వంద రోజుల దూకుడు..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • ఆర్టికల్‌ 370 రద్దుతో సంచలనం
  • బీజేపీ సైద్ధాంతిక ఎజెండాపై ప్రత్యేక దృష్టి
  • విపక్షాలను చీల్చి కీలక బిల్లులకు సభామోదం
  • ఆర్థిక రంగంలో ఎదురుదెబ్బలు
  • ఎన్‌ఆర్‌సీపైనా తీవ్ర విమర్శలు.. విదేశీగడ్డపై ప్రశంసలు
  • మోదీ రెండో ఇన్నింగ్స్‌లో పంచ్‌లే ఎక్కువ

బౌండరీలను దాటిన దూకుడు… దాయాది వెన్ను వణికేలా ఆర్టికల్‌ 370 సిక్సర్‌… తక్షణ తలాక్‌ చట్టంతో ముస్లిం మహిళకు భరోసా… చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష. ఎన్‌ఐఏకు విస్తృతాధికారాలు, ఉగ్రవాద-వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టాలకు పదును… మోసాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన దండన, దేశవ్యాప్తంగా విరుచుకుపడుతున్న ఈడీ, సీబీఐ… కార్మిక సంస్కరణలు…. 10 ప్రభుత్వ బ్యాంకుల విలీనం… ఒకటేమిటి, మోదీ రెండో ఇన్నింగ్స్‌లో కీలక నిర్ణయాలనేకం జరుగుతున్నాయి. రెండోసారి అధికారంలోకొచ్చి శుక్రవారం నాటికి వంద రోజులు పూర్తయ్యాయు. ఈ స్వల్ప కాలంలో ఆయన ఇమేజి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచదేశాల్లోనూ అమాంతం పెరిగింది.

తొలిసారిగా 2014లో అధికారం చేపట్టినపుడు మోదీ సర్కార్‌లో ప్రారంభంలోనే ఇంత దూకుడు లేదు. మొత్తం యంత్రాంగంపై, విధానాలపై, కేంద్ర స్థాయిలో ఉన్న సాధకబాధకాలపై పట్టు సాధించడానికి మోదీకి కొంత సమయం పట్టింది. కానీ ఈసారి ప్రజలు రెట్టించిన విశ్వాసంతో ఓటు వేయడం, ఏకంగా 300పై చిలుకు స్థానాల్లో గెలిపించడం ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని ఇతోధికం చేసిందని విశ్లేషకులంటున్నారు. అందుకే రెండోసారి పగ్గాలు చేపట్టగానే ఆయన బీజేపీ సైద్ధాంతిక అంశాల మీద దృష్టిపెట్టారు. దేశంలోని ప్రతిపక్షాలన్నింటినీ దాదాపుగా కట్టడి చేసేశారు.

  • 100 రోజుల్లో కీలక నిర్ణయాలివీ..
  • ఆర్టికల్‌ 370 నిర్వీర్యం
  • తక్షణ తలాక్‌ నిషేధ చట్టం
  • చట్ట-వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి పదును
  • ఎన్‌ఐఏకు విస్తృతాధికారాలిచ్చే చట్టం
  • దేశంలోని రైతులందరికీ రూ 6000 ఇన్‌పుట్‌ సబ్సిడీ
  • దివాళా తీసిన సంస్థల వ్యవహారం తొందరగా పరిష్కరించే చట్టం (ఐబీసీ)
  • ఆధార్‌ చట్టంలో మార్పులు
  • అనేక కార్మిక చట్టాలని విలీనం చేసి నాలుగు కోడ్‌లుగా విభజన
  • రెండు కోడ్‌లకు సంబంధించిన బిల్లులు
  • 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంప్రతికూలతలు
  • జీడీపీ వృద్ధి 5 శాతానికి పడిపోవడం
  • ఎన్‌ఆర్‌సీపై విమర్శల హోరు
  • అంతర్జాతీయ విజయాలు
  • కులభూషణ్‌ జాదవ్‌ కేసులో ఆశావహ ప్రగతి
  • 370పై భద్రతా మండలిని ఇష్టాగోష్ఠికే పరిమితం చేయడం
  • అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకిని చేయడం
  • జీ-7, జీ-20 దేశాధినేతలతో వాణిజ్య చర్చలు
  • పొరుగుదేశాలను భారత్‌వైపు తిప్పడం

    (Courtacy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates