ఆటపాక – హై స్కూల్ నందు జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించిన కైకలూరు MLA DNR

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
విద్యార్ధులకు విద్యా కానుక కిట్స్ పంపిణీ చేస్తున్న కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.

ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవాలి, ఆంగ్లంలో విద్య నేర్చి ప్రపంచాన్ని జయించాలి అన్నది జగనన్న బృహత్తర ఆశయం అని. ఆ దిశగా విద్యకు ప్రోత్సాహకాలు అందిస్తూ మీ వెన్నంటి ఉండే మీ అందరి మేనమామ జగనన్న అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు.

ఈ సాయంత్రం ఆటపాక నిమ్మగడ్డ నాగభూషణం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ పేదవారు, రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో తన చిన్నతనంలో పిల్లల్ని పాఠశాలకు పంపడం అయ్యేదికాదని. చదువు యొక్క విలువ తెలియకపోవడం తల్లిదండ్రులు కూడా చదివితే ఏమి వస్తుంది కూలికి వెళ్తే కొంత సొమ్మయినా వస్తుందనే ఆశతో ఆలోచించడం కారణంగా చదువులు కుంటుపడేవి అని అన్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కి భిన్నంగా ప్రతి పేద మధ్యతరగతి పిల్లలు తప్పనిసరిగా పాఠశాల కు వెళ్లి చదువుకుని ఉన్నత విద్యావంతులుగా మారి జీవితాల్లో స్థిరపడేలా జగనన్న తీసుకుంటున్న శ్రద్ధ, ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శనీయాలని అన్నారు. జగనన్న అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని అందరూ అందిపుచ్చుకుని జీవితాల్లో ఎదగాలని ఎమ్మెల్యే కోరారు.

సభకు ఎంఈఓ దొడ్డా రామారావు అధ్యక్షత వహించగా గుడివాడ డివిజన్ ఉప విద్యాశాఖాధికారిణి కమలకుమారి, ఎంపిపి అభ్యర్థి అడివి కృష్ణ, ఆటపాక సర్పంచ్ తలారి మణెమ్మ, మైనార్టీ నాయకులు అబ్దుల్ హమీద్, పాఠశాల విద్యా కమిటీ సభ్యుడు ఎరుక నాయుడు మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా జగనన్న విద్యా కిట్స్ పంపిణీ జరుగగా ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దత్తి శ్రీలక్ష్మి, సభ్యులు వరప్రసాద్, నాయకులు ఆటపాక ఉప సర్పంచ్ బావిశెట్టి నాగేశ్వరరావు, తలారి జాన్,పెంచికలమర్రు సర్పంచ్ జయమంగళ కాసులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కూనవరపు సతీష్, మదన్, విజయ్,పెద్దిరాజు, బందా నారాయణ,కన్నా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates