తీసుకోవడం మినహా ఆయా కేంద్రాల్లో ఖాళీ కుర్చీలు వెక్క రిస్తున్నాయి. దీనికి తోడు 175 ఫిక్స్‌డ్‌ డే హెల్త్‌ సర్వీసెస్‌లో పని చేస్తున్న 1375 మంది సిబ్బందికి గత ఆరు నెలలకు పైగా జీతాలు చెల్లించడం లేదు. గ్రామాల్లో ప్రాణాంతక జబ్బులకు పరీక్షలు చేసి వైద్య చికిత్సలు అందిస్తున్న వీరు కుటుంబాలను గడవక విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నారు. విధులు బహిష్కరించి నిర సన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అత్యవసర పరిస్థి తుల్లో తాత్కాలిక ప్రాతి పదికన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బం దిని సర్దుబాటు చేస్తున్నా సమస్య తీరడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది దాదాపు 10 వేల పోస్టుల వరకు ఖాళీలున్నాయి. ముంద స్తుగా తగిన కసరత్తు చేయకుండా వీటి భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయడంతో న్యాయవివాదంలో చిక్కుకున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై వచ్చే న్యాయపర మైన సవాళ్లను ముందుగా అంచ నా వేయడంలో సర్కారు విఫలమైంది. దీంతో టీఆరఎస్‌ తొలి ప్రభుత్వ హయాంలో వేసిన నోటిఫికేషన్ల పోస్టులు టీఆర్‌ఎస్‌ రెండో దశ అధికారంలోకి వచ్చాక కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి.

జీతం ఇవ్వకుండా పని చేస్తారా?
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలం దించే వారికి సకాలంలో జీతాలు చెల్లిం చాలి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగు లకు పరీక్షలు చేసి, చికిత్స చేసే ఫిక్స్‌ డే హెల్త్‌ సర్వీసెస్‌ సిబ్బందికే నెలల తరబడి జీతాలు ఇవ్వలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వ ప్రాథమిక వైద్యాన్ని నీరుగారుస్తున్నది.
– (కె.యాదానాయక్‌, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌)

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు పాటించాలి
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను పాటిస్తేనే ప్రాథమిక ఆరోగ్యం వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక నర్సు ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశిం చింది. ఆ మేరకు నర్సులు అందుబాటులో ఉండేలా పోస్టు లను మంజూరు చేసి భర్తీకి చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగుపడితే ఆ క్రమంలో మిగిలిన ఆస్పత్రుల ప్రక్షాళన సులభమవుతుంది.
లక్ష్మణ్‌ రుఢావత్‌ (నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు)

జీతం, సౌకర్యాలు కల్పించాలి
రాష్ట్రంలో డాక్టర్లలో 60 శాతం మంది కార్పొ రేట్‌, ప్రయివేటు ఆస్ప త్రుల్లో పని చేస్తుండగా మరో 20 శాతం నుంచి 30 శాతం వరకు ప్రయివేటు క్లినిక్‌లు నడుపు కుంటున్నారు. ప్రభుత్వం ఖాళీలను ఏండ్ల తరబడి భర్తీ చేయకపోగా, కొత్త పోస్టులను కూడా మంజూరు చేయడంలో జాప్యం చేయడమే ఈ పరిస్థి తికి కారణం. డిమాండ్‌కు తగినట్టు జీతం, సౌకర్యాలను కల్పించాలి.
డాక్టర్‌ సంజీవ్‌ యాదవ్‌ (ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

ఉన్నతాధికారుల అవినీతే జాప్యానికి కారణం
పోస్టులు భర్తీ కాకుండా ఆగిపోవ డానికి శాఖలోని ఉన్నతాధికారుల అవినీతే కారణం. నోటిఫికేషన్‌ జారీ చేసి సత్వరం పోస్టులు భర్తీ చేయాల్సిన సమ యంలో వెయిటేజీ పేరుతో న్యాయ వివా దానికి తెరలేపారు. కేవలం తమ కమిషన్ల కోసం కక్కుర్తి పడిన ఉన్నతాధికారుల వల్లే ఈ పరిస్థితి దాపురించింది.
కె.నారాయణ (గలెన్స్‌ ఫార్మాసిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు)

పని భారం తగ్గించాలి
నర్సులు, పారామెడికల్‌ పోస్టులను పూర్తి స్థాయి లో భర్తీ చేయాలి. అన్ని పోస్టు లను భర్తీ చేయక పోవ డంతో ఉన్న సిబ్బం దిపై పని భారం పెరిగి పోతున్నది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య కార్యకర్తలు, ఆషావర్కర్లు, ఇతర క్షేత్ర స్థాయి హక్కులను గుర్తించి ప్రోత్సహించాలి.
(మాధవిలత – సెకెండ్‌ ఏఎన్‌ఎం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు)

Courtesy Nava telangana…

RELATED ARTICLES

Latest Updates