ఆకలితో అలమటిస్తూ గిరిజన మహిళ మృతి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

లాక్‌డౌన్ సమయంలో ఒడిశాలో విషాదం

భువనేశ్వర్ (ఒడిశా): కరోనా కల్లోల సమయంలో ఓ గిరిజన మహిళ ఆకలితో మరణించిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని నయాఘడ్ జిల్లాలో వెలుగుచూసింది. నయాఘడ్ జిల్లాలోని కలియంబా గ్రామానికి చెందిన దుఖీ జానీ అనే 46 ఏళ్ల గిరిజన మహిళ జూన్ 24వతేదీన ఆహారం కోసం అడవిలోకి వెళ్లింది. ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తూ దుఖి జానీ అనే మహిళ అడవిలోనే కుప్పకూలి పోయి మరణించింది.

ఒడిశా ఖాద్యా అధికార్ అభియాన్ కు చెందిన నిజనిర్ధారణ బృందం ఈ నెల మొదటివారంలో కలియంబా గ్రామాన్ని సందర్శించగా ఆకలి చావు అని తేలింది. దుఖి జానీ మరణించే ముందు మూడు రోజులుగా ఆమె తినేందుకు ఆహారం దొరకలేదని నిజనిర్ధారణ బృందం పరిశీలనలో వెల్లడైంది. ఆకలితో మరణించిన దుఖిజానీని భర్త వదిలేశాడని వెల్లడైంది. జానీ మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు డబ్బుల్లేక ఆమెను గ్రామస్థులు ఖననం చేశారు.

దుఖీ జానీకి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో ఆమె అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడింది. ఆమెకు సబ్సిడీ బియ్యం కూడా అందలేదని ఆహార హక్కుల ఫోరం సభ్యుడు సమీత్ పాండా చెప్పారు. మృతురాలు దుఖీజానీకి అన్నపూర్ణ కార్డు ఉన్నప్పటికీ ఆమెకు చివరిసారిగా 2018లో బియ్యం ఇచ్చారు. 2018 నవంబరు నుంచి ఆమెకు ఉచిత రేషన్ లేకుండా పోయింది. ఒంటరి మహిళ పెన్షన్ కోసం పంచాయతీ, బ్లాక్ అధకారులకు దరఖాస్తు చేసుకున్నా రాలేదని తేలింది.

ఆకలితో అల్లాడుతూ మరణించిన గిరిజన మహిళకు ఉపాధి హామి పథకం జాబ్ కార్డు లేదని, ఆమెకు లాక్ డౌన్ సమయంలో జనధన్ మద్ధతు కూడా లభించలేదు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఇచ్చే బియ్యం, పప్పులు కూడా ఆమెకు అందలేదు. గ్రామ పంచాయతీ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లాక్ డౌన్ ప్రారంభంలో జానీకి కొన్నిరోజులు ఆహారం పెట్టారని అంగన్ వాడీ కార్మికురాలు బసంతి చెప్పారు. అది కాస్తా ఆగిపోవడంతో దుఖికి ఎవరి నుంచి సాయం అందక ఆకలితో మరణించిందని స్థానికులు చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో గిరిజన మహిళ ఆకలి చావు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Courtesy AndhraJyothy

RELATED ARTICLES

Latest Updates