ఇంకా ఎదురుచూపులే..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– గిరిజన విద్యార్థులకు అందని నోటు పుస్తకాలు
యూనిఫాంల పరిస్థితీ అంతే
పాఠశాలలు ప్రారంభమైనా ఖరారు కాని టెండర్లు 

పాఠశాలల ప్రారంభం నాటికే నోటు పుస్తకాలు, యూనిఫాంలు విద్యార్థులకు అందించాల్సి ఉన్నా అమలు కావడం లేదు. ముందస్తుగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో విద్యార్థులకు వీటిని పంపిణీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విద్యార్థులు వాటి కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశా లలు ప్రారంభమై 45 రోజులు అవుతున్నా గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో చదువుతున్న వారికి ఇంత వరకు నోటు పుస్తకాలు కానీ, యూనిఫాంలు కానీ పంపిణీ చేయలేదంటే ఏ మేరకు చిత్త శుద్ధి ఉందో అర్థమవుతోంది. 13 జిల్లాల్లో 189 గిరిజన గురు కుల పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 50 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 405 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 90వేల మంది గిరిజన విద్యార్థులు వీటిల్లో ఆశ్రమం పొందుతూ చదువు కుంటున్నారు. ప్రతి ఏటా వీరికి నోటు పుస్తకాలతో పాటు యూనిఫాంలు పంపిణీ చేస్తున్నారు. తరగతులను బట్టి పంపిణి చేసే నోటు పుస్తకాల సంఖ్యలో మార్పు ఉంటుంది. ఒక్కో విద్యార్థికి సగటున 8 నుంచి 9 నోటు పుస్తకాలు అందిస్తున్నట్లు క్షేత్ర స్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు. అలాగే ఒక్కో విద్యార్థికి నాలుగు జతల యూనిఫాంలు అందిస్తున్నారు. అయితే ఏ నాడు వీరికి ప్రారంభం నాటికే నాలుగు జతలు ఇచ్చింది లేదు. నోటు పుస్తకాలు అందించింది లేదు.
ఆప్కో కొనుగోళ్లపై ఆరోపణలు 
యూనిఫాంలకు కావలసిన బట్టను ఆప్కో నుంచి కోనుగోలు చేయాలనే నిబంధన ఉంది. ఆ మేరకు ప్రతి ఏటా ఆప్కో ద్వారానే కొనుగోలు చేస్తు న్నారు. అయితే గతంలో ఈ కొనుగోళ్లకు సంబం ధించి పలు ఆరోపణలు వినిపించాయి. దుస్తులు నాణ్యత ఉండటం లేదని, నాసిరకం బట్టతో యూని ఫాంలు ఇస్తున్నారనే విమర్శలు వినిపించాయి. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాడు ప్రతిపక్ష నేతగా ఉండగా ఆరో పించారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం కొనుగోళ్లను ఆప్కోయేతర సంస్థల ద్వారా చేపట్టా లని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సమాలోచ నలు చేశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఆప్కో ద్వారానే కొనుగోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది కొనుగోలుకు సంబంధిం చిన ప్రక్రియ ఇటీవలే పూర్తి అయినట్లు తెలిసింది. కాగా యూనిఫాంలు కుట్టించే బాధ్యతలు ఎస్‌హెచ్‌ జిలతో పాటు మెప్మాకు అప్పగించాలని నిర్ణయించి నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే స్వయం సహాయక బృందాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే మెప్మా ఆధ్వర్యంలో యూనిఫాంలు కుట్టించ నున్నారు. స్థానిక స్వయం సహాయక బృందా (ఎస్‌హెచ్‌జి)ల ద్వారా యూనిఫాంలు కుట్టించాలనే నిబంధనలను గతేడాది తుంగలో తొక్కి కేవలం మెప్మాకే అప్పగించారు. విద్యార్థులకు కొలతలు లేకుండానే కుట్టారని, దీంతో చాలా వరకు యూని ఫాంలు తొడుక్కునేందుకు వీల్లేకుండా పోయాయనే విమర్శలు వినిపించాయి.
టెండర్ల దశలోనే నోటు పుస్తకాలు 
నోటు పుస్తకాల సంగతి ఇంకా దారుణంగా ఉంది. ఇంత వరకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. రేట్లు భారీగా ఉన్నాయనే కారణంతో రీ టెం డర్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సహజంగా ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాలకే టెండర్లు నిర్వహించి మే నెలకు విద్యార్థులకు అందిం చాల్సిన అన్ని వస్తువులను సిద్ధం చేసి ఉంచాలి. పాఠశాలలు ప్రారంభం కాగానే పంపిణీ చేయాలి. కానీ అది ఎన్నడూ కార్యరూపం దాల్చ లేదు.

(Courtacy Prajashakti)

RELATED ARTICLES

Latest Updates