డాడీ.. మ్యాంగోస్ కావాలి…!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
By Vijay Sadhu
డాడీ.. మ్యాంగోస్ కావాలి…! ఒకటికి పదిసార్లు నాకు.. నా చిన్నబిడ్డ ఇచ్చిన ప్రేమపూర్వక ఆదేశం. ఇంతకు ముందు అయితే వెంటనే మార్కెట్‌కు వెళ్లి వందసార్లు చెక్ చేసి మరీ కొనేవాడిని. కానీ ఇప్పుడు కన్నీళ్లు,కోపం రెండు కలిసి కుదిపేసాయి. ఇంత నీచత్వం మధ్య నిస్సహాయుడిగా బతుకుతున్నందుకు అసహ్యం వేసింది. ఒక నిరసన, ఒక నినాదం అదీ కుదరనప్పుడు ఒక సానుభూతి వాక్యమో, వ్యాసమో రాసేసి … ఇంకేమి చేయలేని నిర్లిప్తతకు అంబాసిడర్‌గా నిల్చున్నందుకు సిగ్గనిపించింది. బిడ్డ అడిగినందుకు మామిడిపండ్లు పంపించాలో లేక “బిక్కిశ్రీను” శవం చూపించాలో తెలియని దుస్ధితి. నేను ఉన్నాను, అడిగింది తెచ్చిస్తాననే ధైర్యంతో నా బిడ్డ నన్ను అడిగింది. మరి రాలిన మామిడిపండ్లను ఏరుకున్నాడనే కసితో చిత్రహింసలు పెట్టి, హత్య చేస్తే అనాధలైన శ్రీను బిడ్డల పరిస్ధితి ఏమిటి..? ఏదైనా తినాలనిపిస్తే అడిగేందుకు ఇప్పుడు వాళ్ల నాన్న లేడు, ఈ పరిస్ధితుల్లో శ్రీను సహచరి ఆ బాధ్యత తీర్చలేదు. మామిడిపండ్లు ఏరుకున్నందుకే మా నాన్నను చంపేసారనే నిజం వాళ్లకు తెలిసినప్పుడు… వాళ్లను ఓదార్చే ధైర్యం ఎవరికి ఉంది..? వారి కంటిపాపల్లో ముద్రితమైన శ్రీను దేహాన్ని, మామిడిపండ్లను చూసినప్పుడల్లా వద్దన్నా కన్పించే వాళ్ల నాన్న హత్యను ఎవరు చెరిపేయగలరు..? మామిడిపండ్లు కాదు వేళ్లూనుకున్న కులమే మా నాన్నను చంపిందనే వాస్తవం వాళ్లను ఆవహించినప్పుడు ఎదురుగా ఎవరు నిలబడగలరు…? బదులు తోచని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. మామిడిపండ్లను చూసినప్పుడల్లా అవి తెగనరికితేనో, ఉరి వేస్తేనో.. వేలాడే దళితుల తలలుగానే కన్పిస్తున్నాయి. ఇక ముందు కన్పిస్తాయి కూడా. అందుకే చెప్తున్నా… ఇంతటి దుర్మార్గ వ్యవస్ధలో నిస్సహాయుడిగా బతుకీడుస్తున్నందుకు సిగ్గుపడుతున్నా… ఓ మానవత్వమా నన్నుశిక్షించు

 — feeling sad.

 

RELATED ARTICLES

Latest Updates