ఆటపాక హై స్కూల్ నందు నాడు నేడు పనులు పరిశీలించిన DNR

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అత్యాధునిక సౌకర్యాలతో..అత్యున్నతమైన విద్యను అందించి..విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో అమలు చేస్తున్న అత్యుత్తమ అభివృద్ధి పథకం మనబడి నాడు నేడు పథకం అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు.ఈ సాయంత్రం ఆటపాక నిమ్మగడ్డ నాగభూషణం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో నాడు నేడు పథకం ద్వారా పూర్తిచేసుకున్న వివిధ పాఠశాల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ..ఆధునిక హంగులతో,అన్ని సౌకర్యాలతో, ఈ రోజు పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని..ఇది ఒక చరిత్ర అని అన్నారు. అన్ని విధాల అర్హతలు కల్గిన టీచర్స్ పర్యవేక్షణ లో బడికి వచ్చి చదువుకోవడమే పిల్లల ధ్యేయం కావాలని అన్నారు.తల్లిదండ్రులు కూడా ఆ దిశగా పిల్లల్ని ప్రోత్సహించి..ప్రభుత్వం అందించే అన్ని సదుపాయాలు అందుకుంటూ తమ తమ కుటుంబాలను వృద్ధిలోకి తెచ్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడివాడ డివైఈఓ కమలకుమారి, ఎంఈఓ రామారావు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,నాయకులు అడివి కృష్ణ, ఆటపాక సర్పంచ్ తలారి మణెమ్మ,ఉపసర్పంచ్ బావిశెట్టి నాగేశ్వరరావు(పాము),నాయకులు నిమ్మల సాయి,కూనవరపు సతీష్,అబ్దుల్ హమీద్, జయమంగళ కాసులు,మదన్,విజయ్,పెద్దిరాజు, బందా నారాయణ, కన్నా సాంబయ్య, విద్యా కమిటీ చైర్మన్ దత్తి శ్రీలక్ష్మి, సభ్యులు వరప్రసాద్, ఎరుక నాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates