జులై 26న “రిజర్వేషన్ డే” విజయవంతం చేయండి..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రపంచ మానవహక్కుల నేత”డాక్టర్ బాబాసాహేబ్” లాంటి ప్రపంచ మేధావిని విదేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక సహాయం అంధించి చదువు పూర్తి చేసివచ్చిన “డాక్టర్ బాబాసాహేబ్”కు కొల్హాపూర్ సంస్థానంలో గవర్నర్ స్థాయి ఉద్యోగం ఇచ్చి గౌరవించిన ★ మానవతమూర్తి జయహో సాహూజీ జయ జయహో ఛత్రపతి సాహుజీ…!

విస్మరించిన చరిత్ర వారసులం ఏకమై తీరుతాం..!!

1902లో మనిషికి సమానత్వం నేర్పిన మహానీయుడు ఛత్రపతి సాహుమహారాజ్ చరిత్రను బుర్రకథలుగా బహుజన సమాజానికి విడమార్చి చెపుదామురండోయ్..  రండీ..!!!

★ఒరేయ్ మీరు శూద్రులురా మీకెందుకురా చదువులన్న వాడి నడ్డిమీదతన్ని శూద్ర జాతిని విద్యాదికరించిన వీర యోధుడు స్వాతంత్ర్యానికి పూర్వమే అధికారంలో వాటాలేని బహుజనులకు 50%  రిజర్వేషన్ కల్పించిన మొదటి సామాజిక న్యాయ నిర్మాత “ఛత్రపతి సాహుమహారాజ్” జన్మదిన వేడుకల్లో బాగంగా జులై 26 “రిజర్వేషన్ డే”ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్డులో గల వైశ్రయ్ గార్డెన్ లో మధ్యహ్నం 12 గంటలకు ఎస్సీ,ఎస్టీ,ఎంబిసి,బీసి, మైనారిటీ,విద్యార్థి,యువజన, మహిళా సంఘాల ఆద్వర్యంలో జరిగే సభలో బహుజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి..

దండి వెంకట్✍

ఎంబిసి&డిఎన్టి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ

RELATED ARTICLES

Latest Updates