జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహనా సదస్సులో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే DNR

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

పేదప్రజలకు ఎంతమేరకు ప్రభుత్వం మేలు చేయగలదో అంత మేరకు మేలుచేసే ఆలోచనతోనే ముఖ్యమంత్రి జగనన్న ఉన్నారని చెప్పడానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం తార్కాణం అని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు.ఈ మధ్యాహ్నం కలిదిండి మండలపరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహనా సదస్సులో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ తండ్రి రాజన్న పేదల సంక్షేమం కోసం ఒక అడుగు ముందుకువేస్తే..జగనన్న పది అడుగులు ముందుకు వేస్తున్నారని అన్నారు.ఇచ్చిన మాటను ఆరు నూరైనా అమలుచేసి తీరుతాడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించి… చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకాన్ని ప్రజల్లో పాదుకొల్పిన ఘనత మన సీఎం జగనన్నదే నన్నారు. గతంలో ప్రభుత్వం గృహానిర్మాణ శాఖ ద్వారా రుణం పొంది ఇళ్లు నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులు ఇపుడు కేవలం పదివేలు చెల్లిస్తే అప్పు మాఫీ చెయ్యడమే కాక ఇంటిపై సంపూర్ణ అధికారాలు కల్పించడం ఈ పధకం ఉద్దేశ్యం అని..దీన్ని ప్రతి లబ్ధిదారుడు వినియోగించుకునేలా గ్రామ సచివాలయ అసిస్టెంట్ లు,పంచాయతీ కార్యదర్సులు గ్రామాల్లో చైతన్యం తెచ్చి ప్రజలకు మంచి చేసి ప్రభుత్వ ఉద్దేశ్యం నెరవేర్చాలని ఎమ్మెల్యే కోరారు. సభకు అధ్యక్షత వహించిన ఎంపిపి చందన ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఒక మంచి ఆలోచనతో చేసిన సంకల్పం ఎంతో మంది పేదలను లక్షాధికారుల్ని చేస్తుందని..ఇంత మంచి పధకం ప్రవేశపెట్టిన ఈ పథకం ను ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ రోజు మన మండలంలో లాంచ్ చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొర్రా సత్యవతి, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి శ్రీదేవి, మండల ఉపాధ్యక్షురాలు కూసంపూడి కనక దుర్గారాణి,ఇంచార్జ్ ఎంపీడీఓ శ్రావణ్ కుమార్, మండలంలోని పంచాయితీ కార్యదర్సులు, డిజిటల్ అసిస్టెంట్లు,ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates