ఉగ్రరూపం దాల్చిన నిరుద్యోగం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మహేష్‌ వ్యాస్‌

జనాభా కంటే వేగంగా దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది. పట్టణాలలో కంటే పల్లెల్లో ఉపాథిలేమి బాగా కనిపిస్తున్నది. దేశ నిరుద్యోగం 9 శాతం మార్క్‌ను అధిగమించింది. దీంతో గత మూడేళ్ళలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. ఆగస్టు 25తో ముగిసిన వారాంతానికి 9.07 శాతా నికి చేరుకుంది. అంతకుముందు 2016 సెప్టెంబరు తొలి వారం నుండి చూస్తే ఇది అత్యధికం. గడిచిన నాలుగు వారాలలో 7.9 శాతం నుండి 9.07 శాతం మధ్య నమో దయ్యే అవకాశాలు కనిపించినప్పటికీ 8-9 శాతం మధ్య నిరుద్యోగితా రేటు నమోదయ్యింది. ఇది అంతకుముందు మూడు మాసాలలో నమోదైన 7.2-7.9 శాతం కన్నా100 బేసిస్‌ పాయింట్లు అత్యధికం. ఆగస్టు 25తో ముగిసిన వారానికి 9 శాతం నిరుద్యోగిత రేటు నమోదు కాగా గడిచిన 30రోజులలో సగటు నమోదు 8.25 శాతంగానే ఉండటం గమనార్హం. నెల రోజుల నిరుద్యోగిత సూచీని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆగస్టు నెలలో నిరుద్యోగిత రేటు 7.5 శాతం నుండి 8 శాతానికి చేరుకుంది. ప్రస్తుత వారంలో నిరుద్యోగిత రేటులో కొంత తగ్గుదల కనిపించి నప్పటికీ ఆగస్టు మాసాంతానికి 8.5 శాతానికి చేరుకునే అవకాశాలు కనిపించాయి. గత వారంలో నమోదైన 9 శాతం పెరుగుదలతో పోలిస్తే ఇదేమంత ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ గడిచిన మూడునెలల్లో నమోదైన అత్యధిక నిరుద్యోగిత రేటు ఇదే అవుతుంది.

2017 నుండి పెరుగుదలలో నిలకడ
దేశంలో నిరుద్యోగిత రేటు జులై 2017 నుండి నిలకడగా పెరుగుతూ వస్తున్నది. 2018 నుండి కార్మికుల భాగస్వామ్యంలో కొనసాగుతున్న స్ధిరత్వం, ఉద్యోగిత రేటు పడిపోవడం ఫలితంగా నిరుద్యోగిత రేటులో పెరుగుదల నిలకడ కొనసాగుతోంది. పనిచేయగల సామర్థ్యమున్న కార్మికుల(వర్కింగ్‌ ఏజ్‌) సంఖ్యలో ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతుండటంతో కొత్త వారికి అవకాశాలు కనిపించడంలేదు. పనిచేయగల సామర్థ్య మున్న కార్మికుల రేటు స్ధిరంగా ఉండటంతో నిరుద్యోగుల సంఖ్య కూడా నిలకడగా పెరుగుతున్నది. అయితే కార్మికుల సంఖ్య నిలకడగా పెరుగుతున్నా తగినంతగా ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. దీని ఫలితంగా నిరుద్యోగిత రేటు పెరుగుతున్నది. తగినంత ఉద్యోగ అవకాశాలు లేక పోవడాన్నే ఉద్యోగితా రేటు పడిపోవడంగా పరిగణిస్తాము.

గ్రామీణ నిరుద్యోగితలో ఆకస్మిక పెరుగుదల
ఆగస్టు 25తో ముగిసిన వారంలో గ్రామీణ నిరుద్యోగి తలో ఆకస్మిక పెరుగుదల ఏర్పడింది. పట్టణ ప్రాంతంలోని 8.9 శాతం నిరుద్యోగిత కన్నా అధికంగా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగిత 9.1 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంత నిరుద్యోగిత కన్నా గ్రామీణ ప్రాంత నిరుద్యోగితలో పెరుగుదల అరుదైన విషయమేమీ కాదు. అందువల్ల ఇటీవల వారాల్లో గ్రామీణ నిరుద్యోగితలో పెరుగుదలను అసాధారణ విషయంగా చూడరాదు.
ఇది దేశంలో ఖరీఫ్‌ సీజన్‌ కావ డంతో గ్రామీణ భారతంలో కార్మికుల భాగస్వామ్యం పెరిగింది. 30 రోజుల సగటు కూలీల భాగస్వామ్యం ఆగస్టు 25తో ముగిసిన వారానికి 44.4 శాతంగా ఉంది. ఇది జులైలో నమో దైన దానికన్నా అధికం. ఈ సీజన్‌లో ఏడాది కాలంలో గ్రామీణ ప్రాంతా లలో కార్మిక భాగస్వామ్యం అత్యధికం గా ఉంటుంది. దీంతో ఇటీవల కాలంలో వర్కింగ్‌ ఏజ్‌ జనాభా గ్రామీణ కార్మికుల జాబితాలో చేరడంతో వీరి సంఖ్య పెరిగింది కాని తగినన్ని అవకాశాలు లేవు.

తోడైన రుతుపవనాల ప్రభావం
వీరు ప్రస్తుతం ఉద్యోగాలు వెతుక్కోవడంలో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారత ఉపఖండంలో రుతుపవనాల పురోగతి ఆలస్యమై, వర్షాలు అస్థిరంగా ఉన్న కారణంగా విత్తనాలు వేయడంలో జాప్యం జరుగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల రీత్యా స్థానికంగా వర్షాలు అత్యధికంగా కురవడంతో వరదలు ఏర్పడి పెద్ద మొత్తంలో విత్తనాలు వేసేందుకు అనువైన పరి స్థితి లేదు. సాధారణంగా ఖరీఫ్‌ సీజన్‌లో ఉండే డిమాండ్‌ కన్నా గ్రామీణ కార్మికులకు డిమాండ్‌ ప్రస్తుతం తక్కువగా ఉంది. దుక్కిదున్నడం, విత్తనాలు వేయడం వంటి పనులు చేసే కూలీల వేతన రేట్ల ఈ జూన్‌లో 7 శాతం పెరిగాయి. అయితే ఆగస్టు వచ్చే నాటికి ఈ రేటుకు కూడా కూలీలు పనిచేయడం లేదు. దీంతో వారి భాగస్వామ్యం తగ్గింది.

గ్రామీణ మార్కెట్లలో తగ్గిన ఉపాథి అవకాశాలు
సిపిహెచ్‌సి కార్మిక గణాంకాల మేరకు గ్రామీణ మార్కె ట్లలో పెరుగుతున్న కార్మికులు తగినంత ఉపాథి పొందలేక పోతున్నారు. దీని ఫలితంగా ఆగస్టు తొలి వారాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగితా రేటు 41శాతం కన్నా తక్కువగా ఉంది. గడిచిన 12 నెలలకు గాను 8 నెలల్లో ఈ రేటు 41 శాతం కన్నా తక్కువగా ఉంది. గ్రామీణ కూలీ ల వేతనాలు తగ్గుతున్న కొద్దీ కొంత ఒత్తిడి వాతావరణం ఏర్పడుతుంది. కాని ఈ పరిస్థితి పట్టణ ప్రాంతాల్లో కనిపిం చదు. దీంతో ఉద్యోగితా రేటు క్రమంగా పడిపోతున్నది. ఈ ఏడాది జులై నాటికి 36.8 శాతానికి పడిపోయింది. అందువల్ల గ్రామీణ కార్మికులకు డిమాండ్‌ తగ్గడంఅంత మంచిది కాదు.

– రచయిత సిఎంఐఇ ఎండి, సిఇఓ. 
(బిజినెస్‌ స్టాండర్డ్‌ సౌజన్యంతో)

(Courtacy Prajashakti)

 

RELATED ARTICLES

Latest Updates